ADD

Saturday 6 February 2016

నాన్నకు ప్రేమతో.... అంకితం ఈ విజయం

       నాన్నకు ప్రేమతో....  అంకితం ఈ విజయం 
తెలంగాణా పంచాయితీరాజ్ మరియు ఐ.టి శాఖ మంత్రివర్యులుగా బాద్యతలు నిర్వహిస్తున్న కే టి అర్ కి హైదరాబాద్ బల్దియా ఎన్నికల్లో పార్టీ ప్రచార బాద్యతలు అప్పగించిన కెసిఆర్ ప్రశాంతంగా తన విదుల్లో నిమగ్నమయిన వేల గ్రేటర్ లో అందపాతల్లో ఉన్న పార్టీ పరిస్థితిని కార్యకర్తలు ,పార్టీ ఎం.ఎల్.ఎ లు,మంత్రులతో సమన్వయంతో పనిచేస్తూ ప్రత్యర్థి పార్టీలన్నీ ఓ వైపు చంద్రశేకరుడి తనయుడినైన తారకరాముడిని నేనోవైపు అంటూ స్పష్టమైన హామీలు,తనదైన వాక్ చాతుర్యం,ఐ.టి.,పంచాయితీరాజ్ మంత్రిగా తనుసాదించింది ,తమ ప్రభుత్వ  సంక్షేమ కార్యక్రమాలు,పనితీరుని ప్రజలకి తెలియజేస్తూ ప్రజలతో మమేకమై ప్రత్యర్థి పార్టీలను తన చక్రవ్యూహం లో బందించి బల్దియా ఎన్నికల పద్మవ్యూహాన్ని చేదించి అద్బుతం,అద్వితీయం,అనిర్వచనీయమైన విజయాన్ని సాదించి,గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడించి తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచి అఖండ విజయాన్ని నాన్నకు ప్రేమతో ... అంకితం..... 
 

బల్దియా కి బాద్ షా : కెటిఅర్

   బల్దియా  కి బాద్ షా : కెటిఅర్


కెసిఆర్ తనయుడిగా మలిదశ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణా స్వరాష్ట్ర  సాధనలో క్రియాశీలక పాత్ర పోషించి 2009 ఎన్నికల్లో సిరిసిల్ల నియోజికవర్గం నుండి ఎం.ఎల్.ఏ గా ఎన్నికై,2010 ఉపఎన్నికల్లో బారీ మెజారిటీతో గెలిచిన కె.టి.అర్ స్వరాష్ట్ర సాదించిన తరుణంలో జరిగిన 2014 సాదారణ ఎన్నికల్లో విజయం సాదించి కెసిఆర్ మంత్రివర్గం లో కీలకమైన పంచాయితి రాజ్ మరియు ఐ.టి శాఖా మాత్యులుగా బాద్యతలు స్వీకరించి తెలంగాణా అభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తూ తనదైన శైలిలో తెలంగాణా కి విదేశీ పెట్టుబడులను రాబడుతూ,ప్రపంచస్థాయి సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులుపెట్టేల ఒప్పిస్తూ,టి హబ్ ప్రారంబించి హైదరాబాద్ ని స్టార్టప్ ల కేంద్రంగా తీర్చిదిద్దుతూ,తెలంగాణా ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం 'మిషన్ భగీరథ' ను ముందుంది నడిపిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటూ దూసుకెళ్తున్న కెటిఅర్ గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను స్వీకరించి తొలిసారి సవాల్ ఎదుర్కొన్నారు.
   బల్దియా ఎన్నికల్లో టి.అర్.ఎస్ తరుపున 150 మంది అభ్యర్థులను గెలిపించే బాధ్యతలో ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతూ, ప్రతిపక్షాలకు అంతుచిక్కని వ్యూహాలతో టి.అర్.ఎస్ కార్యకర్తలు,ఎం.ఎల్.ఏ లు,మంత్రులను సమన్వయపరుస్తూ ప్రచారాన్ని కొనసాగించి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ కారును పరుగులేట్టించి గ్రేటర్ ఎన్నికల్లో చరిత్రను తిరగరాసి 99 డివిజన్లలో టి.అర్.ఎస్ అభ్యర్థులను గెలిపించి స్వంత మెజారిటీ తో మేయర్ పీఠాన్ని  దక్కించుకుని బల్దియా ఎన్నికల పద్మవ్యూహాన్ని చేదించి ప్రతిపక్షాలను తన చక్రవ్యూహం లో బందించిన అభినవ అభిమన్యుడిగా మారి తండ్రిని మించిన తనయుడు అనిపించుకుని బల్దియా బాద్ షా గా నిలిచాడు.

