ADD

Friday, 12 February 2016

రివ్యూ:క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ;ఇది దీర ప్రేమ గాథ

రివ్యూ:క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ;ఇది దీర ప్రేమ గాథ 

సినిమా:క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ

నటీనటులు :నాని ,మెహ్రీన్ ,సంపత్ రాజ్ ,మురళి శర్మ 

దర్శకుడు :హను రాఘవపూడి 

సంగీతం :విశాల్ చంద్రశేకర్ 

నిర్మాత : రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర

కథ :చిన్నప్పట్నుంచే మహాలక్ష్మి (మెహ్రీన్)ని ప్రాణంగా భావించే కృష్ణ, ఆమెతో ప్రేమలో ఉన్నా కూడా వాళ్ళిద్దరికీ తప్ప ప్రపంచానికి ఆ ప్రేమ విషయాన్ని చెప్పలేని పరిస్థితుల్లో బతుకుతుంటాడు. ఇక ఇదిలా ఉంటే పగ, ప్రతీకారాలే తమ జీవిత ధ్యేయంగా బతికే అప్పిరెడ్డి, రాజన్నల మధ్య జరిగే ఫ్యాక్షన్ గొడవలు కృష్ణగాడి ప్రేమకథను తాకి అతడి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి.ఫ్యాక్షన్ గొడవలకు కృష్ణ ప్రేమకథకు సంబంధం ఏంటి? ఈ ఫ్యాక్షన్ గొడవలోకి మాఫియా డాన్ డేవిడ్ భాయ్ (మురళీ శర్మ) ఎందుకు వచ్చాడు? ఏసీపీ శ్రీకాంత్ (సంపత్ రాజ్) పిల్లల కిడ్నాప్ కథేంటి? ఆ పిల్లలను కాపాడేందుకు కృష్ణ ఏం చేశాడు? ఇన్ని అవాంతరాలను ఎదుర్కొని కృష్ణ తన ప్రేమను దక్కించుకోగలిగాడా? ఇన్ని వర్గాల మధ్యన జరిగే గొడవలో అతడి ప్రయాణం ఏయే మలుపులు తిరిగిందీ అన్నదే ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’

ప్లస్ పాయింట్స్ :కథ ,కథనం,ఒక లవ్‌స్టోరీని వీలైనంత కొత్తగా, కమర్షియల్ టచ్ ఇస్తూ చెప్పిన విధానం గురించి చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లో కృష్ణ, మహాలక్ష్మిల మధ్యన వచ్చే లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఉంది. ప్రేమకథలో ఇలాంటి ఒక కొత్త యాంగిల్‌ను పరిచయం చేయడంతో పాటు, అందులో ఉన్న ఫన్‌ను సరిగ్గా పండించారు. ఇక ఒక ఊర్లో రెండు కుటుంబాల మధ్యన జరిగే ఫ్యాక్షన్ గొడవలు, ఈ గొడవకు పిల్లల కిడ్నాప్, మాఫియా కనెక్షన్, దానిచుట్టూ తిరిగే ఓ ప్రేమకథ.. నాని నటన ,చిన్నపిల్లల నటన 


తీర్పు :ఇది అందరు చూడదగ్గ కృష్ణ గాడి వీర ధీర ప్రేమ గాథ 

రేటింగ్ :4/5


No comments:

Post a Comment