ADD

Saturday 19 March 2016

మౌకా యాడ్ కి మళ్లీ నిరాశ...!

 మౌకా యాడ్ కి మళ్లీ నిరాశ...!


భారత్-పాక్ మ్యాచ్ అనగానే గుర్తొచ్చే మౌకా యాడ్ లో పాక్ అభిమాని భారత్ పై మ్యాచ్ గెలవగానే సంబరాలు చేసుకోవడానికి అటకమీద దాచిన క్రాకర్స్ తీసి ఎదురుచూసే మౌకా యాడ్ లోని అభిమాని కి మరోమారు నిరాశే మిగిలింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్  నిర్ణీత 18ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 118పరుగులు చేసింది. 119పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే 23పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడి పాక్ అభిమానికి ఆశలు రేపినా చివరకు నిరాశే మిగిలింది. 

భారత్ కు శుభరాత్రి...పాక్ కి కాలరాత్రి...!

భారత్ కు శుభరాత్రి...పాక్ కి కాలరాత్రి...!



భారత్-పాక్ మ్యాచ్ అనగానే మలుపులతో ముచ్చెమటలు పట్టేవి కాని మ్యాచ్ మొదలవకముందే అభిమానులకు వరణుడు ముచ్చెమటలు పట్టించి మునివేళ్ళపై నిలబెట్టగా 8.10నిమిషాలకు టాస్ గెలిచి పాక్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించిన ధోని నిర్ణయాన్ని వమ్ము చేయకుండా పిచ్ టర్న్ ఉపయోగించుకుంటూ భారత్ బౌలర్లు పాక్ బ్యాటింగ్ ఆర్డర్ ని కట్టడి చేసారు. స్లో గా పాక్ బ్యాటింగ్ ని మొదలెట్టగా 38పరుగుల వద్ద రైనా 1/4 సర్జీల్ ఖాన్ 17ని అవుట్ చేయగా భూమ్ర 1/32 అహ్మెద్ శేహజాద్ 25ని పెవిలియన్ కి పంపాడు. నెమ్మదిగా సాగుతున్న పాక్ ఇన్నింగ్స్ ని ఉమర్ అక్మల్ 22,మాలిక్ 26 మెరుపు బ్యాటింగ్ తో పాక్ నిర్ణీత 18 ఓవర్లలో 117పరుగులు చేసింది. 
118పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కి రోహిత్ శర్మ 10పరుగుల వద్ద వెనుదిరగగా సమి ఒకే ఓవర్లో రైనా ,రోహిత్ లను అవుట్ చేసి 23/3 తో భారత్ ని కష్టాల్లో పడేయగా కోహ్లి 37బంతుల్లో 55 సూపర్ బ్యాటింగ్ తో జతకలిసి యువరాజ్ 23బంతుల్లో 24పరుగులు చేసి 61పరుగుల బాగస్వామ్యం నెలకొల్పి భారత ఇన్నింగ్స్ గాడిలో పెట్టారు. కోహ్లి తో కలసి ధోని భారత్ ని విజయతీరాలకు చేర్చాడు. 6వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాదించి వరల్డ్ కప్ లో పాక్ పై విజయాల పరంపర కొనసాగించారు. 

ఖమ్మం కోటలో కారు ప్లీనరీ...!

ఖమ్మం కోటలో కారు ప్లీనరీ...!

తెలంగాణా ఏర్పడ్డాక జరుగుతున్న పార్టీ రెండో ఆవిర్భావ సభ ,ప్లీనరీని ఈసారి ఖమ్మం లో నిర్వహించాలని నిన్న జరిగిన సమావేశం లో నిర్ణయించారు.ఖమ్మం లో ప్లీనరీ నిర్వహించి,విజయవంతం చేయడంతో పార్టీ ఖమ్మం లో భలోపెతం అవ్వడమే కాక పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెంపొందుతుందని.  వచ్చేనెల 27లోపే నామినేటెడ్ పదవులు భర్తీ చేసి,పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం విరాళాలు సేకరించాలని నిర్ణయించారు . ఏప్రిల్ 27న పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉదయం ప్లీనరీ నిర్వహించి సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్వహించారు. 

కెసిఆర్ టార్గెట్ 100/119;125/153@2019

కెసిఆర్ టార్గెట్ 100/119;125/153@2019

నిన్న తెలంగాణా భవన్ లో కెసిఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపిలు,ఎమ్మెల్సీ ల సమావేశం లో కెసిఆర్ తన టార్గెట్ 2019గురించి నాయకులకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సదభిప్రాయంతో ఉన్నారని ,మునుపటి ప్రభుత్వాలతో పోల్చితే అవినీతి తగ్గిందని ,అయితే పార్టీ ఎమ్మెల్యేలు ,మంత్రులు,ఎంపి లు అవినీతికి దూరంగా ఉండాలని,మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో తలదూర్చోద్దని ,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని ,2014ఎన్నికల్లో 63సీట్లుగెలుచుకున్నమన బలం ప్రస్తుతం 83కి చేరుకుంది. పార్టీలో చేరిన నాయకులతో సమన్వయం తో ముందుకెళితే  2019లో కూడా అధికారం మనదేనని,అసెంబ్లీ సీట్ల పెంపు లేకపోతే 100సీట్లు ,సీట్లు పెరిగితే 125సీట్లు మనవే అని కెసిఆర్ నాయకులకు తెలిపారు. 

పీఏసీ చైర్మెన్ గా గీతారెడ్డి???

