ADD

Saturday 26 March 2016

తెలంగాణాలో భానుడి భగభగలు;ఒక్కరోజే అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రత

తెలంగాణాలో భానుడి భగభగలు;ఒక్కరోజే అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రత 

ఈసారి తెలంగాణాలో సమ్మర్ భగభగలు ముందే ప్రారంబమయ్యాయి. ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా అకస్మాత్తుగా పగటిపూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. భానుడి ప్రతాపంతో ఈరోజు తెలంగాణా వ్యాప్తంగా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు మెదక్ లో 41.5,నిజామాబాద్ లో 41.4,హన్మకొండలో 40.5,ఆదిలాబాద్ 40.8,మహబూబ్ నగర్ 40.3,బద్రాచలం 39,రామగుండం 39,హైదరాబాద్ 39,నల్గొండ 38.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారిగా పెరిగిన పగటి పూట వేడితో జనం రోడ్లపైకి రావాలంటే బయపడే పరిస్థితి మొదలైంది. 

ప్యానల్ స్పీకర్ గా కాసేపు గీతారెడ్డి

 ప్యానల్ స్పీకర్ గా కాసేపు గీతారెడ్డి 

ఈరోజు అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి కాసేపు స్పీకర్ గా వ్యవహరించారు. స్పీకర్ మధుసూధనా చారి అస్వస్థతకు గురి కావడం,డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మధ్యలో విరామం తీసుకోవడంతో కాసేపు ప్యానల్ స్పీకర్ గా గీతా రెడ్డి స్పీకర్ చైర్ లో కూర్చొని కాసేపు సభా వ్యవహారాలను నడిపించారు. అనుకోని అవకాశంతో కాసేపు స్పీకర్ గా గీతా రెడ్డి వ్యవహరించడం అసెంబ్లీ లో ఆసక్తికర సంఘటన. 

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ తగలబోతుందా???కెసిఆర్ కి లేఖాస్త్రం వెనుక మర్మం అదేనా???

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ తగలబోతుందా???కెసిఆర్ కి లేఖాస్త్రం వెనుక మర్మం అదేనా???

తెలంగాణా ముఖ్యమంత్రిపై పదునైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే నేత ఎవరంటే మొదట వినిపించే పేరు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తన దూకుడు తగ్గించాడు అంతేకాదు తొలిసారి ముఖ్యమంత్రి కెసిఆర్ కి రేవంత్ గ్రూప్-2వాయిదా వేయాలని,గ్రూప్-2పోస్టుల సంఖ్య పెంచాలని,ఎక్షైజ్ పోస్టుల వయోపరిమితి పెంచడంతో పాటు గ్రూప్-3నోటిఫికేషన్ విడుదల చేయలాని లేఖ రాసిన రేవంత్ లేఖ రాసి రెండు రోజులు కాకముందే గ్రూప్-2వాయిదా నిర్ణయం,గ్రూప్-2పోస్టుల పెంపుకు కెసిఆర్ అంగీకారం తెలపడం చూస్తుంటే ఇదంతా తెరవెనుక మంత్రంగామేనని టిఅరేస్ నేతలు చెపుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్ తగలనుందని తెలుస్తుంది. టిఅరేస్ లో రాజకీయ ఓనమాలు దిద్దిన రేవంత్ మళ్లీ టిఅరేస్ గూటికి చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

పాలేరు పీఠం పై కారు కన్ను???ఉపఎన్నిక వ్యూహం సిద్దం

పాలేరు పీఠం పై కారు కన్ను???ఉపఎన్నిక వ్యూహం సిద్దం 

పిఏసీ చైర్మెన్ రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతితో ఖాళీ అయిన ఖమ్మం పాలేరు నియోజకవర్గ ఉప ఎన్నికపై టిఅరేస్ వ్యూహం సిద్దం చేస్తుంది. పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఏకగ్రీవానికి సహకరించాలని ప్రయత్నిస్తున్నా ఎన్నికలు ఏదైనా గెలుపే తమతో సహవాసం చేస్తున్న నేపధ్యంలో టిఅరేస్ కొత్త వ్యూహం సిద్దం చేస్తుంది.ఎన్నికల బరిలో వెంకటరెడ్డి బార్య లేక కుటుంబ సభ్యుల నిలిపితే వారిని స్వతంత్ర అభ్యర్థులుగా నిలిపి గెలిపిస్తే టిఅరేస్ లో చేర్చుకోవాలి లేదా కాంగ్రెస్ నుండి వెంకట్ రెడ్డి అన్న దామోదర్ రెడ్డి లేదా అతని అన్న కుమారుడు చరణ్ రెడ్డి లలో ఎవరినైనా ఎన్నికల్లో నిలిపితే టిఅరేస్ తరుపున పోరుకు సై అంటున్న వరంగల్ నేత నరేష్ రెడ్డి లేదా గతంలో వైసిపి నుండి పోటీ చేసి టిఅరేస్ లో చేరిన నరేష్ లను ఎన్నికల్లో నిలపాలని అధికార పక్షం వ్యూహం రచిస్తుంది. ఇక మంత్రి తుమ్మల సైతం కెసిఆర్ ఆదేశిస్తే పోటీ కి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. పాలేరు ఉప ఎన్నిక ఎలా ఉంటుందో??పాలేరు ఎవరి ఖాతాలో చేరుతుందో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. 

