ADD

Saturday, 27 February 2016

గ్రేటర్ ప్రజలకు కెసిఆర్ లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల వరం

గ్రేటర్ ప్రజలకు కెసిఆర్ లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల వరం 

గ్రేటర్ ప్రజలకు కెసిఆర్ లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల వరం ఇయ్యనున్నాడు. ఈరోజు గ్రేటర్ పరిదిలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పై సమీక్ష నిర్వహించిన కెసిఆర్ లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి టవర్లను నిర్మించాలని,అర్హులైన లబ్దిదారుల ఎంపిక రెవెన్యూ అధికారులదే అని,గ్రేటర్ పరిదిలో ఒక్కో నియోజకవర్గంలో 4,740ఇళ్లను నిర్మించాలని కెసిఆర్ యోచిస్తున్నారు.ఇందుకు సంబంధించి ప్రణాళికలను సిద్దం చేయాలని కెసిఆర్ అధికారులకు సూచించారు. 

చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్ ఇయ్యనున్న కెసిఆర్???

చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్ ఇయ్యనున్న కెసిఆర్???

                            పార్టీ వీడే యోచనలో టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ???

తెలంగాణాలో ఇప్పటికే భూస్థాపితం అయిన టిడిపి ని ఇంకా అందపాతాలంలోకి వెళ్లనుంది. ఇప్పటికే 15మంది ఎమ్మెల్యే లలో 10మంది టిఅరేస్ లోకి చేరగా,మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిఅరేస్ లోకి చేరేందుకు సిద్దమైతున్నట్లు తెలుస్తుండగ,చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్ తగలనుందని టిఅరేస్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణా టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ కూడా పార్టీ వీడటానికి సిద్దపడుతున్నట్లు తెలుస్తుంది.ఇన్నిరోజులు అధికార పార్టీ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడానికి ఆపరేషన్ ఆకర్శ్ విషయం ఉండేది కానీ ఆంధ్రలో టిడిపి ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేయడంతో ఉన్న అవకాశం చేజారడంతో ఇక చేసేదేమీలేక పార్టీ వీడటమే మేలని మిగిలిన టిటిడిపి నేతలు భావిస్తున్నారు. వచ్చే బుదవారం ఎల్. రమణ టిఅరేస్ లో చేరనున్నారని టిఅరేస్ వర్గాలు పేర్కొంటున్నాయి. 


తెలంగాణా టెట్ షెడ్యూల్డ్ విడుదల

తెలంగాణా టెట్ షెడ్యూల్డ్ విడుదల 

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణా టెట్ షెడ్యుల్డ్ విడుదల చేసారు.29న  అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చ్ 1-15వరకు టెట్ కి ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు.ఏప్రిల్ 9న 9.30-12వరకు పేపర్-1,మధ్యాహ్నం 2.30-5వరకు పేపర్-2పరీక్ష జరపనున్నారు. ఏప్రిల్ 23న టెట్ రిజల్ట్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఇంకో 15రోజుల్లో డీఎస్సీ పై కూడా ఓ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. 

వీరి వీరీ గుమ్మడిపండు వీరి అయిదుగురిలో పార్టీ వీడేవారెవరు ???

వీరి వీరీ గుమ్మడిపండు వీరి అయిదుగురిలో పార్టీ వీడేవారెవరు ???

తెలంగాణాలో టిడిపి లో మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేలలో కూడా కొందరు పార్టీ వీడనున్నట్లు తెలుస్తుంది. పార్టీ ఫ్లోర్ లీడర్ గా నియమితులైన రేవంత్ రెడ్డి,ఆర్ కృష్ణయ్య,అరికపూడి గాంధీ,సంద్ర వేంకట వీరయ్య,గోపీనాథ్ లలో ఒకరు పార్టీ వీడనున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరు ఎలాగు టిఅరేస్ కి అక్కర్లేకపోగా మిగితా ముగ్గురిలో ఒకరు ఇప్పటికే టిఅరేస్ మంత్రులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ అయిదుగురిలో పార్టీ వీడేవారు ఎవరనేది రెండు,మూడు రోజుల్లో స్పష్టత రానున్నట్లు తెలుస్తుంది. 

