ADD

Saturday, 5 March 2016

ప్రో. కబడ్డీ ఫైనల్ పంగా పాట్నా పైరేట్స్

ప్రో. కబడ్డీ ఫైనల్ పంగా పాట్నా పైరేట్స్ 

ప్రో కబడ్డీ ప్రేక్షకులకు అసలు సిసలు వినోదాన్ని పంచుతూ చివరి క్షణం వరకు ఉత్కంట కొనసాగిస్తూ నడిచిన ప్రో కబడ్డీ ఫైనల్ పంగా పాట్నా పైరేట్స్ దే అయింది. ఢిల్లీ లో జవహర్ ఇండోర్ స్టేడియం లో డిపెండింగ్ చాంపియన్ యూ ముంబై తో జరిగిన పోరులో ఆట చివరి క్షణం లో 28-30తో పాట్నా పైరేట్స్ విజయం సాదించింది. రోహిత్ కుమార్ పాట్నా విజయం లో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్ లో సెమిస్ లో ఓడిన పాట్నా తొలిసారి టైటిల్ విజేతగా నిలిచింది. 

తెలంగాణా బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణా బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల 

తెలంగాణా బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణా ప్రభుత్వం. తెలంగాణా బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10నుంచి ప్రారంబం కానున్నాయి. మార్చ్ 10న ఉదయం 11గంటలకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంబం అవుతాయి. ఆరోజు సాయంత్రం బిఏసి సమావేశం లో చర్చించి సమావేశాల విదివిదానాలు,ఎన్నిరోజులు సమావేశాలను కొనసాగించాలని నిర్ణయించనున్నారు. 

బాసర సరస్వతి చెంత గోదారిపై చెక్ డ్యాం....!

బాసర సరస్వతి చెంత గోదారిపై చెక్ డ్యాం....!

గోదావరి పుష్కరాల సమయంలో బాసర సరస్వతి ఆలయం సమీపాన గోదావరిలో నీరు లేక బక్తులు ఇబ్బంది పడటంతో ఇకపై భక్తులు గోదావరిలో నీరులేక ఇబ్బంది పడకుండా బాసర సమీపంలో 30కోట్ల వ్యయం తో చెక్ డ్యాం నిర్మించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చెక్ డ్యాం నిర్మాణం తో సరస్వతి దేవి దర్శనానికి వచ్చే భక్తులు పూర్తి సంతృప్తితో పుణ్యస్నానం ఆచరించి సరస్వతిని దర్శించుకోవడంతో పాటు,పరిసర ప్రాంతాల తాగునీరు ,ఇతర అవసరాలకు ఈ చెక్ డ్యాం ఉపయోగపడనుంది. ఈ చెక్ డ్యాం నిర్మాణానికి పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసారు. 

నూతన అధికార నివాస సముదాయానికి కెసిఆర్ దంపతుల భూమిపూజ

నూతన  అధికార నివాస సముదాయానికి కెసిఆర్ దంపతుల భూమిపూజ 

          
పంజాగుట్టలో ముఖ్యమంత్రి నూతన అధికారిక నివాస సముదాయానికి కెసిఆర్ దంపతులు భూమిపూజ చేసారు. ప్రస్తుతం ఉన్న అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కార్యాలయ అవసరాలకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో పంజాగుట్టలో 9ఎకరాల విస్తీర్ణంలో అధునాతన హంగులతో కూడిన నూతన భవన సముదాయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమాన్ని నిరాడంభరంగా పూర్తి చేసారు.ఈ కార్యక్రమంలో కెసిఆర్ దంపతులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ,సిఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు,కొద్దిమంది ప్రజాప్రతినిదులు,సిఎంవో అధికారులు పాల్గొన్నారు. 

అశ్రునయనాలు,అధికారిక లాంచనాలతో 'రైతు బిడ్డ.. పశు ప్రేమికుడు' వెంకటరెడ్డి కడసారి వీడ్కోలు

అశ్రునయనాలు,అధికారిక లాంచనాలతో 'రైతు బిడ్డ.. పశు ప్రేమికుడు' వెంకటరెడ్డి కడసారి వీడ్కోలు 

ఆప్తుడు,వివాదరహితుడు,సహనశీలి,సర్పంచ్ నుండి ఎమ్మెల్యేగా,మంత్రిగా,పిఏసీ చైర్మెన్ గా పల్లె నుండి పట్నం వరకు పశు ప్రేమికుడైన రైతు బిడ్డనుండి ప్రజాప్రతినిది వరకు ఎదిగి ఎన్నో ఉన్నత పదవులను అందుకున్న రాంరెడ్డి వెంకటరెడ్డి తన వెంట నడచిన ప్రజలను,తను ప్రాణంగా చూసుకున్న జోడేడ్లను,తను నమ్మిన మాగాణిని,తన తనయనలను ,తన సహోధరున్ని వదిలి అందరికి అశ్రునయనాలను మిగిల్చి వెళ్ళిన రాంరెడ్డి వెంకటరెడ్డి కి తెలంగాణా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో కడసారి విడ్కోలుకు తన స్వగ్రామం పాతలింగాలలో అత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. 


ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిదుల 'ప్రజాదర్బార్'లు

ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిదుల 'ప్రజాదర్బార్'లు 


అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు,ఎంపి లకు అధికార నివాసాలు ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ఇందుకు కోటి రూపాయల వ్యయంతో ప్రతి నియోజకవర్గ కేంద్రం లో కోటి రూపాయల వ్యయంతో వాస్తు ప్రకారం తూర్పు ,ఉత్తర దిశలకు అభిముకుఖంగా 2,070చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తులతో మొదటి అంతస్తులో నియోజకవర్గ కార్యాలయం లా ,పై అంతస్తులో నివాస యోగ్యంగా ఆధునిక సదుపాయాలతో భవనం నిర్మించాలని కెసిఆర్ భావిస్తున్నారు,ఇందుకు 2016-17బడ్జెట్ లోనే నిధులు కేటాయించి సంవత్సరం లోగా వీటి నిర్మాణం పూర్తి చేయాలని కెసిఆర్ ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు ,ఎంపి లతో పాటుగా రాజ్యసభ ఎంపి లు,ఎమ్మెల్సీ లకు వారి నియోజకవర్గాల పరిదిలో వీటిని ప్రజాప్రతినిదుల 'ప్రజాదర్బార్'లుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. 

మురికి 'మూసీనది'... ఇక గత 'జీవనది'లా...

మురికి 'మూసీనది'... ఇక గత 'జీవనది'లా... 



 మురుగు కాల్వగా నేటి తరం మదిలో ముద్రపడిన ఒకప్పుడు జంటనగరాల దాహార్తిని తీర్చిన జీవ నది అయిన మూసి నదిని ప్రక్షాళన గావించి జీవం కోల్పోతున్న నదికి పునర్జీవం పోసి ఒకప్పటిలా చారిత్రక వైభవం కల్పించేందుకు తెలంగాణా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది. 60ఏళ్ల ఆదిపత్య పాలనలో కబ్జాకు గురైన మూసి నాలాలను ప్రక్షాళన గావించి 850కోట్ల రూపాయలతో జంట నగరాల మురుగునీరు మూసి లోకి రాకుండా నిరోదించి,మూసి నదిని ప్రక్షాళన గావించి, 750కోట్లతో మూసినధిని సుందరీకరించి,నదీ తీరాన్ని టూరిస్ట్ స్పాట్ గా తీర్చిదిద్దటానికి మూసి వెంట భాపుఘాట్ నుండి నాగోల్ వరకు 42కిలోమీటర్ల పొడవునా పాదచారుల వే,సైక్లింగ్ ట్రాక్ ,గ్రీన్ వే,మూసి నదిపై పాదచారుల వంతెన నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తుంది. ఇందులో బాగంగా పురపాలక ,పట్టణ అభివృద్ధి శాఖా మాత్యులు కేటిఅర్ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి ఈ నెల తొమ్మిదిన ముంబై లో నాబార్డ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ నోడల్ ఏజెన్సీ తో బేటీ అవనున్నారు.

