ADD

Thursday 18 February 2016

గద్దెనెక్కిన సమ్మక్క;జనసంద్రమైన మేడారం

గద్దెనెక్కిన సమ్మక్క;జనసంద్రమైన మేడారం 

తెలంగాణా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో చిలకలగుట్టనుంచి మేడారం చేరుకున్న సమ్మక్కకు స్వాగతం పలకగా కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు తీసుకురాగా ఎస్పీ దుగ్గల్ అధ్వర్యంలో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరుపుతూ సమ్మక్కను గద్దెనెక్కించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరుపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి ,చందూలాల్ ,ఎంపి సీతారం నాయక్ హాజరుకాగా ,మహిళల పూనకాలు,సంప్రదాయ నృత్యాలు,అశేష భక్త జనసందోహంతో మేడారం పులకించిపోయింది. సారలమ్మ ,సమ్మక్క గద్దె చేరడంతో దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పటివరకు మేడారం దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి దాటినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు భక్తుల రద్దీ మరింత పెరుగుతున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 

No comments:

Post a Comment