పీఏసీ చైర్మెన్ గా గీతారెడ్డి???


రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఖాళీ అయిన శాసన సభ ప్రజాపద్దుల కమిటీ చైర్మెన్ గా దాదాపు గీతారెడ్డి పేరు ఖరారైంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి పీఏసీ చైర్మెన్ పదవి ఇవ్వడం ఆనవాయితి కావడంతో ప్రదాన ప్రతిపక్షం కాంగ్రెస్ కి ఈ పదవి దక్కనుంది. ఈ పదవి రేసులో గీతారెడ్డి తో పాటు ఆరుసార్లు గెలిచినా జీవన్ రెడ్డి సైతం పోటీలో ఉన్నా సామాజిక సమీకరణాలు,మహిళా శాశన సభ సభ్యురాలు కావడంతో గీతారెడ్డి కి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రజాపద్దుల కమిటీ ,పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థల సమితీ ఎన్నికల కోసం ఈరోజు నోటిఫికేషన్ వెలువడనుంది. 

Friday 18 March 2016

చంద్రబాబు దుర్యోధన-ద్రౌపది పర్వం ???రోజాపై మూడేళ్ల సస్పెన్షన్ కి రంగం సిద్దం చేస్తున్న టిడిపి???

చంద్రబాబు దుర్యోధన-ద్రౌపది పర్వం ???రోజాపై మూడేళ్ల సస్పెన్షన్ కి రంగం సిద్దం చేస్తున్న టిడిపి???

రోజాకు హై కోర్టులో ఊరట లభించడం టిడిపి అహాన్ని దేబ్బతీసినట్టుగా అవడంతో ఈసారి అహంతో పగడ్బందీగా రోజాపై మూడేళ్ల సస్పెన్షన్ కి రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది. డిప్యూటి స్పీకర్ మండలి బుద్దప్రసాద్ నేతృత్వంలో రోజా తీరుపై వేసిన ప్రివిలేజ్ కమిటీ సిపారసుల పేరుతో రోజాపై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆదారంగా మూడేళ్ల సస్పెన్షన్ విదించాలని టిడిపి రంగం సిద్దం చేస్తుంది. ఈ కమిటీ నిర్ణయం పేరుతో మూడేళ్ల సస్పెన్షన్ వేసి,ఇప్పటికే రోజా కి అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై హై కోర్టు బెంచ్ వద్ద సవాల్ చేసిన టిడిపి సర్కార్ రోజా పై దుర్యోధన-ద్రౌపది పర్వం కి తెరలేపింది. 


కెసిఆర్ పనితీరుపై కిరణ్ కుమార్ రెడ్డి ఫిదా .....!

కెసిఆర్ పనితీరుపై కిరణ్ కుమార్ రెడ్డి ఫిదా .....!

తెలంగాణా రాష్ట్రం ఇస్తే అంధకారం అవుతుంది,శాంతిబద్రతలకు విఘాతం కలుగుతుంది అని ఉత్తర కుమార ప్రగల్బాలు పలికిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విబజన అనంతరం రాష్ట్ర రాజకీయాలకు దూరమైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితుల వద్ద కెసిఆర్ పనితీరుపట్ల పిదా అయ్యానని చెప్పాడట. తొలిసారి అధికారంలోకి వచ్చినా ఎలాంటి తప్పులకు తావివ్వకుండా హైదరాబాద్ లో శాంతి బద్రతలు ,తెలంగాణా విద్యుత్ సమస్యలు మొదలగు అంశాలపై ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని తన అనుచరులతో చెప్పారని సమాచారం. 

కృష్ణా జలాలపై బాబు కిరికిరి

కృష్ణా జలాలపై బాబు కిరికిరి 

శ్రీశైలం కృష్ణా జలాలపై ఆంధ్ర కిరికిరి మొదలెట్టింది. కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు 299,ఆంధ్రకు 512టిఎంసీ లు కేటాయించారు. దీనిప్రకారం శ్రీశైలం కి ఎక్కువ వరద వచ్చినా,నీటి లోటు ఉన్నా ఇదే దమాష ప్రకారం నీటిని పంచుకోవాలి కాని ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా శ్రీశైలం లో వరుద నీరు చేరకపోవడంతో ఈ సారి ఇంతవరకు తెలంగాణా 62.63,ఆంధ్రప్రదేశ్ 124. 14టిఎంసీ లు వాడుకున్నాం. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం ఇప్పటికే 6టిఎంసీ ల నీరు ఎక్కువ వాడుకుంది,ఇప్పుడు ఇక ఉన్న నీటి లభ్యత మొత్తం తెలంగాణా కి మాత్రమే వాడుకునే హక్కు ఉన్నా మరోమారు కృష్ణా బోర్డు దగ్గర పైరవీలు మొదలెట్టి మరో 4.5టిఎంసీ లు కేటాయిన్చుకుంది. ఇది అక్రమం అని తెలిసిన అడ్డగోలు వాదనలతో కృష్ణా వాటర్ కిరికిరి మొదలెట్టింది. 

జీవనది మూసీ పై ఆకాశామార్గాలు....!

జీవనది మూసీ పై ఆకాశామార్గాలు....!