మరో మారు వెలుతున్నాడు కేటిఆర్ విదేశీ పర్యటనకు...!

మరో మారు వెలుతున్నాడు కేటిఆర్ విదేశీ పర్యటనకు...!


తెలంగాణా ఐటీ మరియు పంచాయితీరాజ్ ,పురపాలిక మంత్రి వర్యులు కేటిఆర్ మరోమారు విదేశీ పర్యటనలకు వెల్లనున్నాడు. రాష్ట్ర సర్కార్ ఏప్రిల్ 4న కొత్త ఐటీ పాలసీ ప్రకటించనున్న నేపధ్యంలో కేటిఅర్ పర్యటన ప్రాముఖ్యం సంతరించుకోనుంది. ఇంతకుముందు కేటిఅర్ అమెరికా పర్యటన లో గూగుల్ ,మైక్రోసాఫ్ట్ ,అమేజాన్ వంటి దిగ్గజాలను హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుటకు వారితో చర్చలు జరపడంలో విజయవంతం అయిన కేటిఅర్ ఏప్రిల్ 13నుండి 18వరకు మారిషస్ ,బ్రిటన్ లో పర్యటించనున్నారు. తొలుత మారిషస్ లో అడుగుపెట్టనున్న కేటిఅర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ అమలులో మారిషస్ కు రాష్ట్ర సహకారం పై చర్చల అనంతరం అక్కడి ఐటీ ,పారిశ్రామిక నిపుణులతో చర్చించనున్నారు. అలాగే 13,14తేదిల్లో ఆయుష్ సదస్సుకు హాజరుకానున్నారు. అనంతరం బ్రిటన్ వెల్లి అక్కడి ఐటీ మరియు పారిశ్రామిక దిగ్గజాలతో బేటీ అయి తెలంగాణాలో పెట్టుబడుల సానుకూలతలు వివరించనున్నారు. 

Friday 25 March 2016

అల్లుడి సిద్దిపేట్ ఇలాకాలో పోరుకు ముందే కారు జోరు...!ప్రత్యర్థులు బేజారు...!

అల్లుడి సిద్దిపేట్ ఇలాకాలో పోరుకు ముందే కారు జోరు...!ప్రత్యర్థులు బేజారు...!


సిద్దిపేట్ మున్సిపల్ ఎన్నికల్లో పోరుకు ముందే కారు జోరు మొదలైంది. కారు జోరు,టిఅరేస్ వ్యూహాలతో ప్రత్యర్థులు బెజారైపోతున్నారు. ఎన్నికలు ఏవైనా ఘన విజయమే లక్ష్యంగా కదులుతున్న టిఅరేస్ శ్రేణులు సిద్దిపేట్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసాక 34వార్డుల్లో 6వార్డుల్లో టిఅరేస్ అభ్యర్థులు ఏకగ్రీవ విజయం సాదించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేసరికి 166మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా మిగిలిన 28వార్డుల్లో 143మంది బరిలో నిలిచారు. ప్రచార పర్వం మొదలవకముందే వ్యూహాత్మక జోరులో 6వార్డులను ఏకగ్రీవం చేసుకున్న హరీష్ రావు క్లీన్ స్వీప్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సిద్దిపేట్ మున్సిపాలిటీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనుండగా ,ఏప్రిల్ 11న కౌంటింగ్ జరగనుంది. 

హైదరాబాద్ కి చెందిన స్టార్టప్ కంపెనీలో సచిన్ టెండూల్కర్ పెట్టుబడులు???

హైదరాబాద్ కి చెందిన స్టార్టప్ కంపెనీలో సచిన్ టెండూల్కర్ పెట్టుబడులు???

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సైతం స్టార్టప్ లపై ద్రుష్టి సారించి హైదరాబాద్ కి చెందిన స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ కి చెందిన ఎన్ఆర్ఐ మహేష్ లింగారెడ్డి స్థాపించిన 'స్మాట్రాన్' స్టార్టప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్మాట్రాన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సచిన్ ఎంత ఇన్వెస్ట్ చేయనున్నాడో మాత్రం వేల్లడవట్లేదు. 'ఇంటర్నెట్ ఆప్ థింగ్స్' ఆధారిత స్మార్ట్ డివైజ్ లను తయారు చేసే స్మాట్రాన్ 2014ఆగష్టు లో స్టార్ట్ అవగా వచ్చే ఏడాది తొలి త్రైమాషికంలో తమ ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకురానుంది. 

