రెండో రోజు ఢిల్లీ లో కెసిఆర్ బిజీ;రాజనాథ్,సిజేఐ ఠాకూర్ తో బేటీ
ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో రెండోరోజు బిజీగా గడుపుతున్నారు. ఈరోజు హోం మంత్రి రాజనాథ్ సింగ్ తో బేటీ అయిన కెసిఆర్ విబజన సమస్యలపై చర్చించారు. హై కోర్టు విబజన పై చర్చించిన కెసిఆర్ హైదరాబాద్ లో శాంతిబద్రతల సంరక్షణకు అదనపు బలగాలు కేటాయించాలని కోరారు.అలాగే విబజన చట్టంలోని నియోజక వర్గాల పునర్విబజన పై చర్చించిన కెసిఆర్ హోం మంత్రి తో బేటీ అనంతరం సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తి తో బేటీ అయి హై కోర్టు విబజన త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.