మురికి కూపంలా మారిన మూసీ నదిని ఒకప్పటి జీవనదిలా మార్చి మూసీపై ఆకాశ మార్గాన్ని నిర్మించాలని తెలంగాణా ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేసింది. 6000కోట్ల వ్యయంతో మూసిపై 41 కిలోమీటర్ల పొడవునా గంటకు 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఔటర్ వే పెద్ద అంబర్ పెట్ దగ్గరలోని బాచారం నుంచి నాగోల్ వంతెన వరకు ఆరు వరసల రేడియల్ రహదారిని మూసిపై ఈ ఆకాశమార్గం మొదలవుతుంది. బాచారం ,నాగోల్,చాదర్ఘాట్ ,నయాపూల్ ,అత్తాపూర్ ,నార్సింగి మధ్య ఈ వంతెన నుంచి అంతర్గత రోడ్లకు వెళ్లడానికి కూడళ్ళను ఏర్పాటు చేయనున్నట్లు నమూనా అధికారులు రూపొందించగా ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతించగా తొందర్లోనే పనులు మొదలెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. 


మామ-అల్లుడి ఇలాకాలో మోగనున్న ఎన్నికల నగార???

మామ-అల్లుడి ఇలాకాలో మోగనున్న ఎన్నికల నగార???

కెసిఆర్ రాజకీయ అరంగ్రేటం చేసి అల్లుడు హరీష్ రావు తెరపైకి తెచ్చి కారు కంచుకోటగా ,మామ -అల్లుడి ఇలాకాగా ప్రసిద్ది గాంచిన సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమైంది. సిద్ధిపేట మున్సిపాలిటీలో 6శివారు గ్రామపంచాయితీల విలీనంపై కోర్టులో పిటీషన్ ఉండటంతో గత రెండు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ఎన్నికలకు రూట్ క్లియర్ కావడంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమాయత్తం అవుతుంది. గ్రేటర్ ,నారాయణ్ ఖేడ్ ,వరంగల్ ,ఖమ్మం ఎన్నికల ఘన విజయం తో జోరుమీదున్న టిఅరేస్ కి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల విజయం నల్లేరుమీది నడకే అయినా బారీ స్వీప్ పై కారు కన్నేసింది. సిద్దిపేట ఎన్నికల నోటిఫికేషన్ 19న వెలువరించి ,వచ్చే నెల 3న ఎన్నికల నిర్వహించి ,6న ఓట్ల లెక్కింపు చేపట్టనుంది . 

ఎయిర్ బస్ హేలిక్యాప్టార్ తయారి యూనిట్ @హైదరాబాద్

ఎయిర్ బస్ హేలిక్యాప్టార్ తయారి యూనిట్ @హైదరాబాద్ 

తెలంగాణా పారిశ్రామిక రంగ కీర్తి కిరీటంలోకి అంతర్జాతీయ వైమానిక రంగ దిగ్గజం ఎయిర్ బస్ చేరబోతుంది. 2500కోట్ల పెట్టుబడులతో సంవత్సరానికి 100న్యావి,100యుటిలిటీ హేలిక్యాప్టర్ల తయారీ సామర్ధ్యంతో 40ఎకరాల విస్తీర్ణంతో 4,500మందికి ఉపాది కల్పన ధ్యేయంగా ఎయిర్ బస్ హేలిక్యాప్టర్ల తయారి యూనిట్ హైదరాబాద్ లో ఏర్పాటుకు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రాజీవ్ శర్మ తో చర్చించింది. ఇందులో బాగంగా తమకు అభివ్రుద్ది చెందిన,పర్యావరణ అనుమతితో కూడిన,పరిశ్రమ స్థలం నుండి విమానాశ్రయానికి రోడ్డు వసతి గల 40ఎకరాల స్థలం కావాలని అడగగా తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాదర్ గుల్,ఆదిబట్ల ఏరోస్పేస్ పార్కు ఇందుకు అనుకూలంగా ఉంటుందని ఎయిర్ బస్ ప్రతినిదులకు తెలిపింది. రెండు,మూడు రోజుల్లో ఎయిర్ బస్ అధికారుల బృందం స్థల పరిశీలనకు రానుంది. 

Thursday 17 March 2016

రేపటినుంచి రంగంలోకి రోజా...!చంద్రబాబుకిక చెడుగుడే??

రేపటినుంచి రంగంలోకి రోజా...!చంద్రబాబుకిక చెడుగుడే??

ఆంధ్ర అసెంబ్లీ ఫైర్ బ్రాండ్ రోజా మళ్లీ అసెంబ్లీ గడప తొక్కనుంది. గత సెషన్ లో ఏడాది సస్పెన్షన్ ని సుప్రీం కోర్టులో సవాల్ చేసి సుప్రీం ఆదేశంతో విచారణ చేపట్టిన హై కోర్టు రోజాపై విదించిన సస్పెన్షన్ ఎత్తివేయడం తో హై కోర్టు తీర్పు కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందించిన రోజా రేపు సమావేశాలకు హాజరు కానుంది. హై కోర్టులో ఊరట లబించిన అనంతరం ప్రతిపక్ష నేత జగన్ ని కలిసి అసెంబ్లీ లో టిడిపి నేతల తీరుని ఎండగట్టటానికి సిద్దం కావాలని సూచించారు. రేపటి నుంచి రోజాకి తోడుగా ఉంటూ చంద్రబాబుకి చుక్కలు చూపించడానికి ప్రభుత్వ తీరుపై ద్వజమేత్తడానికి కావలసిన సమాచారం సేకరిస్తున్నారు. 