కెసిఆర్ ని కాపీ కొడుతున్న చంద్రబాబు???ఆంధ్రలో గిరి పుత్రిక కల్యాణ పథకంగా కెసిఆర్ కల్యాణ లక్ష్మి...!

కెసిఆర్ ని కాపీ కొడుతున్న చంద్రబాబు???ఆంధ్రలో గిరి పుత్రిక కల్యాణ పథకంగా కెసిఆర్ కల్యాణ లక్ష్మి...!

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలో అవుతూ తెలంగాణా సంక్షేమ పథకాలను కాపీ కొడుతూ కాపీ క్యాట్ గా మారుతున్నాడు. తెలంగాణాలో  కెసిఆర్ ఆపరేషన్ ఆకర్ష్ తో కుదేలైన చంద్రబాబు అక్కడ జగన్ పై ఆకర్ష్ అస్త్రాన్ని సందించాడు. అంగన్ వాడీలకు,ప్రభుత్వ ఉద్యోగులకు ,ఆర్టీసి కార్మికులకు కెసిఆర్ ను పాలో అవుతూ పీఅర్సీ ప్రకటించిన చంద్రబాబు,తెలంగాణా హరితహారం ఆంధ్ర నీరు-మీరు-మొక్క గా మార్చిన బాబు  ఇప్పుడు కెసిఆర్ కల్యాణ లక్ష్మి పై ద్రుష్టి సారించిన చంద్రబాబు ఆంధ్రలో ఎస్టీ బాలికలకు గిరిపుత్రికా కల్యాణ పథకాన్ని ప్రకటించాలని యోచిస్తున్నారు. తెలంగాణా సంక్షేమ పథకాలతో కెసిఆర్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుండటంతో బాబు కెసిఆర్ వైపు చూస్తున్నారు. 


నా తెలంగాణ అన్నదాతలు అపర భగీరథులు...!రబీలోను 50%పైగా సాగు

నా తెలంగాణ అన్నదాతలు అపర భగీరథులు...!రబీలోను 50%పైగా సాగు 


తెలంగాణా అన్నదాతలు అపర భగీరథులు గా మారి అనావృష్టి లో సైతం రబీ సీజన్ లో 50%పైగా సాగు చేస్తూ అన్నపూర్ణ ముద్దు బిడ్డలుగా మారారు. రాష్ట్రం మొత్తం మీద రబీ సీజన్ లో 57%సాగు నమోదవగా ఆదిలాబాద్ 90%సాగు నమోదు చేసి అగ్రస్థానం లో నిలువగా,62%తో వరంగల్ రెండో స్థానంలో ,57%తో రంగారెడ్డి మూడో స్థానంలో నిజామాబాద్ ,నల్గొండ 55%,మహబూబ్ నగర్ 53%,ఖమ్మం 53%,కరీంనగర్ 51%సాగు నమోదైంది. కందులు ,శేనగలు,పెసలు 100%కి పైగా సాగు అయి రబీలో కీలక పంటలుగా నిలిచాయి. మొక్కజొన్న 74%,జొన్నలు 70%,గోధుమలు 39%,ముతక ధాన్యాలు71% ,మినుములు 69%,వేరుశనగ 65%,పొద్దుతిరుగుడు 49%,నువ్వులు 29%,మిర్చి 104%,పొగాకు 52%,ఇతర పప్పు దినుసులు 52%సాగు నమోదైందని వ్యవసాయ శాఖ గణాంకాలను వెల్లడించింది. 

బీసీ,అగ్రవర్ణ పేద ఆడపిల్లలకూ కల్యాణ లక్ష్మి

బీసీ,అగ్రవర్ణ పేద ఆడపిల్లలకూ కల్యాణ లక్ష్మి 

ఇప్పటికే ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ పేదింటి ఆడపిల్లల పెళ్లికి చేదోడువాదోడుగా నిలిస్తున్న కల్యాణ లక్ష్మి పథకాన్ని ఇకపై బీసీ,ఓసీ లలోని పేద ఆడపిల్లలకు సైతం వర్తింప జేయాటానికి ప్రణాళిక సిద్దం చేస్తుంది. ఈ పథకం లో మధ్యవర్తులు,బ్రోకర్లు ఎక్కువ అవుతుండటంతో పథకం పక్కదారి పడుతుండటంతో దీనిపై టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ఏసీబీ నిఘా పెంచి అసలైన లబ్ది దారులకు అన్యాయం జరగకుండా చూసేందుకు చర్యలు తీసుకుని బీసీ,ఓసీ పేద ఆడపిల్లలకు ఈ పథక గైడ్లైన్స్ వెలువరించాలని సర్కార్ భావిస్తుంది. 15రోజుల్లో ఈ విధివిధానాలను వెలువరించే అవకాశం ఉంది. కల్యాణ లక్ష్మి పథకానికి ఈ బడ్జెట్ లో 738కోట్లు ,షాదీ ముబారక్ కి 150కోట్లు కేటాయించిన కెసిఆర్ సర్కార్ పేదింటి ఆడపిల్లలకు అండగా నిలవనుంది. 