Friday, 4 March 2016

తెలంగాణకు కిక్కేక్కింది...!ఈ కిక్కుకి బ్రేకుందా???

తెలంగాణకు కిక్కేక్కింది...!ఈ కిక్కుకి బ్రేకుందా???

ఓ రాష్ట్రం 
తొమ్మిది జిల్లాలు 
11నెలలు 
11వేల కోట్లు 
12నెలలకు 13వేల కోట్ల అంచనా 
హైదరాబాద్ టాప్,అక్షరాస్యతలో వేనుకుండే అదిలాబాద్ సెకండ్... దిమ్మదిరిగే లెక్కలు,ఈ లెక్కలకు తిక్కుంది,ఆ తిక్కకు కిక్కుంది,మొత్తం మీద తెలంగాణకు కిక్కేక్కింది. అంచనాలను మించి తెలంగాణాలో మద్యం విక్రయం జోరుగా సాగుతుంది. గత ఆర్దిక సంవత్సర అమ్మకాలను దాటేసి రికార్డులు సృష్టిస్తూ 11నెలల లో  తెలంగాణా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలాఖరుకు 11,450కోట్ల సుక్క అమ్ముడై తెలంగాణాకి కిక్కేక్కించింది. ఈ అమ్మకాలలో 2,656కోట్ల రూపాయల మద్యం అమ్మకాలతో హైదరాబాద్ తొలి స్థానం లో ఉండగా,1,626కోట్ల అమ్మకాలతో ఆదిలాబాద్ రెండో స్థానంలో నిలిచింది. 553కోట్ల అమ్మకాలతో ఖమ్మం చివరి స్థానంలో నిలిచింది. తెలంగాణా సుక్క తో ఎక్సైజ్ శాఖ నికర రెవెన్యూ 3,484కోట్లకు చేరింది. ఈ తెలంగాణా కిక్కుకి బ్రేకులు లేవేమో.....!

ద్వేషి వర్సెస్ సహనమూర్తి;భారతీయులంత సహనమూర్తి వైపే???

ద్వేషి వర్సెస్ సహనమూర్తి;భారతీయులంత సహనమూర్తి వైపే???

అగ్ర రాజ్యం అమెరికా ప్రైమరీ ఎన్నికల 'సూపర్ ట్యూస్ డే' పలితాల అనంతరం  ఇప్పుడు ప్రపంచం అంతా అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపు చూస్తుంది. సూపర్ ట్యూస్ డే ప్రైమరీల్లో డెమొక్రాట్ల తరుపున హిల్లరీ క్లింటన్,రిపబ్లికన్ల తరుపున డోనాల్డ్ ట్రంప్ చెరో 7రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసి అధ్యక్ష ఎన్నికల్లో ముఖాముఖి తలపడటానికి దాదాపు సిద్దం అయ్యారు. ఇప్పుడు ఎన్నికల సమరం ఇద్దరు వ్యక్తుల మద్యా???ఇద్దరు వ్యక్తిత్వాల మద్యా???అన్నట్టుగా మారింది. అత్యంత అన్వాయుధాలు ఉన్న అగ్ర రాజ్యానికి ఒక జాత్యహంకారి,ద్వేషి అధ్యక్షుడు అయితే ప్రమాదమే అని రిపబ్లికన్ లే తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ తీరుపట్ల ఆందోళన పడుతున్నాయి. మరో వైపు సహనశీలి,నేర్పరి అయిన హిల్లరీ క్లింటన్ తరుపున అందరు ఏకమై డెమోక్రాట్లు ఎన్నికల సమరంలోకి దిగుతున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్లు ఆందోళన పడుతున్న,ప్రైమరీల్లో ట్రంప్ దూకుడు తనం మాయలో పడినవారు ముందుముందు అలాగే ట్రంప్ వ్యూహం లో పడకుండా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాతో ట్రంప్ తీరును ఎండగట్టాలని డెమోక్రాట్లు నిర్ణయించారు. అమెరికాలో నిర్ణయాత్మకంగా ఉన్న భారతీయులు సైతం సహనమూర్తి అయిన హిల్లరీ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ సారి అమెరికా అగ్ర పీఠం పై సహనమూర్తి అతివకే పట్టం కట్టాలని యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. 



మోగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా

మోగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల నగారా 

5రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించింది ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా. ఏప్రిల్,మే రెండు నెలలపాటు అయిదు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్,తమిళనాడు,కేరళ,అస్సాం,పుదుచ్చేరిలో ఆరు దపాలుగా ఎన్నికలను నిర్వహించనుంది. అస్సాంలో ఏప్రిల్ 4,11లలో రెండు దపాలుగా,పశ్చిమ బెంగాల్ లో ఏప్రిల్ 4,11,17,21,25,30మరియు మే 5న ఆరు దఫాలుగా,తమిళనాడు,పుదుచ్చేరి,కేరళ లో మే 16న ఎన్నికలను నిర్వహించనున్నట్లు,అయిదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ మే 19న నిర్వహించనున్నట్లు  కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్డ్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తొలిసారి నోటాకు గుర్తు కేటాయించనున్నారు. ఈ షెడ్యుల్డ్ కి అనుగుణంగా ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వేలువరచనుంది . 

పాలేరు ఎమ్మెల్యే(పిఎసి చైర్మెన్)రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి

పాలేరు ఎమ్మెల్యే(పిఎసి చైర్మెన్)రాంరెడ్డి వెంకట్ రెడ్డి మృతి 

పాలేరు ఎమ్మెల్యే ,ప్రజాపద్దుల కమిటీ చైర్మెన్,మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ కిమ్స్ లో చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు. వైఎస్ఆర్ కి నమ్మిన బంటుగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి 5సార్లు ఎమ్మెల్యేగా,వైఎస్,కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాలలో పనిచేసారు,72సంవత్సరాల వెంకట్ రెడ్డి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్స్ పార్టీ కి కీలక నేతగా ఉన్నారు. ఖమ్మం జిల్లా సుజాతనగర్ నియోజకవర్గం నుండి 3సార్లు,పాలేరు నియోజకవర్గం నుండి 2సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణా వాణిని కాంగ్రెస్స్ హై కమాండ్ కి బలంగా వినిపించిన రాంరెడ్డి మృతిపట్ల కెసిఆర్ సంతాపం ప్రకటిస్తూ ,తెలంగాణా రాజకీయ నేతల్లో ఎలాంటి మచ్చ లేని నేత అని గుర్తు చేసారు . 


తెలంగాణకు జాతీయస్థాయిలో మద్దతిచ్చిన తొలి పెద్దాయన ఇక లేరు

తెలంగాణకు జాతీయస్థాయిలో మద్దతిచ్చిన తొలి పెద్దాయన ఇక లేరు 

ఈశాన్య రాష్ట్రాల ఆశాజ్యోతి మాజీ స్పీకర్ పిఎం.సంగ్మా అస్తమయం 


ఈశాన్య రాష్ట్రాల ఆశాజ్యోతి మాజీ లోక్ సభ స్పీకర్ పిఎం సంగ్మా ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూసారు. 1988-90ల మధ్య మేఘాలయ ముఖ్యమంత్రి గా పనిచేసిన సంగ్మా 1996-98మధ్య 11వ లోక్ సభ స్పీకర్ గా పనిచేసారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి స్పీకర్ గా పనిచేసిన తొలి వ్యక్తిగా నిలిచిన పెద్దాయన ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి విశేషంగా కృషి చేసారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన సంగ్మా జాతీయ స్థాయిలో అన్ని పార్టీలతో సఖ్యంగా ఉంటూ వెనుకబడిన ప్రాంతాల వాణిని బలంగా వినిపించిన సంగ్మా తెలంగాణా మలి దశ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన తొలి జాతీయ నేతగా నిలిచారు. సంగ్మా మృతికి ఈరోజు ఉదయం సంతాపం తెలిపిన అనంతరం ఉభయ సభలను వాయిదా వేసారు. సంగ్మా మృతి పట్ల తెలంగాణా ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి చెందిన కెసిఆర్ ,సంగ్మా కుటుంబ సభ్యలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. 

