ADD

Tuesday 15 March 2016

తెలంగాణా పై కేంద్ర వివక్షని పార్లమెంట్ లో వెంకయ్య ను నిలదీసిన జితేందర్ రెడ్డి

తెలంగాణా పై కేంద్ర వివక్షని పార్లమెంట్ లో వెంకయ్య ను నిలదీసిన జితేందర్ రెడ్డి 

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న అంతులేని వివక్షను పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టి,కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ను నిలదీశారు ఎంపి జితేందర్ రెడ్డి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తమ ప్రభుత్వం ఆంధ్రా కి ఐఐటి,ఐఐఐటి,ఐఐఎం,ఎయిమ్స్,ఐఐఎస్ఆర్,పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా,తిరుపతి,వైజాగ్ ఎయిర్పోర్ట్ ల విస్తరణ ప్రకటించడమే కాక నిధులను విడుదల చేసిందని ఏకరవు పెట్టగా మహబూబ్ నగర్ ఎంపి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ విభజన చట్టంలో హామీ ప్రకారం ఆంధ్రాకి అన్ని కేటాయించిన కేంద్రం తెలంగాణాకి ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదు?కేంద్రం తెలంగాణా పట్ల అంతులేని వివక్ష చూపిస్తుందని,తెలంగాణకు కేంద్రం ఏం కేటాయిన్చిందో సభ సాక్షిగా చెప్పాలని వెంకయ్య నాయుడు ని నిలదీశారు. విభజన చట్టంలో 94షెడ్యూల్డ్ ప్రకారం తెలంగాణాకి ఇచ్చిన హామీలు అయిన ఎయిమ్స్,ట్రైబల్ యూనివర్సిటీ,హార్టికల్చర్ యూనివర్శిటీ,ఇండస్ట్రియల్ కారిడార్,హై కోర్టు విబజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని కేంద్ర వైకరిని,వెంకయ్య నాయుడు ను నిలదీశారు. 

No comments:

Post a Comment