excellent dubs mash

Friday, 26 February 2016

వివాదాస్పద వర్మ విజయవాడ టూర్

వివాదాస్పద వర్మ విజయవాడ టూర్ 

వివాదాలతో సహవాసం చేసే వర్మ విజయవాడ టూర్ ని విజయవంతం చేశాడు. గత వారం వంగవీటి రంగా సినిమా కారణంగా కొందరినుండి వర్మాకి బెదిరింపు కాల్స్ రాగ ట్విట్టర్ లో 'నేను విజయవాడ వస్తున్న అక్కడే ఉంటా దమ్ముంటే రండి 'అంటూ సవాల్ విసిరిన వర్మ ఈరోజు వంగవీటి సినిమా నిర్మాత దాసరి కిరణ్ తో కలసి విజయవాడ చేరుకున్నారు. విమానం ద్వారా విజయవాడ చేరుకున్న వర్మకి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి ఘన స్వాగతం పలుకగా,రాధ ,దేవినేని నెహ్రు వర్గాలు పోటాపోటీగా ర్యాలీ కోసం గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోవడంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. వివాదాలతో పబ్లిసిటీ సంపాదించే వర్మ ఈరోజు విజయవాడ లో తనకు కావలసినంత పబ్లిసిటీ దక్కించుకున్నారు. మరో రెండు రోజులపాటు విజయవాడ లో వంగవీటి అనుచరులతో చర్చలు జరిపి స్క్రీన్ ప్లే సిద్దం చేయనున్న వర్మ ఇంకా ఏం పబ్లిసిటీ స్టంట్స్ చేయనున్నాడో ??

High voltage INDIA-PAKISTAN T20 WAR

High voltage INDIA-PAKISTAN T20 WAR

It's time for high voltage t20 fest for all over world wide cricket fans.Now all eyes of cricket fans of world on tomorrow INDIA-PAK ASIACUP T20 Match in Dhakha.India and Pakistan will face each other at least twice in a T20I between February and April. They take on each other in the first stage of the Asia Cup and will also clash in the group stage in the World T20 2016 on March 19. There may also be additional India-Pakistan clashes in the upcoming months in case these two sides qualify for the final of Asia Cup, while there is also the possibility of India and Pakistan facing in the knock-out stage of World T20.


బాబును మించిన బాలయ్య;లేపాక్షి ఉత్సవాల ఆహ్వానంలో అత్యుత్సాహం

బాబును మించిన బాలయ్య;లేపాక్షి ఉత్సవాల ఆహ్వానంలో అత్యుత్సాహం

ఈ నెల 27,28తేదీల్లో జరగనున్న లేపాక్షి ఉత్సవాలకు కేంద్ర మంత్రుల నుండి ఎందరో ఎమ్మెల్యేల తోపాటు తెలంగాణా మంత్రులను పిలిచిన బాలయ్య,తన సహచరుడు,రాజ్యసభ ఎంపి చిరంజీవి విషయంలో అత్యుత్సాహం చూపించిన బాలయ్య తీరుపై అందరు విస్మయం చెందటమే కాక విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మొన్న విలేకరుల సమావేశంలో విలేకరి చిరంజీవిని ఆహ్వానించారా ?అని అడిగిన ప్రశ్నకు 'నేనెవరిని నెత్తిన పెట్టుకోను,పిలిస్తే పలురకాల మనుషులు వస్తారు,నేను నా పద్దతిలో డిక్టేటర్ లా వెళ్తాను.వెదిక మీద నా పక్కన నిలపడితే చాల మందికి గ్లామర్ వస్తుంది'అంటూ చేసిన వాఖ్యలపైన విమర్శలు వస్తున్నాయి. తన సొంత డబ్బా కొట్టుకునే విషయంలో అత్యుత్సాహం చూపించే బావ బాబు ని తన గొప్పలు చెప్పుకోవడంలో అత్యుత్సాహంలో బాలయ్య మించిపోయాడని చెప్పుకుంటున్నారు. 

మహిళలకు ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా అవార్డులు

మహిళలకు ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళా అవార్డులు 

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణా ప్రభుత్వం తరుపున మహిళలకు ప్రత్యేక పురస్కారాలు ఇవ్వాలని కెసిఆర్ నిర్ణయించారు. క్రీడలు,వ్రుత్తి పరమైన సేవలు,కళలు,సంస్కృతి,సాహిత్యం,జర్నలిజం,,సామాజిక సేవ వంటి తొమ్మిది విబాగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు పురస్కారాలు అందించుటకు మంత్రి తుమ్మల అధ్యక్షతన,పొత్తూరి వెంక టేశ్వర్ రావు ఉపాధ్యక్షుడిగా 8మంది సభ్యులతో ఎంపిక కమిటీని నియమించిన కెసిఆర్ మార్చ్ 8న లలిత కళాతోరణం లో జరిగే కార్యక్రమంలో లక్ష రూపాయల నగదుతో పాటు,జ్ఞాపికలను బహుకరించానున్నారు. 

Thursday, 25 February 2016

బంగారు బాతుకు రైల్వే బడ్జెట్ లో బిక్షమేశారు.....!

బంగారు బాతుకు రైల్వే బడ్జెట్ లో బిక్షమేశారు.....!

భారత రైల్వే వ్యవస్థకి బంగారు బాతు దక్షిణ మధ్య రైల్వే,సికింద్రాబాద్ కేంద్రంగా ప్రతి రోజు లక్షల మందిని గమ్యస్థానానికి చేర్చుతూ,ఎన్నో టన్నుల సరుకులను రవాణా చేస్తూ లాభాలు ఆర్జించి పెడుతూ ఇండియన్ రైల్వే కి బంగారు బాతు గుడ్డు లా వెలుగొందుతున్న దక్షిణ మధ్య రైల్వే నుండి బంగారు బాతు గుడ్లను తీసుకుని రైల్వే బడ్జెట్ లో ఎప్పటిలాగే కేటాయింపుల బిక్షమేశారు. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిజాం కాలంనాటి మన రైల్వే లైన్లకు మోక్షం మిగల్చకుండా చేసారు. వేల,వందల కోట్లు అవసరమయ్యే లైన్లకు పదులకోట్ల కేటాయింపులతో తెలంగాణా రైల్వేస్ కి అన్యాయం చేసారు. 