టిటిడిపి శాసనసభ పక్షం టిఅరేస్ లో విలీనానికి ముందడుగు??5ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

టిటిడిపి శాసనసభ పక్షం టిఅరేస్ లో విలీనానికి ముందడుగు??5ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు 

టి టిడిపి శాసనసభ పక్షాన్ని టిఅరేస్ లో విలీనానికి సర్వం సిద్దమైంది,ఇందులో బాగంగానే పార్టీ మారిన అయిదుగురు టిడిపి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి పార్టీ మారడంపై సంజాయిషీ ఇవ్వాలని మడుసూధనాచారి కోరారు. గతం లో అయిదుగురికి నోటీసులు ఇవ్వగా వారు వివరణ ఇచ్చారు,ప్రస్తుతం నోటీసులు అందుకున్న ఎర్రబెల్లి ,రాజేందర్ రెడ్డి,వివేకానంద,ప్రకాష్ గౌడ్,సాయన్న లు తమదే అసలైన టిడిపి శాసనసభ పక్షమని 2/3మెజారిటీ ఉన్నందున మా పక్షాన్ని టిఅరేస్ లో విలీనం చేయడానికి అనుమతించాలని కోరనున్నారు. ఈ అయిదుగురి సంజాయిషీ తో ఈ బడ్జెట్ సమావేశాలలోపే స్పీకర్ నిర్ణయం వెలువడనుంది. 


తెలంగాణాలో 8000మెగావాట్ల పవనవిద్యుత్ ఉత్పత్తి కి అవకాశం???

తెలంగాణాలో 8000మెగావాట్ల పవనవిద్యుత్ ఉత్పత్తి కి అవకాశం???

తెలంగాణా పునర్నిర్మాణం లో మిగులు విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి మరో అవకాశం,తెలంగాణలో గాలి వీచే దిశ పవన విద్యుత్ ఉత్పత్తికి అంతగా అనుకూలంగా లేనప్పటికీ రంగారెడ్డి,మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానంతో 8000మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థ పేర్కొంది. విద్యుత్ కి కొంత ఎక్కువ టారిఫ్ చెల్లిస్తే తెలంగాణా లో పెట్టుబడులకు కంపెనీలు ముండుకువస్తాయని. తెలంగాణాలో 100మీటర్ల హబ్ ఎత్తులో 2018-19నాటికి కనీసం 2000మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తుంది 

నిరుద్యోగులకు శుభవార్త;కమ్యునికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగార్థుల వయోపరిమితి పెంపు

నిరుద్యోగులకు శుభవార్త;కమ్యునికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగార్థుల వయోపరిమితి పెంపు 

తెలంగాణా ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. ఇప్పటికే పోలీస్ పోస్టులకు వయోపరిమితి సడలించిన ప్రభుత్వం పోలిస్ కమ్యునికేషన్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులకు మరో సంవత్సరం వయోపరిమితి సడలింపు ఇస్తున్నట్లు తెలంగాణా రాష్ట్ర పొలీస్ నియామక మండలి చైర్మెన్ పూర్ణచంధర్ రావు తెలిపారు. వాస్తవంగా పొలీస్ కానిస్టేబుల్ గరిష్ట వయోపరిమితి 18-22సంవత్సరాలు కాని ఇదివరకు తెలంగాణా ప్రభుత్వం 3సంవత్సరాలు సడలింపు ఇయ్యగా అది 25కు చేరగా ప్రస్తుతం మరో సంవత్సరం సడలింపు తో ఈ సంవత్సరం జూలై 1నాటికి 26లోపు ఉన్నవారికి కూడా అర్హత ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ,బీసీ ఇతర వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు వీటికి అదనం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15ఆఖరు తేది. 

Thursday, 3 March 2016

తెలంగాణా వరప్రదాత...జలప్రదాత... జలవివాద పరిష్కర్త... బహుపాత్రాభినయ కర్త...!

తెలంగాణా వరప్రదాత...జలప్రదాత... జలవివాద పరిష్కర్త... బహుపాత్రాభినయ కర్త...!

తెలంగాణా వరప్రదాయిని... ప్రాణహిత-చేవెళ్ల... దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్న కల!సమైఖ్య రాష్ట్రంలో వివాదాలకు కేంద్రంగా,అడ్డదిడ్డంగా డిజైన్ చేయబడి ఎన్నో ఏళ్లుగా కర్షకులకు కలగానే మిగిలిన కలను నిజం చేయుటకు రాజకీయ దురందరుడు,ఉద్యమ సారది,స్వరాష్ట్ర సారది ఇంజనీర్,డిజైనర్,జలవివాద పరిస్కర్తగా బహుపాత్రాభినయం చేస్తూ సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణా అవసరాలకు,పరిస్థితులకు అనుగుణంగా లేని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ చేయాలని పట్టుబట్టి సాగునీటి రంగ డిజైనర్ అవతారమెత్తి రీడిజైన్ చేయించి ఆదిలాబాద్ కౌటాల మండలం తుమ్మదిహెట్టి వద్ద ప్రానహితపై తలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును 130కిలోమీటర్ల దిగువకు కరీంనగర్ కాళేశ్వరం వద్ద గోదావరి పై నిర్మించాలని నిర్ణయించి మొత్తం ప్రాజెక్ట్ కింద అయిదు ఆనకట్టలు నిర్మించాలని రీడిజైన్ లో కీలక పాత్ర పోషించి అపర బగీరతుడిగా నిలిచి అసాద్యాన్ని సుసాద్యం చేసి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో దశాబ్దాలుగా వివాదాలతో ఉన్న నేటి పరిస్థితుల్లో వివాదాలకు తావులేకుండా మహారాష్ట్ర తో జల దౌత్యం చేసి చరిత్ర పుటాల్లోకి ఎక్కి,జలవివాద పరిస్కర్తగా దేశానికే ఆదర్శంగా నిలిచి నేను రాజకీయ చానుఖ్యుడినే కాదు అపర చానఖ్యుడిని ,చానఖ్య చంద్రగుప్త చంద్రశేఖరుడిని అని బహుపాత్రాభినయ నేత అని నిరూపించుకున్న కెసిఆర్. 

తెలంగాణా చంద్రశేఖరుడి తీర్థయాత్రలు???;తెలంగాణా మొక్కులు తీర్చనున్న కెసిఆర్???

తెలంగాణా చంద్రశేఖరుడి తీర్థయాత్రలు???;తెలంగాణా మొక్కులు తీర్చనున్న కెసిఆర్???

తెలంగాణా ఉద్యమ సమయంలో తెలంగాణా రాష్ట్రం సిద్దించాలని మొక్కిన మొక్కులను తీర్చుటకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆంధ్ర ,తెలంగాణా దేవాది దేవతలను దర్శించుకునుటకు తీర్థయాత్రలకు సిద్దమైతున్నట్లు సమాచారం. ఇప్పటికే కెసిఆర్ ఆదేశాల మేరకు టిటిడి కోయంబత్తూర్ కి చెందిన ప్రముఖ నగల తయారి సంస్థకు తిరుపతి వేంకటేశ్వర స్వామికి 5కోట్ల విలువైన వజ్ర కిరీటం,5వరసల పసిడి పథకం తయారు చేయిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే వరంగల్ బద్రకాళి అమ్మవారికి 57లక్షల విలువైన 2కిలోల బంగారు కిరీటం,వరంగల్ మహబూబాబాద్ కురివి వీరబద్రస్వామికి బంగారు మీసాలు,విజయవాడ కనకదుర్గ కు,పద్మావతి అమ్మవార్లకు తలో 2లక్షల విలువైన ముక్కుపుడకలు చేయిస్తున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ సమావేశాల మధ్యలో గాని,బడ్జెట్ సమావేశాల అనంతరం గాని తెలంగాణా ముఖ్యమంత్రి ఈ దేవాలయాలను సందర్శించి మొక్కులు తీర్చనున్నట్లు తెలుస్తుంది. 


