టిటిడిపి చీలిక వర్గం లో మరొకరికి మంత్రి గా చాన్స్ ???
టిటిడిపి నుండి టిఅర్ఎస్ లోకి వెళ్ళిన చీలిక వర్గంలో ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రిగా చోటు దక్కగా రాబోవు రోజుల్లో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో మరొకరికి అవకాశం ఇవనున్నట్లు టిఅర్ఎస్ వర్గాల సమాచారం. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుతం ఉన్న మంత్రులలో ముగ్గురు లేదా నలుగురికి ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం ఇవనున్నట్లు తెలుస్తుంది ఇందులో ఒక బెర్తు చీలిక వర్గానికి,ఒక మహిళను ,మరో స్థానం కెసిఆర్ మాట కి కట్టుబడిన పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో ఖమ్మం ,వరంగల్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున ఈ ఎన్నికల అనంతరం మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment