భాగ్యనగరి సిగలో మరో ఐటి దిగ్గజం :ఆపిల్ ఇన్ హైదరాబాద్
ప్రపంచ ప్రఖ్యాత ఐటి దిగ్గజం ఆపిల్ తన ఇన్నోవేషన్ సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. యూరప్ సహా ఇతర దేశాలతో పాటు ఇండియా లోని అనేక నగరాల్లో పరిశీలన అనంతరం ఆపిల్ సంస్థ హైదరాబాద్ వైపు మొగ్గుచూపింది. గత కొన్ని రోజులుగా సంస్థ ఉన్నతస్థాయి వర్గాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ఈ సంస్థ జూన్ నుంచి తొలుత తమ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంవత్సర చివరినాటికి మ్యాప్స్ విబాగాన్ని పూర్తి స్థాయిలో ప్రారంబించనుందని తెలంగాణా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు గచ్చి బౌలీ లోని తియన్మన్ స్పేయర్ ఐటి సెజ్ లో 2.5లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. ఈ సంస్థ గూగుల్ మ్యాప్స్ తరహాలో తమ ఫోన్లు ,మ్యకుల్లోను మ్యాప్స్ ఉండేలా మ్యాప్స్ సిద్దం చేయనుంది ఇందుకోసం తొలిసారి అమెరికా బయట తమ సాంకేతిక కేంద్రాన్ని ప్రారంబిస్తున్నారు. దీని కార్యకలాపాలు ప్రారంబం అయితే 4500 మందికి ఉద్యోగాలు లబించనున్నాయి.
No comments:
Post a Comment