రైల్వే బడ్జెట్ లో తెలంగాణా కి కేటాయింపులు 

-నిజాం కలల ప్రాజెక్ట్ అయిన పెద్దపెల్లి -నిజామాబాద్ లైన్ కి 70కోట్లు 
-కాజిపేట్ -విజయవాడ మూడో లైన్ విద్యుతీకరణకు 164కోట్లు 
-జగ్గయ్యపేట -మేళ్ళ చెరువు లైన్ కి 110కోట్లు 
-కాజిపేట్-బల్లార్ష 3rd లైన్ కి 30కోట్లు 
-మునీరాబాద్-మహబూబ్ నగర్ లైన్ కి 180కోట్లు 
-సికింద్రాబాద్-జహీరాబాద్ లైన్ కి 80కోట్లు 
-అక్కన్నపేట్ -మెదక్ లైన్ కి 5కోట్లు 
-ముద్కేడ్ -ఆదిలాబాద్ మూడో లైన్ 87కోట్లు 
-గద్వాల్ -రాయచూర్ లైన్ కి 5కోట్లు 
-మనోహరాబాద్-కొత్తపల్లి లైన్ కి 30కోట్లు
-పెద్దపెల్లి-జగిత్యాల సబ్ వే కి 5కోట్లు 
-మాచర్ల -నల్గొండ లైన్ 20లక్షలు 
-రాఘవాపూర్ -మందమర్రి లైన్ కి 15కోట్లు 
-మంచిర్యాల్ -పెద్దంపేట్ లైన్ కి 30కోట్లు 
-బద్రాచలం -కొవ్వూరు లైన్ కి 5కోట్లు 

Wednesday, 24 February 2016

వైసిపీ కి మరో షాక్;టిడిపిలో చేరిన బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు

వైసిపీ కి మరో షాక్;టిడిపిలో చేరిన బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు 

ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ కి మరో షాక్,కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు పార్టీ వీడి టిడిపిలో చేరారు. ఇప్పటకే కడప జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టిడిపిలో చేరారు. ఈరోజు లోకేష్ కడప పర్యటన నేపద్యంలో జయరాములు టిడిపిలో చేరడంతో వైసిపీ నుండి మరిన్ని చేరికలు ఉంటాయని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన జయరాములు నియోజకవర్గ అభివ్రుద్ది కోసమే పార్టీ వీడినట్లు మీడియా తో పేర్కొన్నారు. 

Donald Trump third consecutive win in Presidential Primary Triumph

Donald Trump third consecutive win in Presidential Primary Triumph 

         Donald Trump third consecutive win in presidential primary triumph.Trump chalked up big victory on the nevada with 42%votes leg of the republican presidential race last night in spite of a caucus process that at times proved chaotic and contentious.Neither Marco Rubio nor Ted Cruz came close to preventing the belligreat billionaire claiming a hatric presidential primary triumph in a row following his double digit wins in newhamshire and south carolina.
         The result comes a week before 1st march known as super tuesday.When Mr.Trump is expected to secure several more states.Now all over world waiting for super tuesday.

చంద్రబాబు లోగిలిలో చంద్రశేఖర చక్రవ్యూహం......!

చంద్రబాబు లోగిలిలో చంద్రశేఖర చక్రవ్యూహం......!


దెబ్బతింటే కాని దెబ్బ తీయడం ఎలాగో తెలియదంటారు పెద్దలు,ఈ పెద్దల మాట చంద్రబాబు విషయంలో అక్షర సత్యంలా మారింది. గత కొన్ని నెలలుగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు వ్యూహాలు,ఎత్తులు పారక తన ప్రభ తగ్గుతుందేమో అనుకుంటున్న సమయంలో తెలంగాణాలో ముఖ్యమంత్రి కెసిఆర్ చక్రవ్యూహంలో గిలగిల లాడిన చంద్రబాబు ఆ దెబ్బతో తన వ్యూహాలకు పదునుపెట్టాడు. కెసిఆర్ దెబ్బకు తన 15మంది ఎమ్మెల్యేలను కోల్పోయి తెలంగాణాలో ఉనికినే ప్రశ్నార్ధకం చేసుకుని డీలాపడిన చంద్రబాబు ఇప్పుడు ఇదే వ్యూహాన్ని ఆంద్ర అమరావతి లోగిలిలో తన ప్రత్యర్థి జగన్ పై ప్రయోగిస్తున్నాడు.గత వారం ఎదురుదాడితో జగన్ చంద్రబాబు వ్యూహాన్ని ప్రతిఘటించాలని ప్రయత్నించినా ఇది వరకు తెలంగాణా లో అనుభవంతో అడునుచూచి జగన్ ని చక్రవ్యూహంలో ఇరికించాడు. బాబు దెబ్బతో ఇప్పటికే వైసిపీ ఎమ్మెల్యేలు నలుగురు,ఓ ఎమ్మెల్సీ టిడిపిలో చేరగా ,మరో డజనుమంది ఎమ్మెల్యేలను టిడిపిలోకి లాగుటకు రంగం సిద్దం చేస్తున్నట్లు చేస్తుంది.ఎట్టకేలకు చంద్రబాబు లోగిలిలో చంద్రశేఖర చక్రవ్యూహం పారుతుంది. చాల రోజులు తర్వాత చంద్రబాబు మోములో చంద్రహాసం వెల్లివిరుస్తుంది. 