ఎర్రగడ్డ లో తెలంగాణా నూతన సచివాలయం....!

ఎర్రగడ్డ లో తెలంగాణా నూతన సచివాలయం....!

తెలంగాణా నూతన సచివాలయాన్ని ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లోని కేంద్ర సచివాలయం నార్త్,సౌత్ బ్లాక్ తరహాలో నిర్మించాలని సచివాలయం లో తూర్పు ముఖంగా సిఎం ఆఫీస్,రెండు వైపుల మంత్రులు,అధికారుల కార్యాలయాలు ఉండేలా 15రోజుల్లో తెలంగాణా సంప్రదాయ ఆకృతిలో నమూనాలను సిద్దం చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. దీంతో ఆర్ అండ్ బీ అధికారులతో ఆర్కిటెక్ట్ హఫీజ్,సిబ్బంది బేటీ అయ్యారు. 48ఎకరాల్లో విస్తరించిన చాతి ఆస్పత్రి స్థలంలో ఎనిమిది అంతస్తులతో సచివాలయ భవనం మధ్యలో ముఖ్యమంత్రి కార్యాలయం రెండు పక్కల మంత్రులు,అధికారుల కార్యాలయాలు,ఛాతి ఆస్పత్రి పక్కనే ఉన్న మానసిక ఆస్పత్రి తాలూకు 40ఎకరాల్లో అసెంబ్లీ ,మండలి లల కోసం భవనాలు వాటిని అనుసందానిస్తూ సెంట్రల్ హాల్ నిర్మాణానికి ఇప్పటికే హఫీజ్ డిజైన్ రూపొందించగా వాటికి కొన్ని మార్పులు సూచించిన కెసిఆర్ నిర్ణయానికి అనుగుణంగా 15రోజుల్లో డిజైన్ రూపొందించి నెల రోజుల్లో నూతన సచివాలయానికి శంకుస్థాపన చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు. 

తెలంగాణాలో మరో మూడు విమానాశ్రయాలు

తెలంగాణాలో మరో మూడు విమానాశ్రయాలు 


తెలంగాణాలో ఇప్పుడున్న విమానాశ్రయానికి తోడుగా మరో మూడు విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ పేర్కొంది వీటి ఏర్పాటుకు తెలంగాణా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు అశోక గజపతి రాజు పేర్కొన్నారు. ఆదిలాబాద్ లో విమానాశ్రయానికి మూడేళ్ళ కిందటే సర్వే నిర్వహించగా విమానాశ్రయానికి 940ఎకరాలు కేటాయించాలని కోరారు. ఖమ్మంజిల్లా కొత్తగూడెం లో రాష్ట్ర ప్రభుత్వం చూపించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా లేదనడంతో మరొక స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వరంగల్ లో మమ్నూర్ ప్రాంతంలోని పాత ఎయిర్ పోర్ట్ స్థలానికి అదనంగా మరో 400ఎకరాలు కేటాయించాలని,హైదరాబాద్ లో శంషాబాద్ కి తోడుగా హకీం పేటలో మరో ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేయాలని గతంలో కెసిఆర్ ప్రతిపాదించగా శంషాబాద్ కి హకీంపేట్ 34కిలోమీటర్ల దూరం మాత్రమే ఉన్నందున మరో ఎయిర్ పోర్ట్ సాధ్యం కాదని రాష్ట్రానికి రాసిన లేఖలో కేంద్ర పౌర విమానయాన శాఖ పేర్కొంది. ఈ లేఖ పై సత్వరమే స్పందించుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించింది. 


ఆసియా లో అమేజాన్ ప్రదాన కార్యాలయం @హైదరాబాద్

ఆసియా లో అమేజాన్ ప్రదాన కార్యాలయం @హైదరాబాద్ 

ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అమెరికా వెలుపల తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. ఆసియాలోనే అతిపెద్దదైన అమెజాన్ కార్యాలయం ఏర్పాటుకు నానక్ రామ్ గూడాలో 30లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లో నిర్మించుటకు తెలంగాణా ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకున్న అమెజాన్ ఈ నెల ఆఖరున శంకుస్థాపనకు సిద్దం అవుతుంది. ఈ కార్యాలయం పూర్తయితే తోలివిడుతలోనే 14000మందికి ఉపాధి దొరకనుంది. ఇప్పటికే హైదరాబాద్ సమీపంలోని కొత్తురుల్లో గోదాముల సముదాయం ఏర్పాటు చేసిన అమెజాన్ ఇప్పుడు ఆసియాలో తమ ప్రదాన కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే గూగుల్,ఆపిల్,ఐకియా,ఉబెర్ వంటి సంస్థలు హైదరాబాద్ లో అడుగుపెట్టగా అమెజాన్ రాకతో కీర్తి కిరీటంలోకి మరో కలికితురాయి. 

మహాసాదకుడు చాణఖ్య చంద్రశేఖరుడు;అంతరాష్ట్ర జలవివాదాలకు తొలి చెక్

మహాసాదకుడు చాణఖ్య చంద్రశేఖరుడు;అంతరాష్ట్ర జలవివాదాలకు తొలి చెక్ 

ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న అంతరాష్ట్ర జలవివాదాల సమస్యకు ఎందరో ముఖ్యమంత్రులు ,ఎందరో కేంద్రమంత్రులు ,కేంద్ర ప్రభుత్వాలు పరిష్కారం చూపాలని చేసిన విపల ప్రయత్నాలకు చెక్ పెడుతూ రెండు సంవత్సరాల కాలంలోనే చర్చలు సపలం చేసి ఒప్పందాలకు సిద్దమై మహారాష్ట్ర -తెలంగాణా గోదావరి జల వివాదాలకు తెరదించిన మహాసాదకుడు కెసిఆర్. గత ఏడాది కాలంలో పలుమార్లు మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణా ప్రభుత్వం ,కెసిఆర్,హరీష్ రావు,నీటిపారుదల శాఖ అధికారులు జరిపిన చర్చల పలితంగా గోదావరిపై తెలంగాణా నిర్మించనున్న బ్యారేజీలకు మహారాష్ట్ర తో ఒప్పందానికి ముహూర్తం కుదిరింది. అంతరాష్ట్ర సమస్యలు ,వివాదాలకు తావులేకుండా తెలంగాణా చేపడుతున్న తుమ్మిడిహట్టి,మేటిగడ్డ,కాళేశ్వరం మొదలగు అయిదు ఆనకట్టల నిర్మాణానికి ఒప్పందం చేసుకోవడానికి రావలసిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఫోన్ చేసి ఆహ్వానించారు. పడ్నవిస్ ఆహ్వానం మేరకు ఈ నెల 7న ముఖ్యమంత్రి కెసిఆర్ ,నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు,నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ముంబై వెళ్లనున్నారు. 8న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం జరగనుంది. మేడి గడ్డ ,తుమ్మిడిహెట్టి ,చనఖ-కొరాట,రాజుపేట,పెన్ పహాడ్ ఆనకట్టల నిర్మాణంలో ఈ ఒప్పందం కీలకం కానుంది. ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న జలసమస్యకు పరిష్కారానికి కెసిఆర్ చంద్రశేఖర్ చానఖ్యం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్షం కానుంది 

అమెజాన్ లో తెలంగాణా హస్తకళా ఉత్పత్తులు

అమెజాన్ లో తెలంగాణా హస్తకళా ఉత్పత్తులు 

తెలంగాణా హస్తకళా ఉత్పత్తులను ఆన్ లైన్ లో విక్రయించుటకు రంగం సిద్దం చేసారు. తెలంగాణా గోల్కొండా హస్తకళా కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కరీంనగర్ వెండి నగీషి,పెంబర్తి ఇత్తడి కళాకృతులు,నిర్మల్ కొయ్య బొమ్మలు ,హైదరాబాద్ దోక్రా,వరంగల్ డర్రీలు ,పూసల దండలు మొదలగు 180హస్తకళా ఉత్పత్తులను ఈ నెల 5నుంచి ప్రపంచ అగ్రశ్రేణి ఆన్ లైన్ వస్తు మార్కెటింగ్ సంస్థ అమెజాన్ లో విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా హైదరాబాద్,సికింద్రాబాద్ తో పాటు కోల్ కత్తా,ఢిల్లీ లో విక్రయ సంస్థలు ఉన్న తెలంగాణా హస్తకళా సంస్థ కు ఏటా 10కోట్ల టర్నోవర్ ఉంది. అమెజాన్ తో ఒప్పందంతో తెలంగాణా హస్త కళలకు ప్రపంచ స్థాయి మార్కెటింగ్ కలిపించనుంది . 



