ADD

Saturday 6 February 2016

బల్దియా కి బాద్ షా : కెటిఅర్

   బల్దియా  కి బాద్ షా : కెటిఅర్


కెసిఆర్ తనయుడిగా మలిదశ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణా స్వరాష్ట్ర  సాధనలో క్రియాశీలక పాత్ర పోషించి 2009 ఎన్నికల్లో సిరిసిల్ల నియోజికవర్గం నుండి ఎం.ఎల్.ఏ గా ఎన్నికై,2010 ఉపఎన్నికల్లో బారీ మెజారిటీతో గెలిచిన కె.టి.అర్ స్వరాష్ట్ర సాదించిన తరుణంలో జరిగిన 2014 సాదారణ ఎన్నికల్లో విజయం సాదించి కెసిఆర్ మంత్రివర్గం లో కీలకమైన పంచాయితి రాజ్ మరియు ఐ.టి శాఖా మాత్యులుగా బాద్యతలు స్వీకరించి తెలంగాణా అభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తూ తనదైన శైలిలో తెలంగాణా కి విదేశీ పెట్టుబడులను రాబడుతూ,ప్రపంచస్థాయి సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులుపెట్టేల ఒప్పిస్తూ,టి హబ్ ప్రారంబించి హైదరాబాద్ ని స్టార్టప్ ల కేంద్రంగా తీర్చిదిద్దుతూ,తెలంగాణా ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం 'మిషన్ భగీరథ' ను ముందుంది నడిపిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటూ దూసుకెళ్తున్న కెటిఅర్ గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను స్వీకరించి తొలిసారి సవాల్ ఎదుర్కొన్నారు.
   బల్దియా ఎన్నికల్లో టి.అర్.ఎస్ తరుపున 150 మంది అభ్యర్థులను గెలిపించే బాధ్యతలో ప్రతిపక్షాలకు సవాళ్లు విసురుతూ, ప్రతిపక్షాలకు అంతుచిక్కని వ్యూహాలతో టి.అర్.ఎస్ కార్యకర్తలు,ఎం.ఎల్.ఏ లు,మంత్రులను సమన్వయపరుస్తూ ప్రచారాన్ని కొనసాగించి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ కారును పరుగులేట్టించి గ్రేటర్ ఎన్నికల్లో చరిత్రను తిరగరాసి 99 డివిజన్లలో టి.అర్.ఎస్ అభ్యర్థులను గెలిపించి స్వంత మెజారిటీ తో మేయర్ పీఠాన్ని  దక్కించుకుని బల్దియా ఎన్నికల పద్మవ్యూహాన్ని చేదించి ప్రతిపక్షాలను తన చక్రవ్యూహం లో బందించిన అభినవ అభిమన్యుడిగా మారి తండ్రిని మించిన తనయుడు అనిపించుకుని బల్దియా బాద్ షా గా నిలిచాడు.

No comments:

Post a Comment