ముఖ్యమంత్ర్రి పీఠం పై మరో మహిళా....!

ముఖ్యమంత్ర్రి పీఠం పై మరో మహిళా....!

మరో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం పై మహిళ కోలువుదీరనుంది. జమ్మూ కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రి గా మహబూబా ముప్తి అధికారం చేపట్టేందుకు సిద్దమైంది. గత వారం మోడీ తో బేటీ అయిన ముప్తీ,నిన్న పిడీపీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి ముప్తీని తమ శాసనసభ పక్ష నేతగా మహాబూబా ముప్తీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పీడీపీ,బిజేపి సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు ఇప్పటికే బిజేపి అంగీకరించడంతో బిజేపి లేఖ ఇవ్వగానే పిడీపీ గవర్నర్ ని కలసిన అనంతరం ప్రమాణ స్వీకార ముహూర్తం ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి ముప్తీ మహమ్మెద్ సయూద్ మరణ అనంతరం గవర్నర్ పాలనలోకి వెళ్ళిన కాశ్మీర్ లో తొలి మహిళా ముఖ్యమంత్రిగా మహబూబా ముప్తీ అధికార పీఠం పై కోలువుదీరనున్నారు. 

నిరుద్యోగులకు శుభవార్త...! 15,628పోస్టులతో కదులుతున్న డీఎస్సీ ఫైల్ సీఎం సంతకం అనంతరం ప్రకటనకు సిద్దం ...!

నిరుద్యోగులకు శుభవార్త...! 15,628పోస్టులతో కదులుతున్న డీఎస్సీ ఫైల్

సీఎం సంతకం అనంతరం ప్రకటనకు సిద్దం ...!

ఎందరో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణా డీఎస్సీ ప్రకటన ఫైల్ శరవేగంగా కదులుతుంది. 15,628పోస్టులతో ఉన్న ఖాళీలను బర్తీ చేసేందుకు సంబందించిన ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేర్చింది. సీఎం ఆమోదం పొందగానే డీఎస్సీ ప్రకటన చేయడానికి విద్యా శాఖ కసరత్తు చేస్తుంది. డీఎస్సీ నిర్వాహణ బాద్యత టిఎస్పిఎస్సీ కి ఆపగించాలా?జిల్లా ఎంపిక కమిటీల నేతృత్వంలో నిర్వహించాలా ముఖ్యమంత్రి నిర్ణయించనున్నారు. ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ వేసిన సర్కార్ మే మొదటివారంలో డిఎస్సీ ప్రకటన వెలువరించాలని చూస్తుంది. 

ప్రపంచంలోనే అత్యుత్తమ తెలంగాణా ఐటి(ఐసీటి)పాలసీ ప్రకటనకు సర్వం సిద్దం

ప్రపంచంలోనే అత్యుత్తమ తెలంగాణా ఐటి(ఐసీటి)పాలసీ ప్రకటనకు సర్వం సిద్దం

ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంతో పెట్టుబడులను ఒడిసి పట్టుటలో విజయవంతం అయిన తెలంగాణా సర్కార్ మరో ముందడుగు వేయనుంది. తెలంగాణాను ప్రపంచ ఐటీ,కమ్యూనికేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రపంచ అత్యత్తమ ఇన్పర్మేషన్ కమ్యునికేషన్ టెక్నాలజీ పాలసీని సిద్దం చేసింది. ఎలక్ట్రానిక్స్ ,ఐటీ రంగ ఉత్పత్తులలో ప్రపంచంలోనే తెలంగాణాను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రథమ ప్రాధాన్యంగా ఐటీ,కమ్యునికేషన్,రెండో ప్రాదాన్యంగా యానిమేషన్,గేమింగ్ లకు పెద్దపీట వేస్తూ ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు బారీగా ప్రోత్సాహకాలు,హైదరాబాద్ కి పరిమితమైన ఐటీ కంపెనీలు తెలంగాణా ద్వితీయ ,తృతీయ శ్రేణి రంగాలకు విస్తరించేందుకు రాయితీలు,సత్వర అనుమతులతో ఐసీటీ పాలసీని సిద్దం చేసిన తెలంగాణా సర్కార్ ఏప్రిల్ 4న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ,ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి,ఐటీ రంగ నిపుణుల సమక్షంలో ప్రకటించనున్నారు. 

అతివ అందానికే అందం తెలంగాణా చేనేత చీర సొగసుతో....! ప్రపంచ ప్యాషన్ వీక్ లో తెలంగాణా చీర సొగసు...

