ADD

Friday 19 February 2016

వరంగల్ కోటలో టిఆర్ఎస్ మూడుముక్కలాట

వరంగల్ కోటలో టిఆర్ఎస్ మూడుముక్కలాట 

టిడిపి నుండి వలసలతో టిఆర్ఎస్ రోజురోజుకు పటిష్ట పునాదులు వేసుకుంటూ బలపడుతున్న పార్టీలో చేరుతున్న కొందరు వ్యక్తులతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ టిఆర్ఎస్ లో ఇప్పుడు మూడుముక్కలాట నడుస్తుంది ఒకప్పుడు వివిద పార్టీల్లో కీలక వ్యక్తులుగా ఉంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ ఉన్న వరంగల్ పై పట్టు సాదించినవారు ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరి వరంగల్ రాజకీయాన్ని ఆసక్తి గా మార్చారు. గతంలో ఎర్రబెల్లి-కొండ సురేఖ,ఎర్రబెల్లి-కడియం,కడియం-కొండా సురేఖ,కడియం-రాజయ్య వర్గాలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేవారు అంత ఇప్పుడు ఒక్కచోట చేరేసారు. వీరి చేరికతో పార్టీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా కెసిఆర్ ముందునుంచే ప్రణాళిక రచించి అదేవిదంగా మున్దుకెల్లారు. ఒకప్పుడు రాజయ్య -కడియం ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ ప్రత్యర్థులుగా ఉన్న వారిని ఒకరికి స్టేషన్ ఘన పూర్ నుండి ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చిన కెసిఆర్ కడియం ను వరంగల్ ఎంపి గా గెలిపించినా ,తదుపరి పరిణామాలతో ఎలాంటి ఇబ్బందిరాకుండా కడియం ను మంత్రి వర్గంలోకి తీసుకుని ఎమ్మెల్సి గా అవకాశం ఇచ్చి చాకచక్యంగా వ్యవహరించారు.గతంలో పరకాల నుండి ప్రాతినిద్యం వహించిన సురేఖను పార్టీలో చేరుకొని సురేఖ ను వరంగల్ తూర్పు నుండి గెలిపించి,కొండ మురళికి హామీ ప్రకారం ఎమ్మెల్సి గా అవకాశం కలిపించారు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ లో చేర్చుకుని ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా కెసిఆర్ రచించిన చక్రవ్యూహానికి ఇప్పుడు టిఆర్ఎస్ మూడు ముక్కలాట వరంగల్ విజయాల బావుటాగా మారింది. 

No comments:

Post a Comment