చంద్రబాబు లోగిలిలో చంద్రశేఖర చక్రవ్యూహం......!
దెబ్బతింటే కాని దెబ్బ తీయడం ఎలాగో తెలియదంటారు పెద్దలు,ఈ పెద్దల మాట చంద్రబాబు విషయంలో అక్షర సత్యంలా మారింది. గత కొన్ని నెలలుగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు వ్యూహాలు,ఎత్తులు పారక తన ప్రభ తగ్గుతుందేమో అనుకుంటున్న సమయంలో తెలంగాణాలో ముఖ్యమంత్రి కెసిఆర్ చక్రవ్యూహంలో గిలగిల లాడిన చంద్రబాబు ఆ దెబ్బతో తన వ్యూహాలకు పదునుపెట్టాడు. కెసిఆర్ దెబ్బకు తన 15మంది ఎమ్మెల్యేలను కోల్పోయి తెలంగాణాలో ఉనికినే ప్రశ్నార్ధకం చేసుకుని డీలాపడిన చంద్రబాబు ఇప్పుడు ఇదే వ్యూహాన్ని ఆంద్ర అమరావతి లోగిలిలో తన ప్రత్యర్థి జగన్ పై ప్రయోగిస్తున్నాడు.గత వారం ఎదురుదాడితో జగన్ చంద్రబాబు వ్యూహాన్ని ప్రతిఘటించాలని ప్రయత్నించినా ఇది వరకు తెలంగాణా లో అనుభవంతో అడునుచూచి జగన్ ని చక్రవ్యూహంలో ఇరికించాడు. బాబు దెబ్బతో ఇప్పటికే వైసిపీ ఎమ్మెల్యేలు నలుగురు,ఓ ఎమ్మెల్సీ టిడిపిలో చేరగా ,మరో డజనుమంది ఎమ్మెల్యేలను టిడిపిలోకి లాగుటకు రంగం సిద్దం చేస్తున్నట్లు చేస్తుంది.ఎట్టకేలకు చంద్రబాబు లోగిలిలో చంద్రశేఖర చక్రవ్యూహం పారుతుంది. చాల రోజులు తర్వాత చంద్రబాబు మోములో చంద్రహాసం వెల్లివిరుస్తుంది.
No comments:
Post a Comment