తెలంగాణా కీర్తి కిరీటంలోకి మరో ఏరోస్పేస్ పార్క్ @ఎలిమినేడు

తెలంగాణా కీర్తి కిరీటంలోకి మరో ఏరోస్పేస్ పార్క్ @ఎలిమినేడు 

ఇప్పటికే ఆదిబట్ల ,నాదర్ గుల్ ఏరోస్పేస్ పార్కులతో ఏరోస్పేస్ ,రక్షణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం కేటాయించుకున్న తెలంగాణా ప్రపంచంలోనే ఏరోస్పేస్ హబ్ గా నిలిపేందుకు కెసిఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఏవియేషన్ షో ప్రారంబోత్సవ సందర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ ఏవియేషన్ షో నిర్వహణకు హైదరాబాద్ కి మించిన వేదిక లేదని పేర్కొన్న కెసిఆర్ ఇప్పుడున్న ఆదిబట్ల ,నాదర్ గుల్ ఏరోస్పేస్ పార్కులను మించేలా ఎలిమినేడు లో మరో ఏరోస్పేస్ పార్కు ఏర్పాటు చేస్తామని అన్నారు. 

చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు షాక్

చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు షాక్

చంద్రబాబుకు రోజుకో షాక్ తగులుతూనే ఉంది.ముఖ్యమంత్రి,స్పీకర్ లపై అవిస్వాశాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నామన్న ఆనందంలో ఉండగానే చంద్రబాబు సర్కార్ కి మరో షాక్ తగిలింది. గత అసెంబ్లీ సమావేశాల్లో రోజా పై ఏడాది సస్పెన్షన్ విదించిన స్పీకర్ నిర్ణయం పై రోజా సుప్రీం కి వెళ్లగా సుప్రీం కోర్టు ఈ విషయాన్ని త్వరగా తేల్చాలని రోజాపై సస్పెన్షన్ విదించడం తన హక్కులను కాలరాయడమేనని సుప్రీం పేర్కొంది. రోజా పిటీషన్ విచారణ చేపట్టిన హై కోర్ట్ ఈరోజు ప్రభుత్వం విదించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఈరోజు నుండే రోజా ఆసెంబ్లీ సమావేశాలకు హాజరు కావొచ్చని పేర్కొంది. 

మరోమారు హైదరాబాద్ పై విషం చిమ్మిన చంద్రబాబు???

మరోమారు హైదరాబాద్ పై విషం చిమ్మిన చంద్రబాబు???

గత కొన్ని నెలలుగా తెలంగాణా ప్రభుత్వం తో ఎలాంటి గొడవలేకుండా ఉన్న చంద్రబాబు మరోమారు తన అక్కసు వెల్లగక్కాదు. చాల రోజులుగా మరచిపోయిన సెక్షన్-8 వివాదాన్ని మరోమారు తెరపైకి తెస్తున్నారు. నిన్న ఆంధ్ర అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ విబజన చట్టం లోని సెక్షన్ -8హైదరాబాద్ లో శాంతి బద్రతల అంశాన్ని గవర్నర్ కి అప్పగించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. సమసిపోయిన వివాదాన్ని మరోమారు తెరపైకి తెచ్చి గిచ్చి కయ్యం పెట్టుకోవడానికి సిద్దం అయ్యారు. 

Wednesday 16 March 2016

హైదరాబాద్ లో డిస్నీల్యాండ్.....!

హైదరాబాద్ లో డిస్నీల్యాండ్.....!

చిన్నారులకు అద్బుత ప్రపంచం సృష్టించిన ప్రపంచ దిగ్గజ సంస్థ డిస్నీల్యాండ్ ను హైదరాబాద్ లో ఏర్పాటుకు తెలంగాణ టూరిజం సంస్థ సన్నాహకాలు ప్రారంబించింది. ఇప్పటికే అమెరిక,హాంకాంగ్,సాంఘై లాంటి నగరంలో కోలువుదేరిన డిస్నీల్యాండ్ ని 300ఎకరాల స్థలంలో 25000కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించాలని,ఇందులో ప్రాచీన కట్టడాలు యురోపియన్ బిల్డింగ్స్,ద్రాగన్స్,డోనాల్డ్ డాక్స్,పిల్లలకు సంబందించిన పలు అంశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. 

తెలంగాణా నామినేటెడ్ పదవుల పందేరం???ఆశావాహుల్లో ఎమ్మెల్యేలు???

తెలంగాణా నామినేటెడ్ పదవుల పందేరం???ఆశావాహుల్లో ఎమ్మెల్యేలు???

తెలంగాణాలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల పందేరం త్వరలో ప్రారంబం కానుంది. ఇప్పటికే మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహులు పెరుగుతుండటంతో మంత్రి వర్గ విస్తరణ ముందే ఆశావాహుల జాబితాను తగ్గించేందుకు రంగం సిద్దం చేసారు. గతంలో పార్లిమెంట్ సెక్రెటరీ పదవులతో కొంతమందిని సంతృప్తి చెందించినా కోర్టు తీర్పుతో అది మూడునాళ్ల ముచ్చటగా మారింది,దీంతో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల బర్తీ వారంలో చేయనున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్లో బ్రాహ్మణ సంక్షేమానికి 100కోట్లు కేటాయించిన నేపధ్యంలో బ్రహ్మణ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి దానికి చైర్మెన్ గా హుస్నాబాద్ ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్ ను నియమనించనున్నట్లు తెలుస్తుంది,అలాగే ఆర్టీసీ చైర్మెన్ రేసులో ఎమ్మెల్యే లు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి,విద్యాసాగర్ రావు,జలగం వెంగల్ రావు పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. హౌసింగ్ కార్పోరేషన్ చైర్మెన్ పదవికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ,తెలంగాణా స్పోర్ట్స్ ఆథారిటీ చైర్మెన్ రేసులో పలువురు ఎమ్మెల్యేల తో పాటు గతంలో టికెట్ ఆశించి బంగపడ్డ నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ వారంలో ఈ నాలుగు నామినేటెడ్ పదవులు బర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. 

