ADD

Saturday, 13 February 2016

చైనాలో పీకే రికార్డును తిరగరాయనున్న బాహుబలి

 చైనాలో పీకే రికార్డును తిరగరాయనున్న బాహుబలి 


ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన బాహుబలి ఇప్పుడు చైనా లో పీకే రికార్డును తిరగరాయనుంది. ఇప్పటికే పలు దేశాలల్లో విడుదలైన బాహుబలి కి అంతర్జాతీయ వెర్షన్ తయారుచేస్తున్నారు దర్షకుడు రాజమౌలి,దీనికోసం హాలివుడ్ నిపుణుల సహాయం తీసుకుంటున్నాడు. త్వరలో లాటిన్ అమెరికా,జర్మనీ,జపాన్ లతో పాటు చైనాలో ఈ-స్టార్ డిస్ట్రి బ్యూటార్ సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మే నెలలో విడుదలకు సర్వం సిద్దం అయింది. ఇంతకుముందు చైనాలో 5000థియేటర్లలో విడుదలైన పీకే చిత్రం చైనాలో అత్యదిక థియేటర్లలో విడుదలైన విదేశీ చిత్రంగా రికార్డు సృష్టించగా ఇప్పుడు బాహుబలి 6000థియేటర్లలో విడుదలకు సిద్దమై పీకే రికార్డును తిరగరాయనుంది. విడుదలకుముందే సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి పై చైనాలోనూ ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని ఆసక్తి నెలకొంది. 

No comments:

Post a Comment