ADD

Friday 25 March 2016

ప్రపంచంలోనే అత్యుత్తమ తెలంగాణా ఐటి(ఐసీటి)పాలసీ ప్రకటనకు సర్వం సిద్దం

ప్రపంచంలోనే అత్యుత్తమ తెలంగాణా ఐటి(ఐసీటి)పాలసీ ప్రకటనకు సర్వం సిద్దం

ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానంతో పెట్టుబడులను ఒడిసి పట్టుటలో విజయవంతం అయిన తెలంగాణా సర్కార్ మరో ముందడుగు వేయనుంది. తెలంగాణాను ప్రపంచ ఐటీ,కమ్యూనికేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రపంచ అత్యత్తమ ఇన్పర్మేషన్ కమ్యునికేషన్ టెక్నాలజీ పాలసీని సిద్దం చేసింది. ఎలక్ట్రానిక్స్ ,ఐటీ రంగ ఉత్పత్తులలో ప్రపంచంలోనే తెలంగాణాను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రథమ ప్రాధాన్యంగా ఐటీ,కమ్యునికేషన్,రెండో ప్రాదాన్యంగా యానిమేషన్,గేమింగ్ లకు పెద్దపీట వేస్తూ ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు బారీగా ప్రోత్సాహకాలు,హైదరాబాద్ కి పరిమితమైన ఐటీ కంపెనీలు తెలంగాణా ద్వితీయ ,తృతీయ శ్రేణి రంగాలకు విస్తరించేందుకు రాయితీలు,సత్వర అనుమతులతో ఐసీటీ పాలసీని సిద్దం చేసిన తెలంగాణా సర్కార్ ఏప్రిల్ 4న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ,ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి,ఐటీ రంగ నిపుణుల సమక్షంలో ప్రకటించనున్నారు. 

No comments:

Post a Comment