తెలంగాణాకి తలమానికంగా నేటి నుంచి మెగా ఏవియేషన్ షో

తెలంగాణాకి తలమానికంగా నేటి నుంచి మెగా ఏవియేషన్ షో 


తెలంగాణాకి తలమానికంగా నేటి నుంచి హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయంలో మెగా ఏవియేషన్ షో ప్రారంబం కానుంది. అయిదు రోజులపాటు సాగనున్న ఈ ఏవియేషన్ షో ను ఈరోజు మధ్యాహ్నం 2.50కి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంబిస్తారు. అట్టహాసంగా సాగనున్న ఈ షో లో ప్రపంచ ప్రసిద్ది ఏవియేషన్ రంగ దిగ్గజ సంస్థలు,అమెరిక ,కెనడా ,ప్రాన్స్ ,జర్మనీ దేశాల ప్రతినిధులు,విమానయాన రంగ విదిబాగాల తయారి కంపెనీల ప్రతినిధులు ,ఎయిర్ బస్ 800,ఎయిర్ బస్ 747,బోయింగ్,దసాల్ట్,గల్ప్,టెక్స్ట్ ట్రాన్ విమానాలు ,అగస్టా వెస్ట్ ల్యాండ్ ,బెల్ ,రష్యన్ హేలిక్యాప్టర్లు ప్రదర్శనలో పాల్గొంటారు. ఈరోజు 3.50-4.15 వరకు ఏవియేషన్ విన్యాసాలు కొనసాగుతాయి. 17,18,19,20 తేదిల్లో రోజుకు రెండుసార్లు విమానాల విన్యాసాలు కొనసాగుతాయి. 

Tuesday 15 March 2016

ఖమ్మం కోట మున్సిపల్ కొత్త కార్యవర్గం కొలువుదీరింది;ఖమ్మం మేయర్ గా పాపాలాల్ ఏకగ్రీవం

ఖమ్మం కోట మున్సిపల్ కొత్త కార్యవర్గం కొలువుదీరింది;ఖమ్మం మేయర్ గా పాపాలాల్ ఏకగ్రీవం 

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ కొత్త కార్యవర్గం కోలువుదీరింది. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికైన నూతన కార్పోరేటర్ల చేత ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు. మంత్రి తుమ్మల సమక్షంలో జరిగిన మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నిక లో మేయర్ గా డా. గుగులోత్ పాపాలాల్ ,డిప్యూటీ మేయర్ గా మురళి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన కార్పోరేటర్లకు,మేయర్ గా అవకాశం ఇచ్చిన కెసిఆర్ కి ధన్యవాదాలు తెలిపారు మేయర్ పాపాలాల్. 

చంద్రబాబుకి చుక్కలు చూపెడుతున్నారు....!

చంద్రబాబుకి  చుక్కలు చూపెడుతున్నారు....!



ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ప్రతిపక్ష నేత జగన్ ఊపిరి సడలనివ్వకుండా చేస్తున్నాడు. ముఖ్యమంత్రి,అతని సహచరులు రాజధాని ప్రాంతంలో భూదందా,పార్టీ పిరాయింపుల వ్యవహారం ,పార్టీ మంత్రి రావెల తనయుడి వ్యవహారం,హామీల అమలులో వేనుకడుగును ప్రతిపక్ష నేత అసెంబ్లీ సాక్షిగా ఎండగడుతూ చంద్రబాబు పై చక్రవ్యూహం పన్ని జగన్ చుక్కలు చూపెడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి పై అవిశ్వాసం పెట్టి సర్కార్ తీరుని ఎండగట్టిన జగన్,తాను అనుకున్నది అమలులో పెట్టనీయకుండా చంద్రబాబు పార్టీ మారిన ఎమ్మెల్యే లను గైర్హాజరు పరిచినా ,ఈరోజు మరోమారు స్పీకర్ పై అవిశ్వాస అస్త్రం ప్రకటించి పార్టీ మారిన ఎమ్మెల్యే ల తో పాటు,వైసీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి చంద్రబాబు ని చక్రవ్యూహం లో చిక్కించి చుక్కలు చూపెడుతున్నారు. 

కొలువుదీరిన వరంగల్ మున్సిపల్ కొత్త కార్యవర్గం;మేయర్ గా నన్నపనేని నరేందర్

కొలువుదీరిన వరంగల్ మున్సిపల్ కొత్త కార్యవర్గం;మేయర్ గా నన్నపనేని నరేందర్ 

వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కొత్త కార్యవర్గం కొలువుదీరింది. నూతనంగా ఎన్నికైన కార్పోరేటర్ల చేత ఎన్నికల అధికారి ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్,డిప్యూటి మేయర్ ఎన్నిక నిర్వహించగా మేయర్ గా నన్నపనేని నరేందర్,డిప్యూటి మేయర్ గా సిరాజుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్,డిప్యూటి మేయర్ ఎన్నికను డిప్యూటి సీఎం కడియం శ్రీహరి హాజరయ్యారు. 

తెలంగాణా పై కేంద్ర వివక్షని పార్లమెంట్ లో వెంకయ్య ను నిలదీసిన జితేందర్ రెడ్డి

తెలంగాణా పై కేంద్ర వివక్షని పార్లమెంట్ లో వెంకయ్య ను నిలదీసిన జితేందర్ రెడ్డి 

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న అంతులేని వివక్షను పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టి,కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ను నిలదీశారు ఎంపి జితేందర్ రెడ్డి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తమ ప్రభుత్వం ఆంధ్రా కి ఐఐటి,ఐఐఐటి,ఐఐఎం,ఎయిమ్స్,ఐఐఎస్ఆర్,పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా,తిరుపతి,వైజాగ్ ఎయిర్పోర్ట్ ల విస్తరణ ప్రకటించడమే కాక నిధులను విడుదల చేసిందని ఏకరవు పెట్టగా మహబూబ్ నగర్ ఎంపి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ విభజన చట్టంలో హామీ ప్రకారం ఆంధ్రాకి అన్ని కేటాయించిన కేంద్రం తెలంగాణాకి ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదు?కేంద్రం తెలంగాణా పట్ల అంతులేని వివక్ష చూపిస్తుందని,తెలంగాణకు కేంద్రం ఏం కేటాయిన్చిందో సభ సాక్షిగా చెప్పాలని వెంకయ్య నాయుడు ని నిలదీశారు. విభజన చట్టంలో 94షెడ్యూల్డ్ ప్రకారం తెలంగాణాకి ఇచ్చిన హామీలు అయిన ఎయిమ్స్,ట్రైబల్ యూనివర్సిటీ,హార్టికల్చర్ యూనివర్శిటీ,ఇండస్ట్రియల్ కారిడార్,హై కోర్టు విబజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర వైకరిని,వెంకయ్య నాయుడు ను నిలదీశారు. 

Monday 14 March 2016

తెలంగాణా పునర్నిర్మాణం మలిపద్దు;1,30415కోట్ల రాజేంద్రుడి బడ్జెట్

తెలంగాణా పునర్నిర్మాణం మలిపద్దు;1,30415కోట్ల రాజేంద్రుడి బడ్జెట్ 

తెలంగాణా పునర్నిర్మానాన్ని ప్రస్పుటిస్తూ ప్రణాళికేతర వ్యయం కన్నా ప్రణాళిక వ్యయాన్ని పెంచుతూ సాగు,తాగునీటి రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరుపుతూ ఆరోగ్య,సంక్షేమ,వైద్య,విద్యా,వ్యవసాయ రంగాల కు పెద్దపీట వేస్తూ తెలంగాణా 2016-17బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈటెల రాజేందర్. 

బడ్జెట్ సమగ్ర స్వరూపం:

తెలంగాణా బడ్జెట్:1,30415.87కోట్లు 
ప్రణాళిక వ్యయం:67630.73కోట్లు 
ప్రణాళికేతర వ్యయం:62785.14కోట్లు 
రెవెన్యూ మిగులు:3318కోట్లు 
ద్రవ్యలోటు:23467కోట్ల అంచనా 

నీటిపారుదల రంగానికి:25000కోట్లు 

కాళేశ్వర ఎత్తిపోతల పథకానికి:6286కోట్లు 
పాలమూరు ఎత్తిపోతల పథకానికి :7861కోట్లు 
సీతారామ భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి 1150కోట్లు 
రైతు రుణమాపీ కి:3718కోట్లు 
మిషన్ భగీరథ కు :36976కోట్లు 

సంక్షేమ రంగానికి కేటాయింపులు :

ఎస్టీ సంక్షేమానికి :3,752కోట్లు 
ఎస్సీ సంక్షేమానికి :7,122కోట్లు 
బీసీ సంక్షేమానికి:2538కోట్లు 
మైనారిటీ సంక్షేమానికి:1204కోట్లు 
మహిళా శిశు సంక్షేమానికి :1553కోట్లు 
కళ్యాణ లక్ష్మి :738కోట్లు 
ఆసరా పించన్లకు:4,693కోట్లు 
పంచాయితీరాజ్,గ్రామీనాభివ్రుద్దికి:10,737కోట్లు 
రహదారులు మరియు భవనాలకు :3333కోట్లు,450కోట్లు 
పట్టనాభివ్రుద్దికి :4,815కోట్లు 
ఐటీ మరియు సంక్షేమ శాఖ కు :254కోట్లు 
పోలీసు శాఖకు :250కోట్లు 
సిటీ పోలీసు ట్విన్ టవర్స్ నిర్మాణానికి :140కోట్లు 
అగ్నిమాపక శాఖకు:223కోట్లు 
పారిశ్రామిక శాఖకు :967కోట్లు 
యువజన సర్వీసుల శాఖకు :253కోట్లు 
సంస్కృతి,పర్యాటక శాఖకు :50కోట్లు 
వ్యవసాయ శాఖకు :6759కోట్లు 
ఆరోగ్య శాఖకు:5967కోట్లు 
విద్యా శాఖ ప్రణాళికేతర వ్యయం :9048కోట్లు 
విద్యాశాఖ ప్రణాళిక వ్యయం:1164కోట్లు 
తెలంగాణా ప్రత్యేక అభివృద్ధి నిధి:4,675కోట్లు 

అమేజాన్ అమ్మబోతుంది తెలంగాణా ఆప్కో వస్త్రాలు....!