బతుకు బహు భాగ్య'నగరం'

బతుకు బహు భాగ్య'నగరం'

ప్రపంచవ్యాప్తంగా మెర్సర్స్ 'క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్-2016' సర్వే లో భారత్ లో మెరుగైన జీవన ప్రమాణాలున్న నగరంగా హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో పూణే,ముంబై,ఢిల్లీ నిలిచాయి. మెర్నర్స్ సర్వే లో వరుసగా రెండో సారి దేశంలో మొదటి స్థానంలో నిలవడం విశేషం. దేశంలో భద్రత అంశంలో చెన్నై తర్వాత హైదరాబాద్ రెండో స్థానం లో నిలిచింది. 

ప్రపంచంలో మెరుగైన జీవన ప్రమాణాల నగరం వియన్నా 

మెర్సర్స్ సర్వే లో ప్రపంచంలో అత్యంత మెరుగైన జీవన ప్రమాణాలున్న నగరంగా తొలిస్థానంలో వియన్నా ,తర్వాతి స్థానాల్లో జ్యూరిచ్,ఆక్లాండ్,మ్యూనిచ్ నిలిచాయి. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ 139వ స్థానంలో నిలవగా,పూణే 144వ స్థానంలో నిలిచాయి 

Tuesday, 23 February 2016

ఎల్ఈడి వెలుగుల్లో తెలంగాణా లోగిళ్లు;ఇంటికి రెండు ఎల్ఈడి బల్బులు

ఎల్ఈడి వెలుగుల్లో తెలంగాణా లోగిళ్లు;ఇంటికి రెండు ఎల్ఈడి బల్బులు

తెలంగాణా లోగిళ్లలో ఎల్ఈడి వెలుగులు విరజిమ్మేలా,విద్యుత్ ఆదాకు  తెలంగాణా ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తుంది. తెలంగాణా వ్యాప్తంగా ప్రతి ఇంటికి రెండు ఎల్ఈడి బల్బులను అందించాలని ప్రభుత్వం భావిస్తుంది,ఇందులో బాగంగా మెదక్,నిజామాబాద్ జిల్లాలలో మొదటగా ఎల్ఈడి బల్బులను పంపిణి చేయాలని చూస్తుంది. ఎల్ఈడి బల్బుల వాడకం ద్వారా 90%విద్యుత్ ఆదా చేయనున్నారు. ఈ రెండు జిల్లాల అనంతరం తెలంగాణా వ్యాప్తంగా ఎల్ఈడి లు అందించనున్నారు. 

గబ్బర్ సింగ్ ని మించనున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సంచలనాలు

  గబ్బర్ సింగ్ ని మించనున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సంచలనాలు 

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సీక్వెల్ అనగానే అంచనాలు అంబరాన్ని తాకాయి అయితే డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న పవన్ 'సర్దార్ గబ్బర్ సింగ్ 'అంచనాలను మించి సంచలనాలు సృష్టిస్తుందని సినీ వర్గాలు పేర్కొంటున్నారు. పవన్ కి జోడిగా కాజల్ తొలిసారి నటిస్తుండగా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ కానుందట,అలాగే సినిమాలో పవన్ పంచులు,డైలాగ్స్ అధిరిపొనున్నాయని సమాచారం. ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ టాలీవుడ్ సినిమాల్లోనే హైలైట్ గా నిలవనుందని సర్దార్ సినీవర్గాలు పేర్కొంటున్నారు. దేవిశ్రీ సంగీతం లో 2సాంగ్స్ సూపర్ డూపర్ గా నిలవనున్నాయని సమాచారం. అంచనాలు పెరిగిపోతున్న సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు ముందే 100కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్స్ చేసినట్లు తెలుస్తుంది. సర్దార్ గబ్బర్ సింగ్ శాటిలైట్ రైట్స్ ని 13కోట్లకు కొనడానికి జెమినీ టీవి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. 

టిఆర్ఎస్ లోకి నర్సంపేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ???

టిఆర్ఎస్ లోకి నర్సంపేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ???

