కుర్రాళ్లు కొట్టారు .... పెద్దోళ్లు పడ్డారు....
అండర్ -19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ళు లంకను దాటి ఫైనల్లో అడుగుపెడితే పూణే ఫ్లడ్ లైట్ల వెలుగులో జరిగిన టి-20 మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ రజిత 3/29 సూపర్ బౌలింగ్ తో రోహిత్ 0 పరుగులకే వెనుదిరగగా రహనే 4 పరుగులు చేసి ఔట్ అవడంతో బారత పతనాన్ని ప్రారంబించగా సనక 3/16 విజ్రుమ్బించడం తో బారత్ 18.5 ఓవర్లలో 101 పరుగులకే ఆల్ ఔట్ అయింది.ఓ దశలో వంద పరుగులలోపే అల్ ఔట్ అయ్యేలా కనిపించిన భారత్ అశ్విన్ 31 పరుగులతో ఆదుకున్నాడు.
102 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన లంక ను తొలుత నెహ్రా ,బుమ్రా కట్టడి చేసినా చందిమల్ 57 బంతుల్లో 35,కపుగెదెర 25 పరుగుల సమయోచిత బ్యాటింగ్ తో శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి విజయం సాదించింది . బారత బౌలర్లలో నెహ్రా 2,అశ్విన్ 2,రైనా 1వికెట్ తీసారు. 3/29 తో అదరగొట్టిన రజత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎన్నికయ్యాడు .
No comments:
Post a Comment