అమేజాన్ అమ్మబోతుంది తెలంగాణా ఆప్కో వస్త్రాలు....!

ప్రపంచ ఈ-మార్కెట్ రిటైల్ దిగ్గజం అమేజాన్ తెలంగాణా ఆప్కో వస్త్రాలను ఆన్ లైన్ లో అమ్మబోతుంది. ఇందుకు సంబదించి తెలంగాణా ప్రభుత్వం అమెజాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణా ఆప్కో ఉత్పత్తి చేసిన వస్త్రాలను ఈనెల 16న మధ్యాహ్నం 12.30నిమిషాలకి అమ్మకాలను తెలంగాణా పరిశ్రమలు,జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంబిస్తారు. ఈ ఒప్పందంతో తెలంగాణా చేనేత ఉత్పత్తులకు అమ్మకాలు పెరగడంతో కార్మికులకు ఉపాధి పెరుగుతుంది. ప్రస్తుతం 93కోట్ల వార్షిక ఉత్పత్తులతో ఉన్న తెలంగాణా చేనేత ఆప్కో ఘననీయంగా పురోగతి సాదిన్చనుంది. 

Sunday 13 March 2016

చిరు-పవన్ ల రాజకీయ చక్రవ్యూహం???

చిరు-పవన్ ల రాజకీయ చక్రవ్యూహం???

గత ఎన్నికల్లో అన్నదమ్ములు వేరువేరు పార్టీలకు మద్దతుతో ప్రత్యర్థులు గా అవడంతో మెగా అభిమానులు ఎంతో డీలాపడ్డారు. ఎన్నికల అనంతరం తమ్ముడు పవన్ మద్దతిచ్చిన టిడిపి-బిజెపి లు అధికార పీఠం అధిష్టించగా ,అన్న అండగా ఉన్న కాంగ్రెస్ అందపాతాలంలోకి వెళ్ళింది. పవన్ స్థాపించిన జనసేన ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలవకున్న తన మిత్ర పార్టీలకు ఓటు బ్యాంకును పెంచాడు.ఎన్నికల అనంతరం టిడిపి ఇచ్చిన హామీలను నెరవెర్చకపొగా కొన్ని విషయాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న సమయంలో పవన్ రానున్న ఎన్నికల్లో మరోసారి క్రియాశీలకం కానున్నాడు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి టిడిపి తో తెగదెంపులు చేసుకుని పార్టీ బలోపెతంపై ద్రుష్టి పెట్టి చిరుని బిజెపి లోకి లాగాలని తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ తెరవెనుక ప్రయత్నాల్లో పవన్ అనుయాయుల పాత్ర ఉందంటున్నారు. 2019ఎన్నికల ముందు చిరుని ఎలాగైనా బిజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దింపి ,పవన్ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలో ఉంటె సామాజిక సమీకరణాలు,మెగా అండ,కేంద్ర అధికార బలంతో ఎన్నికల్లో చక్రం తిప్పాలని అన్నదమ్ముల రాజకీయ చక్రవ్యూహం కై అన్నదమ్ముల శ్రేయోభిలాషుల ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 

ముక్కోటి తెలంగాణా ప్రజల చూపు చంద్రశేఖర-రాజేంద్రుల పైనే....!

ముక్కోటి తెలంగాణా ప్రజల చూపు చంద్రశేఖర-రాజేంద్రుల పైనే....!

ముక్కోటి తెలంగాణా ప్రజల కల బంగారు తెలంగాణా.లక్ష కోట్ల బడ్జెట్ ముగ్గురమ్మల మూలపటం,ముక్కోటి ప్రజలు, పది జిల్లాలు,మిషన్ కాకతీయ, మిషన్ బగీరథ,డబల్ బెడ్ రూమ్ ఇళ్లు,కళ్యాణ లక్ష్మి,విశ్వ నగరం,ఫార్మా,ఫిలిం,స్పోర్ట్స్ సిటీలు,మూసీ ప్రక్షాళన,కేజీ టూ పీజీ హామీ,ప్రాజెక్టులు,విద్య,వైద్య,విద్యుత్,పారిశ్రామిక రంగాలు,సంక్షేమం ఇలా ఎన్నో రంగాలు యువత,ముసలి,ముతక,పెద్ద,చిన్న ఇలా అందరి చూపు రేపటి బడ్జెట్ వైపే,బడ్జెట్ ప్రవేశపెట్టే ఈటెల రాజేంద్రుని కేతాయిమ్పులవైపే. ఇప్పటికే అన్ని శాఖల పై విడివిడిగా సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్దిక మంత్రి ఈటెలకు ఏ రంగానికి ఎలాంటి ప్రాదాన్యత ఇవ్వాలో దిశా నిర్దేశం చేసారు. తెలంగాణా రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రస్పుటించే తెలంగాణా బడ్జెట్ రూపొందించిన చంద్రశేఖర్-రాజేంద్రుల వైపే ముక్కోటి తెలంగాణా ప్రజల చూపు. 

