ADD

Friday 2 September 2016

అన్నదాతను ఆదుకుందామిలా.....! తెలంగాణ నూతన వ్యవసాయవిదానం ఉండాలిలా ....

అన్నదాతను ఆదుకుందామిలా.....!

   తెలంగాణ నూతన వ్యవసాయవిదానం ఉండాలిలా .... 

దేశంలోనే వేగంగా అభివృద్ధి లో దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ,లక్ష కోట్ల ప్రాజెక్టులకు సైతం నెల రోజుల్లో అనుమతులు ఇచ్చేలా ప్రపంచంలోనే ప్రసిద్ధమైన నూతన ఏకగవాక్ష పారిశ్రామిక విదానం రూపొందించుకున్నాం,తెలంగాణాని ప్రపంచ విత్తన బండాగారం లా తీర్చిదిద్దాలని,తెలంగాణను కోటి ఎకరాల మాగాణంలా మార్చాలనే ఆశయంతో ముందుకు వెళుతున్నాం కానీ అన్నదాత ఇంకా నిరాశ కోరల్లోనే ఉన్నాడు... 
--తెలంగాణ పారిశ్రామిక విధానంతో క్షణాల్లో అనుమతులు 
--ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ కార్పోరేషన్ లు ఏర్పాటు చేసి,వేల కోట్ల నిదులు కేటాయిస్తున్నాం 
--ముఖ్యమంత్రి సహాయనిధి పేరిట ఎన్నోకోట్లతో  ఎంతోమంది  నిరుపేదల ప్రాణాలు నిలబెడుతున్నాం 
కానీ 
-అన్నదాతల రుణమాపీకి విడతల వారీగా ఇస్తూ సాగదీస్తూనే  ఉన్నాం 
-రైతుల ఇన్ ఫుట్ సబ్సిడీలకు ఎదురుచూపులే దిక్కు 
-అతివృష్టి ,అనావృష్టి వంటి కారణాలవల్ల పంటనష్టం వాటిల్లిన ప్రతిసారీ నష్టపరిహారం కోసం ఎదురుచూపులే 
-దేశంలో ఎంతోమంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నా వారికి వ్యవసాయం కనుచూపుమేరలో కూడా ఉపాధిగా అనిపించక ఒకతరాన్ని సేద్యానికి దూరం చేశాం 
   ప్రస్తుతం ఉన్న ఈ  పరిస్థితుల్లో మార్పు రావటానికి అన్నదాత ను ఆదుకోవడానికి తెలంగాణ నూతన వ్యవసాయ విధానం అత్యావశ్యకం 

తెలంగాణ నూతన వ్యవసాయ విధానం :

--రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే  అవసరం లేకుండా తక్షణం రుణాలు అందేలా ఏకగవాక్ష విదానం 
-- రైతు యూనిట్ గా పంటల భీమా భీమా 
--తెలంగాణ రైతు కార్పొరేషన్ ,రైతులకు పంట నష్టపరిహారం,ఇన్ ఫుట్ సబ్సిడీ త్వరగా త్వరగా అందేలా రైతు సహాయ నిధి ఏర్పాటు 
--రైతులకు సేంద్రీయ సేద్యం పై అవగాహన కల్పించేలా వ్యవస్థ 
--దళారుల వ్యవస్థ రూపుమాపి రైతుల పంటలను మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేపట్టడం 
--రైతులకు తమ పంటలను నిలువ చేసుకునేందుకు అవసరమైన గోదాములను నిర్మించడం 
--వ్యవసాయం ,అనుబంధ రంగాలను ఒకే వ్యవస్థ కిందకు తెచ్చి రైతులు వాణిజ్య పంటల వైపు మారలేలా అవగాహన 
--వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంలా తీర్చిదిద్దడం 
--విత్తనోత్పత్తి రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం 
--నిరుద్యోగ యువత వ్యవసాయం పై దృష్టి సారించేలా ప్రోత్సాహకాలు 

1 comment:

  1. వ్యవసాయం రానురాను చాలా దిగజారిపోతోంది ఆలా కాకుండ ఉండాలంటే దీనికి సరైన మార్గం ప్రభుత్వ పరంగా చిన్న సన్న కారు రైతులను అన్ని విధాలా అంటే వ్యవసాయం అతనికి ఉత్సాహం వచ్చే విదంగా ప్రభుత్వపథకాలు ప్రవేశ పెట్టాలి ..

    ReplyDelete