'చాలెంజర్ ఆఫ్ ది ఇయర్' గా కేటిఆర్

'చాలెంజర్ ఆఫ్ ది ఇయర్' గా కేటిఆర్ 


ప్రముఖ సంస్థ స్కాచ్ 'చాలెంజర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డును తెలంగాణా ఐటి,పంచాయితీ రాజ్ ,పురపాలక శాఖా మంత్రి వర్యులు కేటిఆర్  కి ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడకంలో విప్లవాత్మక మార్పులకు,స్థానిక సంస్థల్లో సాంకేతిక పెంచుటకు కేటిఆర్ చేసిన కృషికి గుర్తుగా ఈ అవార్డును ప్రకటించినట్లు సంస్థ పేర్కొంది. ఈ అవార్డును ఈ నెల 19న ఢిల్లీ లో కేటిఆర్ అందుకోనున్నారు. ఈ సందర్బంగా 'స్టార్టప్'లకు మద్దతుగా కేటిఆర్ కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ సంస్థ 'జీవిత సాపల్య పురస్కారాన్ని ' కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖా మంత్రివర్యులు వెంకయ్య నాయుడి కి ప్రకటించింది. 

చంద్రశేఖర-రాజేంద్రుల లక్ష 30వేల కోట్ల ప్రజా బడ్జెట్....?

చంద్రశేఖర-రాజేంద్రుల లక్ష 30వేల కోట్ల ప్రజా బడ్జెట్....?


కేంద్ర బడ్జెట్ కన్నా ముందే ప్రతీ శాఖ కు కేటాయింపులు,అభివృద్దిపై స్వయంగా సమీక్షించిన కెసిఆర్ జైట్లీ బడ్జెట్ కేటాయింపులను స్వయంగా సమీక్షించిన అనంతరం తెలంగాణా బడ్జెట్ కి తుదిరూపునిచ్చారు ముఖ్యమంత్రి కెసిఆర్. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించిన నిధులు ,కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్రానికి వచ్చే ఆదాయం,రాష్ట్ర ప్రభుత్వం పై పడే ప్రభావాలను అంచనా వేసిన కెసిఆర్ క్రితం సంవత్సర రాష్ట్ర వార్షిక బడ్జెట్ కంటే మరింత పెంచుతూ లక్షా 30వేల కోట్ల బడ్జెట్ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. మిషన్ కాకతీయ ,మిషన్ భగీరథ,డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు బడ్జెట్ లో అధిక ప్రాదాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 

Wednesday, 2 March 2016

తెలంగాణా లోగిళ్లు....ఎల్ఈడి వెలుగుల్లో....!

తెలంగాణా లోగిళ్లు....ఎల్ఈడి వెలుగుల్లో....!


తెలంగాణా లోగిళ్ళను ఎల్ఈడి వెలుగులతో నింపేందుకు తెలంగాణా విద్యుత్ శాఖ మాత్యులు జగదీశ్ రెడ్డి ,పురపాలక పట్టణ అభివృద్ది శాఖ మాత్యుల కేటిఅర్ ,మున్సిపల్ ,డిస్కం అధికారులు సామావేశమై 100రోజుల ప్రణాళిక సిద్దం చేసారు. నిర్దేశించిన 100రోజుల్లో తెలంగాణాలోని 25మున్సిపాలిటీల్లో 6లక్షల గృహాలకు ఇంటికి రెండు ఎల్ఈడి బల్బుల చొప్పున 12లక్షల బల్బులను సరపరా చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ఇతర పట్టణాలు గ్రామ పంచాయితీలల్లో ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేయనున్నట్లు కేటిఅర్ తెలిపారు. తెలంగాణాలోని 90లక్షల గృహాలలో 9వాట్ల కోటీ 80లక్షల ఎల్ఈడి బల్బులు అందిస్తే ఇందన పొదుపుతో గృహాలతోపాటు ప్రభుత్వానికి ఎంతో ఆదా అవనుంది. 

చంద్రశేఖర చక్రవ్యూహం లో ప్రతిపక్షాలు ; ప్రజా సమస్యలపై చర్చకు లైన్ క్లియర్

చంద్రశేఖర చక్రవ్యూహం లో ప్రతిపక్షాలు

ప్రజా సమస్యలపై చర్చకు లైన్ క్లియర్ 

శాసన సభలో రచ్చ లేకుండా ప్రజా సమస్యలపై చర్చిస్తూ ప్రజా సమస్యలకు సభలోనే పరిష్కారం కనుగొనేందుకు ప్రతిపక్షాలను కెసిఆర్ తన చక్రవ్యూహం లో బంధించాడు. గవర్నర్ ప్రసంగం నుండి సభ చర్చలవరకు కఠిన తర నిబందనలతో సభా సమయం వృదా కానీయకుండా ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీ రూల్స్ కమిటీ సమావేశ పరిచిన ప్రభుత్వం ప్రతిపక్షాల సాక్షిగా గవర్నర్ ప్రసంగం అడ్డుకున్న,అనవసర విషయాలతో సభను అడ్డుకున్నా,సభలో ప్లకార్డులతో ,నిషేధిత వస్తువులతో నిరసనలు ,గందరగోళం సృష్టిస్తే ,నిబందనలకు విరుద్దంగా వ్యవహరిస్తే ఏడాది పాటు సస్పెన్షన్ చేయొచ్చని,కఠిన చర్యలు తీసుకోవచ్చని,సభలో అనవసర ,నిరాధార ఆరోపణలు ,వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ సభా చర్చలకు ఆటంకం కల్పించినా చర్యలు తీసుకోవచ్చని  రూల్స్ కమిటీలో చర్చించిన ప్రభుత్వం ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు కెసిఆర్ కసరత్తు పూర్తి చేసారు. ఇప్పటికే తెలంగాణాలో ప్రతిపక్ష టిడిపి ని లేకుండానే చేసిన కెసిఆర్ సభను సజావుగా జరిగేందుకు పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యారు. 

తెలుగు రాష్ట్రాల్లో బలోపేతానికి కమలం కసరత్తు;ఓ వైపు సిఎం అభ్యర్థిగా చిరంజీవి???

తెలుగు రాష్ట్రాల్లో బలోపేతానికి కమలం కసరత్తు;ఓ వైపు సిఎం అభ్యర్థిగా చిరంజీవి???

గత ఎన్నికల నాటికి రెండు రాష్ట్రాల ప్రజలు బిజేపీ కి సానుకూలంగానే ఉన్నప్పటికీ పొత్తులతో పుంజుకొని బిజేపీ 2019ఎన్నికల్లో సత్తా చాటటానికి కసరత్తు మొదలెట్టింది. తెలంగాణాలో అందపాతాలంలోకి వెళ్ళిన టిడిపి కంటే అధికారంలో ఉన్న టిఅరేస్ తో ఉంటేనే మేలని భావిస్తున్న బిజేపీ వర్గాలు టిడిపి తో పొత్తులు తెగదెమ్పుల్లొ బాగంగా వరంగల్ లో ఒంటరి పోరు చేస్తూ కేంద్ర క్యాబినెట్ లోకి టిఅరేస్ కి ఆహ్వాన సంకేతాలు పంపిస్తుంది. 2019ఎన్నికల్లో టిఅరేస్ తో పొత్తు లేదా అవగాహనతో తెలంగాణాలో ముందుకెళ్లి సత్తా చాటాలని ప్రణాళిక సిద్దం చేస్తుంది. 
ఆంధ్రలో 2019ఎన్నికలకు ముందు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి,చిరంజీవిని కాంగ్రెస్ నుండి బిజేపీ లోకి తీసుకుని బలమైన కాపు సామాజిక వర్గం అండతో చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి జనసేన అధినేత పవన్ తో పొత్తుతో ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా మున్డుకేల్లాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తూ దక్షిణ భారతంలో బిజేపీ హవాకి బలమైన పునాదులు వేయాలని వ్యూహ రచన చేస్తుంది. 



