ADD

Sunday 13 March 2016

ప్రత్యర్థుల విమర్షలకు పద్మవ్యూహంలా కెసిఆర్ ప్రసంగం;తెలంగాణా పునర్నిర్మాణ ప్రతిబింబం కెసిఆర్ ప్రసంగం

ప్రత్యర్థుల విమర్షలకు పద్మవ్యూహంలా కెసిఆర్ ప్రసంగం;తెలంగాణా పునర్నిర్మాణ ప్రతిబింబం కెసిఆర్ ప్రసంగం 

చెప్పింది తూచ తప్పకుండా చేస్తాం,అసాధ్యమైన హామీలను ఇయ్యం తెలంగాణా పునర్నిర్మాణం దిశగా తెలంగాణా తనకు తాను రీఇన్నొవెశన్,రీఇన్వెన్షన్ అయ్యే విధంగా ప్రత్యర్థుల విమర్శలకు అందకుండా పద్మవ్యూహంలా కెసిఆర్ అసెంబ్లీలో ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం నూటికి నూరుపాళ్లు తెలంగాణా ప్రభుత్వ హామీ లను ప్రతిబింబిస్తుందని ఉద్ఘాటిస్తూ గుడిసెలు లేని గ్రామాలు మా లక్ష్యం అన్న హామీలను నెరవేర్చని కాంగ్రెస్ హామీ నెరవేర్చి ఉంటె మేము డబల్ బెడ్ రూమ్ హామీ వచ్చేదా??మేము హామీ ఇచ్చినట్లు ఇప్పటికే 60000డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టాం,రానున్న రోజుల్లో 2లక్షల డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం కొనసాగిస్తాం,ఇళ్ల నిర్మాణానికి సామాజిక బాద్యత కింద కాంట్రాక్టర్లు డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ముందుకురావాలని కోరినట్లు కెసిఆర్ ప్రకటించారు. వ్యవసాయం విద్యుత్ వినియోగం వల్ల తెలంగాణా ప్రభుత్వం నిరంతర విద్యుత్ అందించగలుగుతుంది అన్న విమర్శలకు తెలంగాణా వ్యాప్తంగా గత సంవత్సర కాలంలో 16%విద్యుత్ వినియోగం పెరిగిందని అయిన నిరంతర విద్యుత్ సరపరా చేస్తున్నామని ఉద్ఘాటించారు. 2000కోట్లతో తెలంగాణా వ్యాప్తంగా తాగునీటి సౌకర్యం కలిపించొచ్చు అంటున్న జీవన్ రెడ్డి విమర్శలకు దీటైన సమాధానమిస్తూ 40సంవత్సరాలలో ఎందుకు తాగునీరు ఇయ్యలేకపోయారు???ఇదే తాగునీటి కల్పనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు 8000కోట్లు కేటాయిస్తుంటే ఎందుకు నిలదీయలేకపోయారు అంటూ జీవన్ రెడ్డి కి దీటైన సమాదానమిచ్చారు. రేషన్ కార్డులు ,ఆసరా ,బీడీ పించన్లు,విద్యార్థులకు హాస్టళ్లలో సన్న బియ్యం రానున్న సంవత్సరం నుండి యూనివర్సిటీ హాస్టళ్లలో సైతం సన్నబియ్య భోజనం అందించడానికి సిద్దం,ఒసీలకు సైతం పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి అందిస్తామని చెప్పారు. 
పీజురీయంబర్స్మెంట్ ధ్యేయంగా ఇబ్బడి ముబ్బడిగా ఇంజనీరింగ్,బీఎడ్,డీఎడ్ కళాశాలలు పెట్టారని,వీటిపై సమీక్షించాలని ప్రసంగంలో పేర్కొన్నారు,కోటి కుటుంబాలు ఉన్న తెలంగాణాలో ఇంటికో ఉద్యోగం ఎలా సాధ్యం మేము ఆ హామీ ఇయ్యలేదని తెలంగాణా వస్తే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఉంటుందని ప్రకటించిన మాటకు కట్టుబడే ఉన్నామని,ఇందులో బాగంగానే ఇప్పటికే 18000ఉద్యోగాల నియామాకలా ప్రక్రియ జరుగుతుందని,త్వరలోనే మిగితా ఉద్యోగాల బర్తీ ఉంటుందని,తెలంగాణా టిఎస్-ఐపాస్ ప్రపంచంలోనే అత్యుత్తమం అయినదని తెలుపుటకు గర్వపడుతున్నామని,ఇప్పటికే 30000కోట్ల పెట్టుబడులు వచ్చాయని,వరంగల్ లో సూరత్,త్రిపూర్,సోలాపూర్ ల సమాహారంగా టెక్స్ టైల్ పార్కు నిర్మిస్తున్నామని,6000ఎకరాలతో ఫార్మ వ్యర్థాలను నిర్మూలించే విధంగా ఫార్మా సిటీ నిర్మిస్తామని,హైదరాబాద్ ఐటీ ఎగుమతుల్లో 16%వ్రుద్దితో దూసుకెల్తుందని,హైదరాబాద్ ఏరో స్పేస్ హబ్ గా దూసుకేల్తుందని ప్రకటించారు,జహీరాబాద్ నిమ్జ్ కి కేంద్రం అనుమతులు ఇచ్చారని,వైద్య,విద్యా వ్యవస్థ ప్రక్షాళన కొనసాగిస్తామని ప్రకటించారు. 
మహా ఒప్పందాన్ని బ్లాక్ డే గా విమర్శించిన విపక్షాల తీరును దీటుగా సమాదానమిస్తూ ప్రతిపక్షాల,గత ప్రభుత్వాల తీరును కూలంకషంగా వివరిస్తూ దీటైన కౌంటర్ ఇస్తూ ప్రతిపక్షాలను తన ప్రసంగ పద్మవ్యూహంలో ఇరికిస్తూ కెసిఆర్ తెలంగాణా పునర్నిర్మానాన్ని తన ప్రసంగంలో ప్రస్పుటించారు. 

No comments:

Post a Comment