ADD

Wednesday, 14 February 2018

నల్గొండ ఎంపీ గా కవిత???:నల్గొండ పై కేసిఆర్ స్కెచ్

   నల్గొండ ఎంపీ గా కవిత???:నల్గొండ పై కేసిఆర్ స్కెచ్
ఎన్నికల వ్యూహకర్తగా తలపండిన కేసీఆర్ 2019 ఎన్నికలకు మొదటి వ్యూహాన్ని సిద్ధం చేసాడు.ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా లో ఆ పార్టీ ని దెబ్బ కొట్టే దిశగా వ్యూహాలకు పడునుపెడుతిన్నాడు.ఇందులో భాగంగా ప్రస్తుతం నిజామాబాద్ ఎంపి గా ఉన్న కవిత ని రాబోవు ఎన్నికల్లో నల్గొండ పార్లిమెంట్ బరిలో నిలిపి కాంగ్రెస్ పార్టీ ని చిత్తు చేయడమే కాకుండా ఈ నియోజకవర్గం లోని 7 శాసన సభ నియోజకవర్గాల్లో టిఆరెస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కవితను నల్గొండ బరిలో నిలిపితే నియోజకవర్గ ప్రజల చూపు శాసనసభ నియోజకవర్గల పై పడితుందని ఇందులో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన భూపాల్ రెడ్డి ని నల్గొండ బరిలో గెలిపించుకుని,సూర్యాపేట,కోదాడ,మిర్యాలగూడ తో పాటు ఉత్తమ కుమార్,జానా రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న 2 నియోజకవర్గాలను టిఆరెస్ ఖాతాలో వేయాలని పట్టుదలతో ఈ వ్యూహాన్ని సిద్ధం చేయడంతో పాటు కవితను జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం లో నిలిపి ఇక్కడా టిఆరెస్ జెండా ఎగురవేయాలని భావిస్తున్నారు.