తలసరి ఆదాయంలో తెలంగాణా 8వ స్థానం

తలసరి ఆదాయంలో తెలంగాణా 8వ స్థానం 

జాతీయ స్థాయి తలసరి ఆదాయంలో తెలంగాణా ఎనిమిదవ స్థానంలో నిలిచింది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ నివేదికలో నూతనంగా ఏర్పడిన తెలంగాణా చాల రాష్ట్రాలకు దీటుగా నిలిచి ఎనిమిదవ స్థానం లో నిలిచింది. జీఎస్డీ అభివృద్ధి లో కూడా తెలంగాణా ముందంజలో నిలిచింది. 13జిల్లాలు,ఎక్కువ జనాభా,ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం కలిగి న  ఆంధ్రప్రదేశ్ తో పోటీపడుతూ తెలంగాణా దూసుకుపోతుందని నివేదికలో పేర్కొంది. దేశంలో తలసరి ఆదాయంలో గోవా తొలిస్థానంలో,హర్యానా 2వ,ఉత్తరాఖండ్ మూడవ స్థానంలో నిలవగా ,ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలోనిలిచింది.  

ప్రపంచంలో మూడో ఉత్తమ విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్

ప్రపంచంలో మూడో ఉత్తమ విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ 

ఎయిర్ పోర్ట్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల్లో ఎయిర్ పోర్ట్ సర్విస్ క్వాలిటీ ప్రకారం 2015కు గాను 5-15మిలియన్ల సామర్ధ్యంగల ప్రపంచ ఎయిర్ పోర్టులలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు మూడో స్థానం లో నిలిచింది. 2008లో ప్రారంబమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరుసగా 7సంవత్సరాలు తొలి మూడు స్థానాల్లో నిలవడం విశేషం. 

Tuesday, 1 March 2016

లంకను దాటి ఫైనల్లో అడుగిడిన భారత్

లంకను దాటి ఫైనల్లో అడుగిడిన భారత్ 

                 బంగ్లాదేశ్ డాకా షేర్ ఏ బంగ్లా స్టేడియం లో శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో 5వికెట్ల తేడాతో విజయం సాదించి లంకను దాటి భారత్ ఆసియా కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ పాండ్య 2/26,అశ్విన్ 2/26,భూమ్ర 2/27సూపర్ బౌలింగ్ తో శ్రీలంక ను 20ఓవర్లలో 138/9కి కట్టడి చేయగలిగింది. కపుగేదేరా 32బంతుల్లో 30,సిరివర్దన 17బంతుల్లో 22పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. 
            139పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కులశేకర 2/21పదునైన బౌలింగ్ తో ఆరంబం లోనే ధావన్(1)రోహిత్ 11పరుగులకే వెనుదిరిగినా కోహ్లి 47బంతుల్లో 56,యువరాజ్ 18బంతుల్లో 35,రైనా 26బంతుల్లో 25 సమయోచిత బ్యాటింగ్ తో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాదించింది. చాలా రోజులుగా పూర్వపు ఫామ్ అందుకోలేకపోతున్న యువరాజ్ ఈ మ్యాచ్ లో తనదైన శైలిలో మెరుపులు మెరిపిస్తూ 3పొర్లు,3సిక్షర్స్ తో 35పరుగులు చేయడం విశేషం. అర్ద సెంచరీ తో రాణించిన కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. 

చంద్రబాబుకి షాకింగ్ కౌంటర్ సిద్దం ......!

చంద్రబాబుకి షాకింగ్ కౌంటర్ సిద్దం ......!

తెలంగాణాలో టిడిపి పరిస్థితి దిగజారినా ఆంధ్రాలో ఆకర్ష్ పేరిట చంద్రహాసం చూపించిన చంద్రబాబు కి ఆ ఆనందం ఎన్నోరోజులు మిగలనీయకుండా జగన్ షాకింగ్ కౌంటర్ కి రంగం సిద్దం చేసాడు. ఈ బడ్జెట్ సమావేశాల తొలిరోజే ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే అవిస్వానికి వ్యతిరేకంగా ఓటేసిన వైసీపీ జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్దం చేసారు. ఇలా వేటేస్తే ఉప ఎన్నికలు వస్తే చంద్రబాబు పాలనకి రేపరెండం గా మారడం ఖాయం,జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలలో రైళ్లు పరిగెడుతున్నాయి. 

హైదరాబాద్ కి దలైలామాను ఆహ్వానించనున్న తెలంగాణా ప్రభుత్వం

హైదరాబాద్ కి దలైలామాను ఆహ్వానించనున్న తెలంగాణా ప్రభుత్వం 

బౌద్ద బిక్షువు ది గ్రేట్ దలైలామా ను హైదరాబాద్ కి ఆహ్వానించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న 'బౌద్దవనమ్' ప్రారంబానికి దలైలామా ను ఆహ్వానించనుంది. అలాగే హైదరాబాద్ లో దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ కేంద్రాన్ని నిర్మించాలని,ఇందుకు నగర శివార్లలో అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించింది. 

మోడీ మట్టి మూట ఇయ్యగా;బడ్జెట్ లో జైట్లీ బూడిద విదిల్చారు

మోడీ మట్టి మూట ఇయ్యగా;బడ్జెట్ లో జైట్లీ బూడిద విదిల్చారు


ఆంధ్రప్రదేశ్ నూతన రాజదాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రదాని హోదాలో ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన ప్రదాని మోడీ పార్లమెంట్ ఆవరణ మట్టిమూట తేగా ఎన్నో ఆశలతో ఎదురుచూసిన జైట్లీ బడ్జెట్ లో బూడిద విదిల్చారని ఆంధ్ర ప్రజానీకం అనుకుంటున్నారు,నిన్నటి బడ్జెట్ లో ఆంధ్రకి ప్రత్యేక హోదా ,ప్రత్యేక ప్యాకేజీ విషయం పై ప్రస్థావించకపొగా కనీసం రాజదాని నిర్మాణం లో మౌలిక వసతులకు సైతం నిధులు కేటాయించడం మరిచిన జైట్లీ వేల కోట్లు అవసరమయ్యే పోలవరానికి 100కోట్లు బిక్షం వేసారు. విశాక స్టీల్ ప్యాక్టరీకి 1678కోట్లు కేటాయింపు ఊరట కలిగించగా తిరుపతి ఐఐటి ,తాడేపల్లి ఎన్ఐటి లకు 40కోట్లు ,విశాఖపట్నం ఐఐఎం కి 30కోట్లు కేటాయింపులతో ఊరట కలిగించారు . ఈ కేటాయింపులపై ఆంధ్ర ప్రతిపక్షం కంటే ప్రభుత్వ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. 

Monday, 29 February 2016

కేంద్ర మానవవనరుల శాఖ ఆదేశాలతో టెట్ వాయిదా...!

కేంద్ర మానవవనరుల శాఖ ఆదేశాలతో టెట్ వాయిదా...!


కేంద్ర మానవవనరుల అభివృద్ది శాఖ ఆదేశాల మేరకు తెలంగాణా ప్రభుత్వం టెట్ నిర్వహణను వాయిదా వేసింది. టెట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎదురుచూపులు మిగిల్చింది కేంద్ర నిర్ణయం. దేశవ్యాప్తంగా టెట్ నిర్వాహణ తీరుపై అధ్యయనం చేయదలచిన మానవవనరుల అభివృద్ధి శాఖ టెట్ నిర్వాహణ అధ్యయనానికి అయిదుగురు సభ్యులతో కమిటీ వేసి మూడు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణా లో టెట్ నిర్వాహణ మే నెల తర్వాతనే జరగనుంది,దీంతో తెలంగాణా డీఎస్సి నిర్వహణ మరింత ఆలస్యం కానుంది. రెండు రోజుల క్రితం తెలంగాణా విద్యాశాఖ టెట్ షెడ్యూల్డ్ విడుదలతో ఆనంద పడ్డ నిరుద్యోగులకు నిరాశ మిగిల్చింది. 

