ADD

Friday 19 February 2016

హైదరాబాద్ లో ఎంబ్రి రిడిల్ ఏరోనాటికల్ విశ్వ విద్యాలయ కేంద్రం

హైదరాబాద్ లో ఎంబ్రి రిడిల్ ఏరోనాటికల్ విశ్వ విద్యాలయ కేంద్రం 


అంతర్జాతీయ ఐటి దిగ్గజాలు గూగుల్ ,మైక్రోసాఫ్ట్ ,ఆపిల్ సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తుండగా ఇప్పుడు అంతర్జాతీయ ఏరోనాటిక్స్ దిగ్గజం 'ది హార్వర్డ్ ఆఫ్ ది స్కై' గా పేరుగాంచిన ప్రపంచ ప్రఖ్యాత 'ఎంబ్రి రిడిల్ ఏరోనాటికల్ విశ్వ విద్యాలయం' తన కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చింది. సింగపూర్ లో జరుగుతున్న ఎయిర్ షో సందర్బంగా ఈరోజు ఒప్పందం కుదుర్చుకోనుంది. ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న ఏఆర్ ఏయు గత కొన్ని సంవత్సరాలుగా చాల దేశాల్లో ఆన్ లైన్ కోర్సులను నిర్వహించిన ఈ విశ్వవిద్యాలయం ఇటీవలే సింగపూర్ లో తన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయదలచి ప్రపంచస్థాయి నగరాలన్నిటిని పరిశీలించి ఏరో స్పేస్ ,విమానాలా విడి బాగాల తయారీ హబ్ గా మారిన హైదరాబాద్ లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయుటకు మొగ్గు చూపింది. హైదరాబాద్ లో ఏరోస్పేస్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండటంతో ఇందుకు కావలసిన మానవవనరుల నైపుణ్యాలను అందించుటకు 'తెలంగాణా విజ్ఞాన నైపున్యాభివ్రుద్ది సంస్థ' తో ఒప్పందం కుదుర్చుకోనుంది.  

No comments:

Post a Comment