అతివ అందానికే అందం తెలంగాణా చేనేత చీర సొగసుతో....!

ప్రపంచ ప్యాషన్ వీక్ లో తెలంగాణా చీర సొగసు... 

అతివ అందానికే అందం తెచ్చే తెలంగాణా చేనేత చీర సొగసు వర్ణించడానికి అక్షర మందార మాలలు సరిపోవు. తెలంగాణా చేనేత చీర సొగసు కు ఇప్పుడు ప్రపంచ ప్యాషన్ ప్రియులు సైతం ఫిదా అవుతున్నారు. 2012లో ముంబై లో జరిగిన లేక్మీ ప్యాషన్ వీక్ లో ప్రపంచ ప్యాషన్ ప్రియులను మంత్ర ముగ్దులను చేసిన తెలంగాణా పోచంపల్లి ఇక్కత్ చీరల సోయగం ఈ నెల 30న జరిగే ప్యాషన్ వీక్ లోను హైదరాబాద్ కి చెందిన ప్రముఖ ప్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా రూపొందించిన డిజైన్చేనేత సారీలు ప్రత్యేక ఆకర్షణ గా నిలవనున్నాయని సమాచారం. 

Thursday 24 March 2016

పోరాటాల తెలంగాణా గడ్డ పెట్టుబడుల ఆకర్షణలో బేష్;కెసిఆర్ సర్కార్ కి మోదీ ప్రశంస

పోరాటాల తెలంగాణా గడ్డ పెట్టుబడుల ఆకర్షణలో బేష్;కెసిఆర్ సర్కార్ కి మోదీ ప్రశంస 


ప్రపంచ అత్యత్తమ ఏక గవాక్ష ఇండస్ట్రియల్ పాలసీ తో పెట్టుబడులను ఆకర్షించడం లో విజయవంతం అవుతున్న తెలంగాణా సర్కార్ ప్రయత్నాన్ని ప్రదాని మోదీ సైతం ముగ్దుడయ్యాడు,ప్రభుత్వ పనితీరుని ప్రశంసల తో ముంచెత్తాడు. నిన్న ప్రగతి కార్యక్రమంలో బాగంగా అన్ని రాష్ట్రాల సిఎస్ లు ,పారిశ్రామిక కార్యదర్శులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఇందులో బాగంగా తెలంగాణా ప్రభుత్వం కేంద్రంతో పెట్టుబడులు,పరిశ్రమల అనుమతులకు సమన్వయంతో ముందుకు వెలుతున్న విధానం,తెలంగాణా ప్రభుత్వ టిఎస్-ఐపాస్ విధానం ,ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్స్ పై సమీక్షించిన ప్రదాని తెలంగాణా ప్రభుత్వాన్ని,ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని ప్రశంసించారు. ఇందులో పాల్గొన్న సిఎస్ రాజీవ్ శర్మ,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ లను ప్రధాని ప్రశంశించారు. గత ఎనిమిది నెలల కాలంలో తెలంగాణా 30000కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ,ప్రపంచ అగ్రశ్రేణి దిగ్గజాలు గూగుల్ ,అమేజాన్ ,ఐకియా ,మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను  హైదరాబాద్ రప్పించడం లో విజయవంతం అయ్యారు. 

Wednesday 23 March 2016

సర్దార్ ట్రైలర్ కి సల్మాన్ ఫిదా...!

సర్దార్ ట్రైలర్ కి సల్మాన్ ఫిదా...!

టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోను సర్దార్ గబ్బర్ సింగ్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అభిమానుల అంచనాలు అంబరాన్ని అంటగా ప్రస్తుతం బాలీవుడ్ లోను సర్దార్ ట్రైలర్ కి ఫిదా అవుతున్నారు. బిగ్ బీ అమితాబ్ సర్దార్ ట్రైలర్ కి ప్రసంశల్లో ముంచెత్తగా,సల్మాన్ ఖాన్ పవన్ ని ఆకాశానికేత్తేస్తున్నాడు. సర్దార్ లో పవన్ లా నేను అస్సలు చేయలేను,పవన్ నిజంగా చాలా గ్రేట్ ,పవన్ కచ్చితంగా బాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకుంటాడు అంటున్న సల్మాన్ హిందీలో సర్దార్ గబ్బర్ ప్రమోషన్లో సైతం పాల్గోననున్నాడని సమాచారం.ఏప్రిల్ 8న విడుదల అవనున్న సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగు తో పాటు హిందీ వెర్షన్ ఒకేసారి విడుదల అవనుంది. హిందీ లో 800స్క్రీన్లలో బారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 

రోజాపై చంద్రబాబు కుసంస్కార కుతంత్రాలు అందుకేనట????

రోజాపై చంద్రబాబు కుసంస్కార కుతంత్రాలు అందుకేనట????

