సైనిక వీరుడు హనుమంతప్ప క్షేమం కోసం దేశవ్యాప్త పూజలు
ఆరురోజులపాటు సియాచిన్లో మంచు చరియలకింద కూరుకుపోయి కొన ప్రాణాలతో బయటపడి ఢిల్లీ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనిక వీరుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప క్షేమం కోసం దేశవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు . హనుమంతప్ప సంకల్పాన్ని కొనయాడిన సోనియాగాంధి,అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఎయిమ్స్ వైద్య బృందం హనుమంతప్ప ప్రాణాపాయం నుండి బయటపడటం కోసం అహర్నిశలు కృషి చేస్తుంది. హనుమంతప్ప పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని రెండు ఊపిరితిత్తుల్లో న్యుమోనియా ఉందని,48గంటలు పర్యవేక్షణలో ఉంటే గాని ఏమి చెప్పలేమని వైద్య బృందం తెలిపింది .
No comments:
Post a Comment