కాంగ్రెస్ మాజీ మంత్రి సారయ్య టిఅరేస్ లో చేరటానికి సిద్దమై వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల సమయాన ఇచ్చిన షాక్ నుండి తేరుకోకముందే మరో షాక్ తగలనుంది. 2014ఎన్నికల్లో నర్సంపేట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన దొంతి మాదవరెడ్డి టిఅరేస్ లో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. ఒకటి రెండు రోజుల్లో కెసిఆర్ సమక్షంలో టిఅరేస్ కండువా కప్పుకోనున్నట్లు మాదవరెడ్డి అనుచరుల ద్వారా తెలుస్తుంది. మాధవరెడ్డి తో పాటు పెద్ద ఎత్తున అనుచరులు,కార్యకర్తలు పార్టీ మారనున్నట్లు తెలుస్తుంది 

మంత్రి వర్గంలోకి అఖిలప్రియ???;యువ మహిళా మంత్రిగా అఖిల ప్రియ...!

మంత్రి వర్గంలోకి అఖిలప్రియ???;యువ మహిళా మంత్రిగా అఖిల ప్రియ...!

కర్నూల్ రాజకీయాల్లో,వైసిపి లో కీలకమైన భూమ నాగిరెడ్డి,ఆయన కూతురు అఖిలప్రియ లు టిడిపిలో చేరడంతో వైసిపి ని దెబ్బతీయడంతో పాటు కర్నూల్ లో టిడిపి కి కొండంత బలం పెంచిన భూమ నాగిరెడ్డి కూతురు అఖిల ప్రియకు రాబోయే మంత్రివర్గ విస్తరణలో చోటు ఖాయంగా కనిపిస్తుంది. తొలుత అఖిల ప్రియకు మంత్రి పదవి పై చంద్రబాబు కొంత వెనకడుగు వేసినా నాగిరెడ్డి తో బేటీ అనంతరం యువ మహిళా ఎమ్మెల్యే కావడంతో చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.26ఏళ్ల అఖిల ప్రియ కు చోటివ్వడంతో ఒక యువ మహిళకు మంత్రివర్గం లో చోటిచ్చి వారిపై వచ్చే విమర్శలను బలంగా తిప్పికోట్టవచ్చని నాగిరెడ్డి నచ్చచెప్పినట్లు తెలుస్తుంది. 

Monday, 22 February 2016

చంద్రబాబు చార్ మారా;టిడిపిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు

చంద్రబాబు చార్ మారా;టిడిపిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు 


ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది,రాజకీయ దురందరుడు చంద్రబాబు మోములో చంద్రహాసం . ఎట్టకేలకు సస్పెన్స్ కి తెరదించుతూ వైసిపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు భూమ నాగిరెడ్డి,అఖిల ప్రియ ,జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి,విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్,ఎమ్మెల్సీ నారాయణరెడ్డి లను టిడిపి లోకి చేరారు. టిడిపి నేతలు,వైసిపి ఎమ్మెల్యేలతో చంద్రబాబు సుదీర్ఘ బేటీ అనంతరం వీరి చేరికను అధికారికంగా దృవీకరించారు. కలెక్టర్లతో మీటింగ్ అనంతరం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకొని వైసిపి ఎమ్మెల్యే లతో బేటీ అయ్యారు. టిడిపిలోకి చేరిన నలుగురు ఎమ్మెల్యేలతో టిడిపి బలం 106కి చేరుకుంది. 

టికాంగ్రెస్ కి షాక్;రేపు టిఆర్ఎస్ లోకి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య???

టికాంగ్రెస్ కి షాక్;రేపు టిఆర్ఎస్ లోకి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య???

ఇన్నిరోజులు టిడిపికి చుక్కలు చూపించిన కెసిఆర్ ఇప్పుడు టికాంగ్రెస్ కి చుక్కలు చూపించనున్నారు అని అంటున్నాయి టిఅరేస్ వర్గాలు. వరంగల్ కార్పోరేషన్ కి ఎన్నికల నగారా మోగడంతో టికాంగ్రెస్ కి మొదటి షాక్ ఇవ్వడానికి సిద్దమైంది. వరంగల్ జిల్లా మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టిఅరేస్ లోకి చేరడానికి సిద్దమయ్యారు.రేపు సారయ్య కాంగ్రెస్ వీడి టిఅరేస్ లోకి చేరనున్నట్లు తెలుస్తుంది. వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్ కి వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపధ్యంలో సారయ్య పార్టీ వీడటం కాంగ్రెస్ కి కోలుకోలేని షాక్. 

ఎట్టకేలకు చంద్రహాసం;మొదటగా టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి

ఎట్టకేలకు చంద్రహాసం;మొదటగా టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి 

తెలంగాణాలో ఇన్నిరోజులు గడ్డు పరిస్థితులతో సతమతమైన చంద్రబాబు ఎట్టకేలకు ఆంధ్రలో వైసిపి ఎమ్మెల్యేల చేరికతో కుదుతపడనున్నారు. మొదటగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈరోజు సాయంత్రం టిడిపి కార్యకర్తలతో కలసి వచ్చి టిడిపి లోకి చేరనున్నారు.గత రెండు మూడు రోజులుగా మంతనాలతో ఉన్న భూమ నాగిరెడ్డి,అఖిల ప్రియ సైతం ఈరోజు సాయంత్రం చంద్ర బాబు తో బేటీ అయి టిడిపిలోకి చేరనున్నారు,వీరితో పాటు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. 