ఒకప్పుడు టిడిపిలో ఉండి ప్రస్తుతం వైఎస్ఆర్సిపీ ఎమ్మెల్యేగా ఆంధ్ర అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్ అయిన రోజా ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. జగన్ శిబిరంలో చంద్రబాబుని ఎదురిస్తూ,విమర్శనాస్త్రాలు బలంగా ఎక్కుపెడుతూ చంద్రబాబును చిక్కులో ఇరికిస్తున్న రోజా ఒక్కతే. అలాంటి రొజాని ఎలాగైనా కార్నర్ చేసి చిక్కుల్లో ఇరికించి తన నోటికి తాళాలు వేయాలని భావించి సస్పెన్షన్ అస్త్రం సందించిన సుప్రీం ,హై కోర్టుల గడప తొక్కుతూ చంద్రబాబుకి చుక్కలు చూపిస్తుంది దీంతో అహం దెబ్బతిన్న చంద్రబాబు సస్పెన్షన్ వేటు అస్త్రంతో టిడిపిలోకి లాగడంతోనే రోజాని కంట్రోల్ చేయగలమని భావిస్తున్నారట. ఎలాగైనా రోజాని ని టిడిపిలోకి లాగడానికి సామ ,దాన ,బెద ,దండోపాయాలను ప్రయోగించాలని చూస్తున్నారని సమాచారం. రోజాను టిడిపి లోకి లాగితే జగన్ శిబిరం లో చంద్రబాబుని అంత సమర్దవంతంగా ఎదుర్కొనే సత్తా మరెవరికి లేదు ,రొజాని టిడిపిలోకి లాగితే జగన్ శిబిరానికి కోలుకోలేని దెబ్బతీస్తే మరికొంత మంది ఎమ్మెల్యేలను టిడిపిలోకి లాగడం సులువవుతుందని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. 

తెలంగాణాలో అయిదు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కి అనుమతి

తెలంగాణాలో అయిదు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కి అనుమతి 

తెలంగాణాలో అయిదు జిల్లాల్లో అయిదు పారిశ్రామిక సమూహాలకు కేంద్ర అనుమతి లబించింది. తెలంగాణా ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్రం ,జాతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్యక్రమం కింద తెలంగాణాలోని కరీంనగర్ లోని బావుపేట్ ప్రాంతంలో గ్రానైట్ క్లస్టర్ ,ఖమ్మం లో గ్రానైట్ శుద్ధి క్లస్టర్ ,నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతం,నిజామాబాద్ లో రైసు మిల్లుల సమూహం,ఆదిలాబాద్ లో పత్తి జిన్నింగ్ మిల్లుల సమూహం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఇందులో బాగంగా ప్రతి క్లస్టర్ లో 100-150చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం ఉంటుంది . ఈ క్లస్టర్ లకు సాదారణ మౌలిక వసతులకు 10కోట్లు,ఉమ్మడి సౌకర్యాల కేంద్రం నిర్మాణం కింద 5కోట్లు,సాంకేతిక సాయం కింద 25లక్షలు కేటాయించనుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు ,సమాఖ్యలు అధ్వర్యంలో సూక్ష్మ ,చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎమ్ఎస్ఎమ్ఈ ద్వారా వీటి ఏర్పాటుకు కావలసిన మౌలిక వసతులు,సాంకేతిక నైపుణ్యం,పెట్టుబడులకు మూలధనం,మార్కెటింగ్ సహాయం అందిస్తుంది . ఈ పరిశ్రమల సమూహాల అభివృద్ధి ,నిర్వాహణ బాద్యతను టిఎస్ఐఐసి కి అప్పగించింది. 

Tuesday 22 March 2016

కర్షకుల కరెంట్ కష్టాలు తీరుస్తున్న కృషీవలుడు కెసిఆర్ రేపటి నుండి 9గంటలు 3ఫేజ్ కరెంటు....!

కర్షకుల కరెంట్ కష్టాలు తీరుస్తున్న కృషీవలుడు కెసిఆర్

రేపటి నుండి 9గంటలు 3ఫేజ్ కరెంటు....!