కెసిఆర్ కబంద'హస్తాల్లో' కారులోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు???

కెసిఆర్ కబంద'హస్తాల్లో' కారులోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు???

ఇన్నిరోజులు తెలంగాణా టిడిపి ఎమ్మెల్యేలను ఆకర్ష్ వలలోకి లాగి 2/3మెజారిటీతో టిడిపి శాసనసభ పక్షం విలీనం దిశగా అడుగులేపించిన కెసిఆర్ ద్రుష్టి ఇప్పుడు కాంగ్రెస్ వైపు మరల్చారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్థానాన్ని ఉపఎన్నికలో దక్కించుకున్న కెసిఆర్ ఇక మిగిలిన 20కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఇప్పటికే నలుగురు కాంగ్రెస్ లోకి రాగ మరో 10మంది ఎమ్మెల్యేలను టిఅరేస్ లోకి లాగడానికి మంతనాలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగడంతో నల్గొండ,మహబూబ్ నగర్ లలో పార్టీ పటిష్టత కు బలమైన పునాదులు వేయాలని భావిస్తున్నారు. ఇందులో బాగంగా మహబూబ్ నగర్ లోని ఎమ్మెల్యేలు డి.కే. అరుణ,సంపత్ కుమార్,నల్గొండ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ,వరంగల్ లో మాధవ రెడ్డి తో పాటు పువ్వాడ అజయ్ ,రామిరెడ్డి వెంకట్ రెడ్డి లపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తుంది. వరంగల్ ,ఖమ్మం మున్సిపల్ ఎన్నికల అనంతరం వలసల పర్వం మొదలుకానున్నట్లు తెలుస్తుంది. రానున్న రాజ్యసభ ఎన్నికల సమయానికి విప్ సమస్యలు లేకుండా ఆపరేషన్ కాంగ్రెస్ పూర్తి చేయనున్నట్లు టిఅరేస్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

తెలంగాణా హెలీటూరిజం రేపే ప్రారంబం

తెలంగాణా హెలీటూరిజం రేపే ప్రారంబం 

తెలంగాణా టూరిజం శాఖ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ హెలీటూరిజం రేపే అట్టహాసంగా ప్రారంబం కానుంది. ఇండ్ వెల్ ఏవియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సాంస్కృతిక,పర్యాటక,చారిత్రక ప్రదేశాలను హేలిక్యాప్టార్ ద్వారా వీక్షించే అవకాశాన్ని తెలంగాణా టూరిజం శాఖ కల్పించనుంది. ఈ సదుపాయాన్ని నక్లెస్ రోడ్డు నుండి రేపు ఉదయం 10గంటలకు మంత్రి కేటిఅర్ ప్రారంబించనున్నారు. రేపు ప్రారంబం కానున్న ఈ సౌకర్యమ్ ఒక్కొక్కరికి రూ 3,499లకే కల్పించనుంది. హేలిక్యాప్టార్ ద్వారా మాత్రమే కాకుండా ఎయిర్ బెలూన్ ద్వారా కూడా హైదరాబాద్ అందాలను వీక్షించి అవకాశం పర్యాటకులకు కల్పించనున్నారు. ఈ అవకాశం తో విదేశీ పర్యాటకులను సైతం ఆకర్షించడం తో పాటు తెలంగాణా టూరిజం ప్రపంచ స్థాయిలో నిలవనుంది 




తాతకు తగ్గ మనవడు; సామాజిక నేపధ్య షార్ట్ ఫిల్మ్ లో కెసిఆర్ మనవడు హిమాన్షు

తాతకు తగ్గ మనవడు;

సామాజిక నేపధ్య షార్ట్ ఫిల్మ్ లో కెసిఆర్ మనవడు హిమాన్షు 

యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సాంఘిక దురాచారాలను రూపుమాపడం,సామాజిక బాధ్యతలను తెలియజెప్పడం ఇతివ్రుత్తంగా తెరకెక్కిస్తున్న షార్ట్ పిల్మ్ 'సూపర్ హార్ట్ 'లో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు హిమాన్షు లిటిల్ హీరో పాత్ర పోషించనున్నాడు. 5-10నిమిషాల నిడివితో ఉండే ఈ షార్ట్ పిల్మ్ లో మనోజ్ చోప్రా విలన్ గా నటించనుండగా బాలకార్మికులు,పిల్లల అక్రమ రవాణ,అవినీతి,లంచగొండితనం,మద్యపానం తదితర సాంఘీక దురాచారాలకు రూపుమాపడం ద్యేయంగా నిర్మించనున్న ఈ లఘు చిత్రాన్ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఆదివారం ప్రారంబించగా మార్చ్ 22నుంచి జరిగే చిత్ర నిర్మాణంలో హిమాన్షు పాల్గొననున్నాడు. తెలంగాణా పునర్నిర్మాణంలో పటిష్ట పునాదులు వేస్తున్న కెసిఆర్ మనవడిగా సామాజిక ఇతి వృత్తం గల లఘు ఫిలిం లో నటిస్తున్న హిమాన్షు తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నాడు. 

పెట్రోల్ ధర తగ్గింది;డీజిల్ ధర పెరిగింది

పెట్రోల్ ధర తగ్గింది;డీజిల్ ధర పెరిగింది 

ద్విచక్ర వాహన దారులకు శుభవార్త. లీటరు పెట్రోల్ పై రూ. 3.02తగ్గింది. గతంతో పోలిస్తే ఇంత పెద్దమొత్తంలో పెట్రోల్ ధర తగ్గడం ఇదే తొలిసారి. పెట్రోల్ ధర తగ్గినా డీజిల్ మాత్రం పెరిగింది. డీజిల్ ధర మాత్రం లీటరుకు రూ. 1.42తగ్గింది. పెట్రోల్ ,డీజిల్ ధరమార్పుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 60.82,లీటర్ డీజిల్ రూ. 49.86కి చేరుకోనుంది. మారిన పెట్రోల్ ,డీజిల్ ధరలు ఈ అర్దరాత్రి నుండి అమలులోకి రానున్నాయి. 

ఆస్కార్ రెడ్ కార్పెట్ పై అద్బుతం ప్రియాంక అందం

ఆస్కార్ రెడ్ కార్పెట్ పై అద్బుతం ప్రియాంక అందం 

ఆద్యంతం అత్యంత అద్బుతంగా జరిగిన 88వ ఆస్కార్ వేడుకల్లో ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ప్రియాంక చోప్రా తెల్లటి గౌనులో పోనీటైల్ తో ప్రత్యక్షమైన ప్రియాంక దివి నుండి దిగివచ్చిన దేవకన్యలా ప్రేక్షకుల మదిలో మరిచిపోలేని శిల్పంలా ముద్రించుకుపోయి ప్రేక్షకుల మతి పోగొట్టారు. ఇక హాలీవుడ్‌ భామలు వినూత్న వస్త్రధారణతో రెడ్‌ కార్పెట్‌పై హోయలొలికిస్తూ చేసిన క్యాట్‌వాక్‌లు ప్రేక్షకుల మతి పోగొట్టాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా ఆస్కార్‌ వేదికను విభిన్నంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌దీప కాంతుల్లో ఆస్కార్‌ వేదిక మెరిసిపోయింది. తొలిసారి ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న వారి ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా అలరించాయి.

ఆస్కార్ అదృష్టవంతులు వీరే....!

ఆస్కార్ అదృష్టవంతులు  వీరే....!