ప్రత్యర్థుల విమర్షలకు పద్మవ్యూహంలా కెసిఆర్ ప్రసంగం;తెలంగాణా పునర్నిర్మాణ ప్రతిబింబం కెసిఆర్ ప్రసంగం

ప్రత్యర్థుల విమర్షలకు పద్మవ్యూహంలా కెసిఆర్ ప్రసంగం;తెలంగాణా పునర్నిర్మాణ ప్రతిబింబం కెసిఆర్ ప్రసంగం 

చెప్పింది తూచ తప్పకుండా చేస్తాం,అసాధ్యమైన హామీలను ఇయ్యం తెలంగాణా పునర్నిర్మాణం దిశగా తెలంగాణా తనకు తాను రీఇన్నొవెశన్,రీఇన్వెన్షన్ అయ్యే విధంగా ప్రత్యర్థుల విమర్శలకు అందకుండా పద్మవ్యూహంలా కెసిఆర్ అసెంబ్లీలో ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం నూటికి నూరుపాళ్లు తెలంగాణా ప్రభుత్వ హామీ లను ప్రతిబింబిస్తుందని ఉద్ఘాటిస్తూ గుడిసెలు లేని గ్రామాలు మా లక్ష్యం అన్న హామీలను నెరవేర్చని కాంగ్రెస్ హామీ నెరవేర్చి ఉంటె మేము డబల్ బెడ్ రూమ్ హామీ వచ్చేదా??మేము హామీ ఇచ్చినట్లు ఇప్పటికే 60000డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాం,రానున్న రోజుల్లో 2లక్షల డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం కొనసాగిస్తాం,ఇళ్ల నిర్మాణానికి సామాజిక బాద్యత కింద కాంట్రాక్టర్లు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ముందుకురావాలని కోరినట్లు కెసిఆర్ ప్రకటించారు. వ్యవసాయం విద్యుత్ వినియోగం వల్ల తెలంగాణా ప్రభుత్వం నిరంతర విద్యుత్ అందించగలుగుతుంది అన్న విమర్శలకు తెలంగాణా వ్యాప్తంగా గత సంవత్సర కాలంలో 16%విద్యుత్ వినియోగం పెరిగిందని అయిన నిరంతర విద్యుత్ సరపరా చేస్తున్నామని ఉద్ఘాటించారు. 2000కోట్లతో తెలంగాణా వ్యాప్తంగా తాగునీటి సౌకర్యం కలిపించొచ్చు అంటున్న జీవన్ రెడ్డి విమర్శలకు దీటైన సమాధానమిస్తూ 40సంవత్సరాలలో ఎందుకు తాగునీరు ఇయ్యలేకపోయారు???ఇదే తాగునీటి కల్పనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు 8000కోట్లు కేటాయిస్తుంటే ఎందుకు నిలదీయలేకపోయారు అంటూ జీవన్ రెడ్డి కి దీటైన సమాదానమిచ్చారు. రేషన్ కార్డులు ,ఆసరా ,బీడీ పించన్లు,విద్యార్థులకు హాస్టళ్లలో సన్న బియ్యం రానున్న సంవత్సరం నుండి యూనివర్సిటీ హాస్టళ్లలో సైతం సన్నబియ్య భోజనం అందించడానికి సిద్దం,ఒసీలకు సైతం పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి అందిస్తామని చెప్పారు. 
పీజురీయంబర్స్మెంట్ ధ్యేయంగా ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్,బీఎడ్,డీఎడ్ కళాశాలలు పెట్టారని,వీటిపై సమీక్షించాలని ప్రసంగంలో పేర్కొన్నారు,కోటి కుటుంబాలు ఉన్న తెలంగాణాలో ఇంటికో ఉద్యోగం ఎలా సాధ్యం మేము ఆ హామీ ఇయ్యలేదని తెలంగాణా వస్తే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఉంటుందని ప్రకటించిన మాటకు కట్టుబడే ఉన్నామని,ఇందులో బాగంగానే ఇప్పటికే 18000ఉద్యోగాల నియామాకలా ప్రక్రియ జరుగుతుందని,త్వరలోనే మిగితా ఉద్యోగాల బర్తీ ఉంటుందని,తెలంగాణా టిఎస్-ఐపాస్ ప్రపంచంలోనే అత్యుత్తమం అయినదని తెలుపుటకు గర్వపడుతున్నామని,ఇప్పటికే 30000కోట్ల పెట్టుబడులు వచ్చాయని,వరంగల్ లో సూరత్,త్రిపూర్,సోలాపూర్ ల సమాహారంగా టెక్స్ టైల్ పార్కు నిర్మిస్తున్నామని,6000ఎకరాలతో ఫార్మ వ్యర్థాలను నిర్మూలించే విధంగా ఫార్మా సిటీ నిర్మిస్తామని,హైదరాబాద్ ఐటీ ఎగుమతుల్లో 16%వ్రుద్దితో దూసుకెల్తుందని,హైదరాబాద్ ఏరో స్పేస్ హబ్ గా దూసుకేల్తుందని ప్రకటించారు,జహీరాబాద్ నిమ్జ్ కి కేంద్రం అనుమతులు ఇచ్చారని,వైద్య,విద్యా వ్యవస్థ ప్రక్షాళన కొనసాగిస్తామని ప్రకటించారు. 
మహా ఒప్పందాన్ని బ్లాక్ డే గా విమర్శించిన విపక్షాల తీరును దీటుగా సమాదానమిస్తూ ప్రతిపక్షాల,గత ప్రభుత్వాల తీరును కూలంకషంగా వివరిస్తూ దీటైన కౌంటర్ ఇస్తూ ప్రతిపక్షాలను తన ప్రసంగ పద్మవ్యూహంలో ఇరికిస్తూ కెసిఆర్ తెలంగాణా పునర్నిర్మానాన్ని తన ప్రసంగంలో ప్రస్పుటించారు.