ఆరుదశాబ్దాల తెలంగాణా స్వప్నం సాకారమయ్యే సమయంలో తెలంగాణా రైతాంగం కరెంటు కష్టాలతో ఎప్పుడు వస్తుందో??ఎంత సమయం కరెంటు ఉంటుందో???ఏ అర్దరాత్రి సమయంలో 3ఫేజ్ కరెంటు ఇస్తారో???ఇచ్చినా ఎన్నిగంటలు ఉంటుందో ???ఉన్న సమయంలోను ఎన్ని సార్లు మధ్యమధ్యలో పోతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యమ రథ సారధి స్వరాష్ట్ర సారధిగా మారి స్వయానా రైతు అయిన కెసిఆర్ కర్షకుల కరెంటు కష్టాలను తీర్చుటకు నిర్విరామంగా శ్రమించి తెలంగాణా విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచడానికి పవర్ ప్లాంటుల నిర్మాణ పనులను యుద్దప్రతిపాదికన చేపడుతూ ముందుకు దూసుకెళ్తున్న కెసిఆర్. 
మాట తప్పకుండా ,మడిమ తిప్పకుండా అనుకున్న సమయంలో రేపటి నుండి వ్యవసాయ రంగానికి 9గంటల 3ఫేజ్ కరెంటు ఇచ్చేందుకు సిద్దమై 'కర్షకుల కరెంటు కష్టాలు తీరుస్తున్న కృషీవలుడు కెసిఆర్ కి అఖండ తెలంగాణా అన్నదాతాల ఆత్మీయ అభినందనలు'. 

చిన్న సినిమాలకి కెసిఆర్ పెద్ద ప్రోత్సాహం

చిన్న సినిమాలకి కెసిఆర్ పెద్ద ప్రోత్సాహం

తెలంగాణా రాష్ట్రంలో చిన్న సినిమాలకు ప్రోత్సాహకం ఉండేందుకు కెసిఆర్ సర్కార్ వేసిన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకనుంచి ప్రతి థియేటర్లలో 5ఆటలు ప్రదర్శించవచ్చని,అందులో ఒక ఆటను చిన్న సినిమాలకు కేటాయించాలని,థియేటర్లు లేని మండల కేంద్రాల్లో 200సీట్ల సామర్ధ్యంతో మినీ థియేటర్లను నియమించాలని ,సినిమా షూటింగులకు దరఖాస్తు చేసుకున్న 48గంటల్లో అనుమతులు ఇవ్వడానికి తీర్మానం చేసింది. తెలంగాణా సినిమాటోగ్రఫి మాత్యులు తలసాని ఆద్వర్యం లో వేసిన మంత్రివర్గ ఉపసంఘం బెటీలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి కెసిఆర్ కి తెలియజేయనున్నారు. 

ఇందూరుకు పసుపు,సుగంధ ద్రవ్యాల సిందూరం

ఇందూరుకు పసుపు,సుగంధ ద్రవ్యాల సిందూరం 

ఇందూరుకి పసుపు, సుగంద ద్రవ్యాల సిందూరం దిద్దనున్నారు. ఇందూరు జిల్లా వేల్పూరు మండలం పడిగల్ గ్రామంలో 40ఎకరాల్లో 30కోట్ల వ్యయంతో పసుపు పార్కును ఏర్పాటు చేయనున్నారు. గతంలో బాల్కొండా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం స్పైస్ పార్కును ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చి చేతులెత్తేయడంతో ఇప్పుడు పూర్తిగా తెలంగాణా ప్రభుత్వం రెండేళ్లలో ప్రభుత్వం పసుపు పార్కు ఏర్పాటు పూర్తి చేయాలని భావిస్తుంది. ఈ పార్కు ఏర్పాటుతో సుగంద ద్రవ్యాల,అనుబంద పరిశ్రమలు తరలి వచ్చే అవకాశం ఉంది. 

Sunday 20 March 2016

జనంలో ఉంటా...జనంలా ఉంటా... ఎక్కడికైనా ఇలాగేవస్తా... ఇలాగే ఉంటా...:సర్దార్ గబ్బర్ సింగ్

జనంలో ఉంటా...జనంలా ఉంటా... 

ఎక్కడికైనా ఇలాగేవస్తా... ఇలాగే ఉంటా...:సర్దార్ గబ్బర్ సింగ్ 

  సర్దార్   గబ్బర్ సింగ్ న్యూ ట్రైలర్
మెగా అభిమానులకు పసందైన షడ్రుచుల బోజనంలా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో అభిమానుల కోలాహలంతో మెగాస్టార్ చేతులమీదుగా విడుదలైంది. సంచలనాల కేంద్రంగా ఏప్రిల్ 8న తెలుగు సంవత్సరాది ఉగాది రోజున విడుదల కానున్న సర్దార్ గబ్బర్ సింగ్ థియరిటికల్ ట్రైలర్ లో మాటల తూటాలు పేల్చాడు. "పొగరెక్కి తల ఎగరేసే నీలాంటోడు పుట్టిన ప్రతిసారి తెగనరకటానికి నాలాంటి వాడు పుడుతూనే ఉంటాడు" 'ఒక్కడినే... ఎక్కడికైనా ఇలాగే వస్తా... ఇలాగే ఉంటా... జనంలో ఉంటా ... జనంలా ఉంటా... "అంటూ మాటల తూటాలు పేల్చాడు. శరత్ మరార్ నిర్మాతగా ,బాబీ దర్శకత్వంలో పవన్-కాజల్ జంటగా వస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సంచలనాలకు మరో పక్షం రోజులు ఎదురు చూడాల్సిందే. 