వినూత్నంగా రూపుదిద్దుకున్న వేదికపై అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌లో 88వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నటుడు క్రిస్‌రాక్‌ ప్రయోక్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి హాలీవుడ్‌ తారాగణం విచ్చేసి సందడి చేసింది. హస్యనటుడి గుర్తింపు తెచ్చుకున్న క్రిస్‌ తన ఛలోక్తులతో కార్యక్రమాన్ని ఆద్యంతం నవ్వులతో ముంచెత్తారు.

ఆస్కార్ అవార్డు విజేతలు విభాగాల వారిగా:

ఉత్తమ దర్శకుడు: అలోజాండ్రో గొంజాల్వెజ్‌ ఇనార్రిటు 
ఉత్తమ సహాయనటుడు: మార్క్‌ రేలేన్స్‌(బ్రిడ్జి ఆఫ్‌ స్పైస్‌) 
ఉత్తమ సహాయనటి: అలీసియా వికందర్‌(ద డానిష్‌ గర్ల్‌) 
ఉత్తమ ఛాయాగ్రహణం: ఎమ్మాన్యుయెల్‌ లుబెజ్కి (ద రివెనంట్‌) 
ఉత్తమ యానిమేషన్‌ చిత్రం: ఇన్‌సైడ్‌ అవుట్‌ 
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: స్పాట్‌లైట్‌ 
ఉత్తమ సంగీతం: ద హేట్‌ ఫుల్‌ ఎయిట్‌ (మోరిక్‌వన్‌) 
ఉత్తమ పాట: రైటింగ్స్‌ ఆన్‌ ద వాల్‌ (స్పెక్టర్‌) 
ఉత్తమ వస్త్రాలంకరణ: జెన్నీ బెవన్‌ (మ్యాడ్‌ మ్యాక్‌ ఫ్యూరీరోడ్‌) 
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కొలిన్‌ గిబ్బన్‌, లిసా థామ్సన్‌ (మ్యాడ్‌ మ్యాక్స్‌ ఫ్యూరీ రోడ్‌) 
ఉత్తమ అలంకరణ, కేశాలంకరణ: లేస్సీ వాండర్‌వాల్ట్‌, ఎల్కా వార్టెగా, డేమియన్‌ మార్టిన్‌ (మ్యాడ్‌ మ్యాక్స్‌ ఫ్యూరీ రోడ్‌) 
ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌: మార్క్‌ మంగిని అండ్‌ డేవిడ్‌ వైట్‌(మ్యాడ్‌ మ్యాక్స్‌: ఫ్యూరీ రోడ్‌) 
ఉత్తమ్‌ సౌండ్‌ మిక్సింగ్‌: క్రిస్‌ జెంకిన్స్‌, గ్రెగ్‌ రడ్లాఫ్‌, అండ్‌ బెన్‌ ఓస్మో( మ్యాడ్‌ మ్యాక్స్‌: ఫ్యూరీ రోడ్‌) 
 ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: మార్గరెడ్‌ సిజెల్‌ (మ్యాడ్‌ మ్యాక్స్‌: ఫ్యూరీ రోడ్‌) 
 ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌: ఎక్స్‌మెకినా (ఆండ్రూ వైట్‌ హస్ట్‌, పాల్‌ నోరిస్‌, మార్క్‌ అర్డింగ్టన్‌ అండ్‌ సరా బెన్నెట్‌) 
 ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌(యానిమేటెడ్‌): బేర్‌స్టోరీ (గాబ్రియల్‌ ఒసోరియో అండ్‌ పటో ఎస్కాలా 
ఉత్తమ యానిమేషన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ఇన్‌సైడ్‌ అవుట్‌(పీట్‌ డాక్టర్‌ అండ్‌ జోనన్‌ రివెరా) 
 ఉత్తమ్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: ఎమీ (అసిఫ్‌ కపాడియా అండ్‌ జేమ్స్‌ గేరీస్‌) 
 ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌: షట్టరర్‌ (బెంజిమన్‌ క్లియరీ అండ్‌ సెరీనా అమృతేజ్‌) 
 ఉత్తమ విదేశీ చిత్రం: ఆన్‌ ఆఫ్‌ సాల్‌(నీమ్స్‌, హంగరీ)


Sunday, 28 February 2016

చంద్రశేఖరుడి 'ఆటలో ఆరితేరుతున్న' చంద్రబాబు...!

చంద్రశేఖరుడి 'ఆటలో ఆరితేరుతున్న' చంద్రబాబు...!

తెలంగాణా ముఖ్యమంత్రి ఆడుతున్న ఆకర్ష్ ఆటలో తెలంగాణా టిడిపి ని భూస్థాపితం చేసుకున్న చంద్రబాబు చంద్రశేఖరుడి ఆటను అవగతం చేసుకుని ఇప్పుడిప్పుడే ఆరితేరుతున్నాడు. చెంద్రశేఖర్ రావు పన్నిన చక్రవ్యూహం లో చిక్కి శల్యమైన చంద్రబాబు,అదే చక్రవ్యూహాన్ని ఆంధ్రలో జగన్ పై పన్ని విజయవంతం అవుతున్నాడు. ఇప్పటికే వైసీపీ కి చెందినా 7గురు ఎమ్మెల్యేలను టిడిపిలోకి లాక్కున్న చంద్రబాబు మరికొంత మందిని లాగడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రశేఖరుడి తో ఆటలో ఓడిన చంద్రబాబు,చంద్రశేఖరుడి ఆటను అవగతం చేసుకుని ఆటలో ఆరితేరుతూ జగన్ కి ముచ్చెమటలు పట్టించడానికి ప్రణాళికలు రచిస్తున్నాడు. 

జగన్ మరో జలక్;టిడిపి లోకి మరో వైసిపీ ఎమ్మెల్యే

జగన్ మరో జలక్;టిడిపి లోకి మరో వైసిపీ ఎమ్మెల్యే 

వైసీపి అధినేత జగన్ కి మరో ఎమ్మెల్యే జలక్ ఇచ్చారు. గత రెండు రోజులుగా కడప,కర్నూల్,ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే లతో బేటీ అవుతూ బుజ్జగిస్తున్న ఈరోజు ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టిడిపి లో చేరారు. రాజు చేరికతో వైసీపీ ని వీడిన ఎమ్మెల్యేల సంఖ్య 7కి చేరింది. మరికొంతమంది టిడిపిలో చేరుటకు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. 

కెసిఆర్ సారుకూ.... అల్లం మద్దతు ధర కష్టాలు....!

కెసిఆర్ సారుకూ.... అల్లం మద్దతు ధర కష్టాలు....!

తెలంగాణా ముఖ్యమంత్రిగానే కాక,అభ్యుదయ రైతుగా అన్నదాతలందరికి ఆదర్శంగా నిలుస్తూ వినూత్న రీతిలో సాగు పై ద్రుష్టి సారించి అదునాతన సేద్యం సాగిస్తున్న కెసిఆర్ సారుకూ మద్దతు ధర కష్టాలు ఎదురౌథున్నాయి. గత ఖరీఫ్ సీజన్లో తన ఫాం హౌస్ లోని 50ఎకరాల్లో అల్లం సాగు చేసిన కెసిఆర్ కు ఇప్పుడు వ్యాపారుల దగా తో మద్దతు ధర రాక అల్లం పంటకాలం పూర్తైన తవ్వితీయకుండా అలాగే ఉంచారు. గత జూన్ లో అల్లం సాగు సమయంలో కిలో 150రూపాయలు ఉండగా ప్రస్థుతం మార్కెట్లో దళారులు కేవలం కిలోకి  35-40కే రైతు నుండి సేకరిస్తూ మార్కెట్లో మాత్రం 100కి పైగా విక్రయిస్తున్నారు. 50ఎకరాల్లో సాగు చేసిన అల్లం సుమారుగా ఎకరానికి 15టన్నుల దిగుబడి రానుందని అంచనా వేస్తున్నారు. ఉద్యానవన శాఖ అధికారులు అల్లం మార్కెట్ చేయడం పై ద్రుష్టి పెట్టగా కెసిఆర్ ఫాం లో సాగైన అల్లం కొనడానికి ఒకరిద్దరు వ్యాపారులు ఒక్కసారిగా కాకుండా విడుతల వారిగా కొనడానికి సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.