కొందరికి రిజర్వేషన్లు కావాలి...కొందరికి స్వాతంత్ర్యం కావాలి... నాకు మాత్రం నా దుప్పటి చాలు...!అమర జవాన్ కెప్టెన్ పవన్ కుమార్ చివరి వాఖ్యలు
గత కొన్నిరోజులుగా హెచ్.సి.యు లో రోహిత్ ఆత్మహత్యపై దేశ వ్యాప్త ఆందోళనలు,జెఎన్యూ లో దేశానికి వ్యతిరేక వాఖ్యలు,గుజరాత్ లో పటేల్స్ రిజర్వేషన్ల రగడ,ఆంధ్రలో కాపు రిజర్వేషన్ల రగడ,ప్రస్తుతం హర్యానా జాట్ రిజర్వేషన్ల రగడ ఇలా ప్రతి సంఘటనలో యువకులు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు,కాని గత వారం సించియాన్ లో దేశ భద్రతకై తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు,నిన్న పాంపార్ హౌస్ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు ఇవేమీ మనకు పట్టవు,విద్యాలయాల్లో ఎన్నో నిరసనలు చేపట్టే యువకులు దేశం కోసం వీర మరణం పొందిన సైనికుల ఆత్మ శాంతికి దేశం మొత్తం ఏ ఒక్క విశ్వ విద్యాలయం లో శాంతి ర్యాలి చేసిన దాకలాలు లేవు,సిగ్గుతో తల దించుకోండి . రిజర్వేషన్లు,హక్కులు అంటూ గొంతెత్తే యువకుల్లారా....
'కొందరికి రిజర్వేషన్లు కావాలి...కొందరికి స్వాతంత్ర్యం కావాలి... నాకు మాత్రం నా దుప్పటి చాలు...!'అమర జవాన్ కెప్టెన్ పవన్ కుమార్ చివరి వాఖ్యలు. ఈ వాక్యాలతో అయిన మేలుకోండి.
No comments:
Post a Comment