కెసిఆర్ టార్గెట్ లోకి ఎంఐఎం???మజ్లిస్ పై కెసిఆర్ మాయవ్యూహం???

కెసిఆర్ టార్గెట్ లోకి ఎంఐఎం???మజ్లిస్ పై కెసిఆర్ మాయవ్యూహం???

తెలంగాణాలో ప్రతిపక్షాలను కనుమరుగు చేస్తూ టిఅరేస్ ను తిరుగులేని శక్తిగా తయారు చేస్తున్న కెసిఆర్ ఇందులో బాగంగానే టిడిపి ని తెలంగాణాలో భూస్థాపితం చేసిన కెసిఆర్ కాంగ్రెస్ కి సైతం చుక్కలు చూపిస్తుండటం,గత గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాలను చిత్తు చేసిన కెసిఆర్ ఇప్పటి వరకు ఎవరు చేయని సాహసానికి ఓడిగడుతున్నట్లు సమాచారం గ్రేటర్ ఎన్నికల్లో కేటిఅర్ సారధ్యం లో బల్దియా పీఠం పై టిఅరేస్ జెండా ఎగురవేసిన కెసిఆర్ బల్దియా పాతబస్తీలో బలమైన మజ్లిస్ పార్టీ ని మసకబార్చాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మజ్లిస్ పార్టీతో వైరం పెంచుకోకుండా స్నేహం గానే మెలిగిన కెసిఆర్ 2019ఎన్నికల నాటికి పాతబస్తీలో టిఅరేస్ ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసి,కొందరు ఎంఐఎం నేతలను టిఅరేస్ లోకి లాగి మజ్లిస్ ని కోలుకోలేకుండా చేసి బల్డియాలో బలమైన శక్తిలా ఎదగాలని మజ్లిస్ పార్టీపై మాయావ్యూహం ఎక్కుపెట్టనున్నారు కెసిఆర్. 

దుర్యోధన-ద్రౌపది కురుక్షేత్రంలో కూరుకున్న చంద్రబాబుకి కేంద్రం క్లాస్???

దుర్యోధన-ద్రౌపది కురుక్షేత్రంలో కూరుకున్న చంద్రబాబుకి కేంద్రం క్లాస్???

ఆంధ్ర ఫైర్ బ్రాండ్ రోజా వ్యవహారం దుర్యోధన-ద్రౌపది కురుక్షేత్రం లా రోజురోజుకు ముదురుతూ చిలికి చిలికి గాలివానలా మారి కేంద్ర ప్రభుత్వం వరకు చేరింది. టిడిపి రోజా వ్యవహారంలో అతిగా స్పందిస్తూ కురుక్షేత్రం లా మార్చడం రోజా సుప్రీం గడప తొక్కి ఆంధ్ర అసెంబ్లీకి నోటీసులు అందేవరకు వెళ్లడంతో ఈ విషయం లో కేంద్రం చంద్రబాబు అండ్ కో పై కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. కేంద్రం తరుపున మంత్రి వెంకయ్య నాయుడు చంద్రబాబుకి క్లాస్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రోజా వ్యవహారాన్ని వీలైనంత త్వరగా ముగించాలని చంద్రబాబుకి సూచించినట్లు తెలుస్తుంది. 

అల్లుడి ఇలాకాలో ఎన్నికల నగారా;సిద్దిపేట్ మున్సిపల్ ఎన్నికల షెడ్యుల్డ్ విడుదల

అల్లుడి ఇలాకాలో ఎన్నికల నగారా;సిద్దిపేట్ మున్సిపల్ ఎన్నికల షెడ్యుల్డ్ విడుదల 


అల్లుడు హరీష్ రావు ఇలాక సిద్దిపేట్ మున్సిపాలిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. గత కొన్ని రోజులుగా నగర శివారు పంచాయితిలను సిద్దిపేట్ మున్సిపాలిటీలో విలీనంపై హై కోర్టులో స్టే ఉండటంతో ఎన్నికల నిర్వాహణ చాల ఆలస్యం అయింది ,హై కోర్టు తీర్పు వెలువడటంతో ఈరోజు ఎన్నికల సంఘం షెడ్యుల్డ్ విడుదల చేసింది . రేపటినుంచి 23వరకు నామినేషన్ల స్వీకరాణ,24న నామినేషన్ల పరిశీలన ,25న నామినేషన్ల ఉపసంహరణ గడువు విదించింది. 34వార్డులకు గాను 88,982మంది ఓటర్లు ఉన్న సిద్దిపేట్ మున్సిపాలిటీ పరిదిలో 84పోలింగ్ కేంద్రాల్లో 35మంది మైక్రో అబ్జర్వర్లు ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహించి 11న ఎన్నికల లెక్కింపు నిర్వహించనున్నారు.