కొందరికి రిజర్వేషన్లు కావాలి...కొందరికి స్వాతంత్ర్యం కావాలి... నాకు మాత్రం నా దుప్పటి చాలు...!అమర జవాన్ కెప్టెన్ పవన్ కుమార్ చివరి వాఖ్యలు

కొందరికి రిజర్వేషన్లు కావాలి...కొందరికి స్వాతంత్ర్యం కావాలి... నాకు మాత్రం నా దుప్పటి చాలు...!అమర జవాన్ కెప్టెన్ పవన్ కుమార్ చివరి వాఖ్యలు

గత కొన్నిరోజులుగా హెచ్.సి.యు లో రోహిత్ ఆత్మహత్యపై దేశ వ్యాప్త ఆందోళనలు,జెఎన్యూ లో దేశానికి వ్యతిరేక వాఖ్యలు,గుజరాత్ లో పటేల్స్ రిజర్వేషన్ల రగడ,ఆంధ్రలో కాపు రిజర్వేషన్ల రగడ,ప్రస్తుతం హర్యానా జాట్ రిజర్వేషన్ల రగడ ఇలా ప్రతి సంఘటనలో యువకులు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు,కాని గత వారం సించియాన్ లో దేశ భద్రతకై తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు,నిన్న పాంపార్ హౌస్ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు ఇవేమీ మనకు పట్టవు,విద్యాలయాల్లో ఎన్నో నిరసనలు చేపట్టే యువకులు దేశం కోసం వీర మరణం పొందిన సైనికుల ఆత్మ శాంతికి దేశం మొత్తం ఏ ఒక్క విశ్వ విద్యాలయం లో శాంతి ర్యాలి చేసిన దాకలాలు లేవు,సిగ్గుతో తల దించుకోండి . రిజర్వేషన్లు,హక్కులు అంటూ గొంతెత్తే యువకుల్లారా.... 
'కొందరికి రిజర్వేషన్లు కావాలి...కొందరికి స్వాతంత్ర్యం కావాలి... నాకు మాత్రం నా దుప్పటి చాలు...!'అమర జవాన్ కెప్టెన్ పవన్ కుమార్ చివరి వాఖ్యలు. ఈ వాక్యాలతో అయిన మేలుకోండి. 

 

నడిపించే నవయువనాయకులు రాజకీయ వారసులేనా???

నడిపించే నవయువనాయకులు రాజకీయ వారసులేనా???

నరేంద్రుడు నడయాడిన ఈ దేశంలో నాయకత్వానికి కోదువేలేదు. అర్జునుడు,అభిమన్యుడు నడచిన ఈ వేద భూమిలో సారదులు,రథసారదులకు లెక్కేలేదు కాని ప్రస్తుత పరిస్థితుల్లో నవయువ నాయకత్వం సామాన్యులకు పద్మవ్యూహంలా మారి రాజకీయ నాయకుల వారసులే నవయువ నాయకులేమో అన్నవిధంగా మారింది. ప్రస్తుతం దేశంలో యువనాయకులు అనగానే గుర్తొచ్చేది రాహుల్ గాంధి,అఖిలేష్ యాధవ్,తేజస్వి యాదవ్,తేజ్ ప్రతాప్ యాదవ్,సుప్రియా సులే,అఘాత సంగ్మా,కేటిఅర్ ,కవిత ,జగన్ ,లోకేష్,జ్యోతిరాదిత్య సింధియా,సచిన్ పైలెట్,మిలింద్ దేవరా. ఇలా ప్రదాన పార్టీల అధినేతల వారసులే యువనాయకులుగా కొనసాగుతున్నారు. ఈ పార్టీల జెండాలు మోసిన కార్యకర్తలు కింది స్థాయిలోనే ఉండిపోతున్నారు. పదవతరగతి కూడా పాసవని తేజస్వి యాదవ్ ని మించిన యువ నాయకులు పార్టీల్లో లేరా??పీహెచ్డి పట్టాలు పొందిన పార్టీ జెండాలు మోసిన పేదింటి యువకులకు సిహాసనం సింహ స్వప్నమేనా??సామాన్యులకు నాయకత్వం అందని ద్రాక్షేనా??రాజకీయ నాయకత్వ పద్మవ్యూహాన్ని చేదించడానికి సామాన్యులు ముందుకు రారా ??

పద్మవ్యూహం చేదించేవారెవరు ???

పద్మవ్యూహం చేదించేవారెవరు ???

