ఎట్టకేలకు చంద్రహాసం;మొదటగా టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి
తెలంగాణాలో ఇన్నిరోజులు గడ్డు పరిస్థితులతో సతమతమైన చంద్రబాబు ఎట్టకేలకు ఆంధ్రలో వైసిపి ఎమ్మెల్యేల చేరికతో కుదుతపడనున్నారు. మొదటగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈరోజు సాయంత్రం టిడిపి కార్యకర్తలతో కలసి వచ్చి టిడిపి లోకి చేరనున్నారు.గత రెండు మూడు రోజులుగా మంతనాలతో ఉన్న భూమ నాగిరెడ్డి,అఖిల ప్రియ సైతం ఈరోజు సాయంత్రం చంద్ర బాబు తో బేటీ అయి టిడిపిలోకి చేరనున్నారు,వీరితో పాటు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.
No comments:
Post a Comment