మరో తెలంగాణోడి గవర్నర్ గిరి... !
త్వరలో తమిళనాడు గవర్నర్ గా మోత్కుపల్లి ???
మోత్కుపల్లి ఎదురుచూపులు ఫలించే రోజులు దగ్గరపడ్డాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మోత్కుపల్లికి గవర్నర్ గిరి త్వరలోనే తమిళనాడు గవర్నర్ గా నియమితులు కాబోతున్నారు. ఈ మధ్యే తమిళనాడు గవర్నర్ గా రోశయ్య పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న విద్యాసాగర్ రావు కి అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగింది. త్వరలోనే తమిళనాడు గవర్నర్ గా మోత్కుపల్లి నరసింహులు గారిని నియమించనున్నారని టిడిపి వర్గాల సమాచారం. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మోడీ తిరిగి రాగానే ఆదేశాలు వస్తాయని తెలుస్తుంది. ఇప్పటికే విద్యాసాగర్ రావు గవర్నర్ గా విధుల్లో ఉండగా మోత్కుపల్లి గవర్నర్ గిరి చేపడితే తెలంగాణ నుండి రెండవ వ్యక్తిగా నిలుస్తారు.