ఈ అఖండ భారతంలో అభిమన్యులు,అర్జునులేందరో...!భీష్ముని మించిన వ్యూహకర్తలేందరో...!భారతంలో సమస్యల వ్యూహాలెన్నో...!వ్యూహాల గురించి చర్చించేవారెందరో...!ఎన్నో వ్యూహాల్లో,వ్యూహాలను మించిన వ్యూహం పద్మవ్యూహం,ఈ పద్మవ్యూహం గురించి ఎన్నో చర్చలు,నాటి మహాభారతం నుండి నేటి అఖండ భారతం వరకు పద్మవ్యూహాన్ని చేదించేందుకు అర్జునులు,అభిమన్యులెందరో?అయినా ఓ వ్యూహం పద్మవ్యూహం చేదించేవారెవరో తెలీటంలేదు. అందరూ చర్చించేవారే,చేదనకి వ్యూహాలు రచించేవారే కాని పద్మవ్యూహంలోకి వెళ్లి వ్యూహాన్ని చేదించ డానికి బయమెందులకు ??ఈ అఖండ భారత రాజకీయ పద్మవ్యూహం చేదించే అభిమాన్యులెందరు??

నెవేడా ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గిన హిల్లరీ

నెవేడా ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గిన హిల్లరీ 

అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ తరుపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ గత వారం ప్రైమరీ ఎన్నికల్లో తన పార్టీ సహచరుడు బెర్నీ సాండర్స్ తో పోటీలో వెనుకపడ్డ,ఆదివారం నెవెడా ప్రైమరీ ఎన్నికల్లో సాండర్స్ ని స్వల్ప ఆధిక్యంతో ఓడించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న వివాదాస్పద వాఖ్యల ట్రంప్ దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో ఘన విజయం సాదించాడు.వరుస ఓటములతో రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీ పడాలనుకున్న బుష్ కుటుంబ వారసుడు ప్లోరిడా మాజీ గవర్నర్ జేబ్ బుష్ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 

రెండు దుబాయ్ కంపెనీలతో తెలంగాణా ప్రభుత్వం ఎంవోయు;యువతకు 750ఉద్యోగాలు

రెండు దుబాయ్ కంపెనీలతో తెలంగాణా ప్రభుత్వం ఎంవోయు;యువతకు 750ఉద్యోగాలు

ఏజంట్ల చేతిలో మోసపోతున్న తెలంగాణా యువకులను ఆదుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం తరుపున దుబాయ్ వెళ్ళిన హోం మంత్రి నాయిని నరసింహ రెడ్డి దుబాయ్ అల్ముల్లా గ్రూప్ ,అజీరా ఎమిరేట్స్ పవర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో తెలంగాణా ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ చైర్మెన్,అల్ముల్లా గ్రూప్ కి చెందిన మహమ్మద్ సర్వర్,జజీర ఎమిరేట్స్ కి చెందినా ఎన్టి రెడ్డి పాల్గొన్నారు. ఈ ఒప్పందంతో తెలంగాణా యువతకు ప్రభుత్వం తరుపున అల్ముల్లా గ్రూప్ 500మందికి,జజీర గ్రూప్ 200మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇంకా కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నామని,కెసిఆర్ సూచనల మేరకు తెలంగాణాలోని నైపుణ్యమున్న యువత ఏజెంట్ల చేతిలో మోసపోకుండా ప్రభుత్వమే విదేశాల్లో ఉద్యోగాలు కల్పించనున్నామని నాయిని నరసింహ రెడ్డి పేర్కొన్నారు. 

Sunday, 21 February 2016

ఆప్ మహిళా ఎమ్మెల్యే సోనీ సోరి పై ఆసిడ్ దాడి

ఆప్ మహిళా ఎమ్మెల్యే సోనీ సోరి పై ఆసిడ్ దాడి 


ఆప్ మహిళా ఎమ్మెల్యే సోని సోరి పై గుర్తుతెలియని దుండగులు ఆసిడ్ దాడి చేసారు. దంతేవాడలో బైక్ పై వచ్చిన దుండగులు కారు ఎదుట నిలిపారు. సొనిసోరి కారు దిగగానే ఆసిడ్ దాడి చేసారు. ఆసిడ్ దాడి అనంతరం ఎమ్మెల్యే ను ఆస్పత్రులో చేర్పించారు. 

గ్రేటర్ వరంగల్,ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్

గ్రేటర్ వరంగల్,ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ 

గ్రేటర్ వరంగల్,ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు,అచ్చంపేట మున్సిపాలిటీ కి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుండి వరంగల్ ,ఖమ్మం తో పాటు ,అచ్చంపేట మున్సిపాలిటీకి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 24వరకు నామినేషన్ల స్వీకరణ,25నామినేషన్ల పరిశీలన,26నామినేషన్ల ఉపసంహరణ గడువు కాగ మార్చ్ 6 వ తేదీన పోలింగ్ ,9న ఓట్ల  లెక్కింపు ఉంటుంది. రేపు ఉదయం తెలంగాణా ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసి రేపటినుంచే నామినేషన్లను స్వీకరించనుంది. 

కాంగ్రెస్ పెద్దమనిషి ప్రయాణం టిఆర్ఎస్ గూటికేనా??

కాంగ్రెస్ పెద్దమనిషి ప్రయాణం టిఆర్ఎస్ గూటికేనా??