Tuesday 2 February 2016

                                          అమెరికా  అగ్ర 'పీఠం' అతివకేనా ???

ప్రపంచ దేశాలు ఆర్ధికమాంద్యం,ఉగ్రవాదం,భూతాపం వంటి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న వేళ ప్రపంచ దేశాలను శాసిస్తూ,ముందుండి నడిపిస్తున్న అగ్రరాజ్యం  అమెరికా అద్యక్ష ఎన్నికలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి.అమెరికా అద్యక్ష ఎన్నికల్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారు కానప్పటికీ సర్వేలు పలితాలు,ప్రపంచ దేశాల విశ్లేషకులు ఈసారి అమెరికా అద్యక్ష పీఠంపై అతివ అందలం ఎక్కనుందనే భావిస్తున్నారు.రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వాఖ్యలతో తన పార్టీ అభ్యర్థి టెడ్ క్రజ్ కన్నా ముందున్న చివరికి ఎవరు రేసులో మిగులుతారో చెప్పలేమంతున్నారు.ఇక డెమోక్రటిక్ పార్టీ తరుపున హిల్లరీ క్లింటన్ కి బెర్ని సాన్దేర్స్ గట్టి పోటీ ఇస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా హిల్లెరి అభ్యర్థిత్వానికి సానుకూలంగా ఉండటం హిల్లరీ కె అభ్యర్థిత్వం దక్కనుందని సర్వేలు పేర్కొంటున్నాయి.హిల్లరీ తో  అద్యక్ష పదవికి ఎవరు పోటీ పడినా హిల్లరీ అనుభవం,తను  ఇదివరకు విదేశాంగ శాక బాద్యతలు నిర్వర్తించిన తీరు,తన చాతుర్యం మొదలగు అంశాలు హిల్లరి నీ అద్యక్ష పీతానికి చేరువచేస్తాయని తెల్సుతుంది.ప్రస్తుతం ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటంలో ప్రపంచానికి  మార్గనిర్దేశం చేసే అగ్రరాజ్య అద్యక్ష పీఠంపై  కటువుగా వ్యవహరించే  మగమహారాజు  కన్నా మహిళా  మహారాణి  చాకచక్యం మేలని  ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.

Monday 1 February 2016

చిరు -పవన్ బారీ మల్టీ స్టారర్ మూవీ

                                                     చిరు -పవన్  బారీ  మల్టీ స్టారర్ మూవీ ???
 మొన్న పవన్  సర్దార్  గబ్బర్ సింగ్  సెట్  లో  చిరంజీవి  సందడి  చేయడంతో  పండగ  చేసుకుంటున్న  మెగా అభిమానులకు టాలీ వుడ్  లో  వినిపిస్తున్న  మరో  వార్త  వారి ఆనందానికి  అవదులులేకుండా  చేస్తుంది,త్వరలో  మెగా స్టార్ -పవర్ స్టార్  కలయికలో  ఓ బారీ  మల్టీ స్టారర్ మూవీ నిర్మించడానికి  అల్లు అరవింద్ ,రాంచరణ్  ప్రయత్నాలు ప్రారంబించినట్లు  తెలుస్తుంది. ఇందుకు  సంబందించి  కథను సిద్దంచేయవలసిందిగా  రచయితలకు  సూచనలు అందినట్లు సమాచారం . మగదీర  చిత్రం  తరువాత  మళ్ళీ  ఆస్థాయి లో  ఈ చిత్రాన్ని  నిర్మించాలని  మెగా కుటుంబం బావిస్తుంది,ఇందుకు  సంబందించి  మరికొన్ని రోజుల్లో  ఓ స్పష్టత  ఇవ్వనున్నట్లు  తెలుస్తుంది