కరీంనగర్ కారులో కదన కుటీరాలు
తెలంగాణాలో టిఅరేస్ పార్టీలోకి వలసలు కొనసాగుతుంటే సిట్టింగులు,వలస నేతలతో పోటాపోటీగా ఉంటె టిఅరేస్ పార్టీ మొదలైనప్పటినుండి టిఅరేస్,కెసిఆర్ కి అండగా ఉన్న జిల్లా కరీంనగర్ లో మాత్రం కారు ప్రయాణం సాపీగా సాగుతుంది. గత ఎన్నికల్లో 2ఎంపి,12ఎమ్మెల్యేలు గెలుచుకున్న టిఅరేస్ పార్టీ లోకి ఇంకా కొందరు నేతలను చేర్చుకున్న ఎలాంటి అసంతృప్తులు లేకుండా రాబోయే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కదులుతుంది. కరీంనగర్ నియోజకవర్గ పరిదిలో గంగుల సిట్టింగ్ కాగ నారదాసు టికిట్ ఆశించిన మరోమారు ఎమ్మెల్చీ మాటతో మాట నిలబెట్టుకున్నారు కెసిఆర్,మానకొండూర్,హుస్నాబాద్,హుజూరాబాద్ లలో రసమయి,సతీష్,ఈటెల కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు కదులుతున్నారు,ఇక రామగుండం,మంథని ఇలాకాలో పుట్టమదు,సత్యనారాయణ,ధర్మపురి కొప్పుల,చొప్పదండి శోబక్క దూసుకేల్తున్నారు. పెద్దపెల్లిలో త్రినీటి విద్యా సంస్థల అధినేత మనోహర్ రెడ్డి పై పోటీ చేసి ఓడిన బానుప్రసాద్ కి మరోసారి ఎమ్మెల్సి గా అవకాశం ఇచ్చారు ,ఇక కరీంనగర్ లో ఒకే ఒక్క స్థానం కాంగ్రెస్ దక్కించుకున్న జగిత్యాల నియోజకవర్గ పరిదిలో ఎన్నికలకు ముందు టిఅరేస్ లో చేరిన సంజయ్ కుమార్ చాల తక్కువ సమయంలో జీవన్ రెడ్డి కి పోటాపోటీగా నిలిచి గెలుపు కి అంచు దూరంలో నిలిచినా ,ఈసారి మాత్రం గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను నడిపిస్తున్నారు,ఇక కోరుట్లలో విద్యాసాగర్ రావు,వేములవాడలో రమేష్ ప్రయాణం సాపీగా సాగుతుంది,సిరిసిల్లాలో కెటిఆర్ తనదైన శైలిలో కంచుకోటగా మార్చుకుని అక్కడ తనపై పోటీ చేసి ఓడిన కోడూరిని కెడిసిసి,అపెక్స్ బ్యాంక్ పీఠంపై కూర్చోపెట్టి తనకు తిరుగులేకుండా చేసుకున్నారు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగపడ్డ వారిలో ముందున్న అతనికి రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి ఇయ్యనున్నత్లు తెలుస్తుంది. ఇలా కరీంనగర్ లో టిఆర్ఎస్ పార్టీ ఎలాంటి కుదుపు లేకుండా కదనాన దూసుకుపోవటం ఖాయం.
No comments:
Post a Comment