ADD

Thursday 18 February 2016

కృష్ణా పుష్కరాలకు రూ.825కోట్లు

కృష్ణా పుష్కరాలకు రూ.825కోట్లు 

తెలంగాణా రాష్ట్రం ఏర్పాడ్డాక వచ్చిన గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణా ప్రభుత్వం అదే స్పూర్తితో కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి సిద్దం అవుతుంది. ఈ ఏడాది ఆగష్టు 12నుండి 23వరకు జరిగే కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు 825కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించాలని కెసిఆర్ ఆదేశించారు. కృష్ణా పుష్కరాలు జరిగే మహబూబ్ నగర్ ,నల్గొండ జిల్లాల పరిదిలో రోడ్లు ,స్నాన ఘట్టాలు ,మంచినీటి వసతులు ,ఇతర సౌకర్యాల కొరకు ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రా పాలనలో ఆదరణకు నోచుకోని ఆష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కృష్ణా పుష్కరాలు జరిగే ఆలంపూర్ జోగులాంబ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని కెసిఆర్ సూచించారు. గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించిన కరీంనగర్ ,ఆదిలాబాద్,నిజామాబాద్ అధికారుల సూచనలు పుష్కరాల ఏర్పాట్లకై తీసుకోవాలని కెసిఆర్ ఆదేశించారు. 

No comments:

Post a Comment