తెలంగాణా శాసన సభలో కాంగ్రెస్ కి పెద్దమనిషిగా ఉన్న శాసన సభ పక్ష నేత జానారెడ్డి తెలంగాణా లో టిఆరేస్ ప్రభుత్వం ఏర్పడ్డపటినుంచి ప్రభుత్వాన్ని అడపాదడపా విమర్శించడమే తప్ప విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన దాకలాలు లేవు పైగా అప్పుడప్పుడు కెసిఆర్ పాలనాతీరును పొగుడుతూ ఉండటం,గ్రేటర్ ఎన్నికల ముందు జీహెచ్ ఎంసి ,టిఅరేస్ 5రూపాయల బోజన పథకానికి బెష్ అని మేచ్చుకోటం విశేషం,తెలంగాణా ఉద్యమ సమయంలో రాజకీయ జెఏసి ఏర్పాటు నుంచి జానారెడ్డి-కెసిఆర్ మధ్య సయోధ్య కుదిరినప్పటినుండి ఒకరంటే ఒకరికి సదాబిప్రాయం,ఒకరినొకరు బహిరంగంగానే ఎన్నో సార్లు పొగడ్తల లతో ముంచేత్తుకున్నారు.ఈ సదాభిప్రాయమే ఇప్పుడు జానారెడ్డి ప్రయాణం టిఆరేస్ గూటికి దారులు వేసేలా ఉంది ఇప్పటికిప్పుడు వెళితే టిఅరేస్ ప్రభుత్వంలో తన స్థాయికి తగ్గ పదవేమి లేదు ,ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రదాన ప్రతిపక్ష నేతగా హోదా ఉంది.ఇంకో రెండు సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉంది ఎన్నికల సమయంలో టిఅరేస్ లోకి వెలితే తదుపరి టిఅరేస్ ప్రభుత్వంలో తన స్థాయికి తగ్గ గుర్తింపు ఉంటదని జానారెడ్డి ముందుచూపు. 

కరీంనగర్ కారులో కదన కుటీరాలు

కరీంనగర్ కారులో  కదన కుటీరాలు 

తెలంగాణాలో టిఅరేస్ పార్టీలోకి వలసలు కొనసాగుతుంటే సిట్టింగులు,వలస నేతలతో పోటాపోటీగా ఉంటె టిఅరేస్ పార్టీ మొదలైనప్పటినుండి టిఅరేస్,కెసిఆర్ కి అండగా ఉన్న జిల్లా కరీంనగర్ లో మాత్రం కారు ప్రయాణం సాపీగా సాగుతుంది. గత ఎన్నికల్లో 2ఎంపి,12ఎమ్మెల్యేలు గెలుచుకున్న టిఅరేస్ పార్టీ లోకి ఇంకా కొందరు నేతలను చేర్చుకున్న ఎలాంటి అసంతృప్తులు లేకుండా రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కదులుతుంది. కరీంనగర్ నియోజకవర్గ పరిదిలో గంగుల సిట్టింగ్ కాగ నారదాసు టికిట్ ఆశించిన మరోమారు ఎమ్మెల్చీ మాటతో మాట నిలబెట్టుకున్నారు కెసిఆర్,మానకొండూర్,హుస్నాబాద్,హుజూరాబాద్ లలో రసమయి,సతీష్,ఈటెల కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు కదులుతున్నారు,ఇక రామగుండం,మంథని ఇలాకాలో పుట్టమదు,సత్యనారాయణ,ధర్మపురి కొప్పుల,చొప్పదండి శోబక్క దూసుకేల్తున్నారు. పెద్దపెల్లిలో త్రినీటి విద్యా సంస్థల అధినేత మనోహర్ రెడ్డి పై పోటీ చేసి ఓడిన బానుప్రసాద్ కి మరోసారి ఎమ్మెల్సి గా అవకాశం ఇచ్చారు ,ఇక కరీంనగర్ లో ఒకే ఒక్క స్థానం కాంగ్రెస్ దక్కించుకున్న జగిత్యాల నియోజకవర్గ పరిదిలో ఎన్నికలకు ముందు టిఅరేస్ లో చేరిన సంజయ్ కుమార్ చాల తక్కువ సమయంలో జీవన్ రెడ్డి కి పోటాపోటీగా నిలిచి గెలుపు కి అంచు దూరంలో నిలిచినా ,ఈసారి మాత్రం గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను నడిపిస్తున్నారు,ఇక కోరుట్లలో విద్యాసాగర్ రావు,వేములవాడలో రమేష్ ప్రయాణం సాపీగా సాగుతుంది,సిరిసిల్లాలో కెటిఆర్ తనదైన శైలిలో కంచుకోటగా మార్చుకుని అక్కడ తనపై పోటీ చేసి ఓడిన కోడూరిని కెడిసిసి,అపెక్స్ బ్యాంక్ పీఠంపై కూర్చోపెట్టి తనకు తిరుగులేకుండా చేసుకున్నారు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగపడ్డ వారిలో ముందున్న అతనికి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి ఇయ్యనున్నత్లు తెలుస్తుంది. ఇలా కరీంనగర్ లో టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి కుదుపు లేకుండా కదనాన దూసుకుపోవటం ఖాయం.