ADD

Thursday, 25 February 2016

బంగారు బాతుకు రైల్వే బడ్జెట్ లో బిక్షమేశారు.....!

బంగారు బాతుకు రైల్వే బడ్జెట్ లో బిక్షమేశారు.....!

భారత రైల్వే వ్యవస్థకి బంగారు బాతు దక్షిణ మధ్య రైల్వే,సికింద్రాబాద్ కేంద్రంగా ప్రతి రోజు లక్షల మందిని గమ్యస్థానానికి చేర్చుతూ,ఎన్నో టన్నుల సరుకులను రవాణా చేస్తూ లాభాలు ఆర్జించి పెడుతూ ఇండియన్ రైల్వే కి బంగారు బాతు గుడ్డు లా వెలుగొందుతున్న దక్షిణ మధ్య రైల్వే నుండి బంగారు బాతు గుడ్లను తీసుకుని రైల్వే బడ్జెట్ లో ఎప్పటిలాగే కేటాయింపుల బిక్షమేశారు. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిజాం కాలంనాటి మన రైల్వే లైన్లకు మోక్షం మిగల్చకుండా చేసారు. వేల,వందల కోట్లు అవసరమయ్యే లైన్లకు పదులకోట్ల కేటాయింపులతో తెలంగాణా రైల్వేస్ కి అన్యాయం చేసారు. 

రైల్వే బడ్జెట్ లో తెలంగాణా కి కేటాయింపులు 

-నిజాం కలల ప్రాజెక్ట్ అయిన పెద్దపెల్లి -నిజామాబాద్ లైన్ కి 70కోట్లు 
-కాజిపేట్ -విజయవాడ మూడో లైన్ విద్యుతీకరణకు 164కోట్లు 
-జగ్గయ్యపేట -మేళ్ళ చెరువు లైన్ కి 110కోట్లు 
-కాజిపేట్-బల్లార్ష 3rd లైన్ కి 30కోట్లు 
-మునీరాబాద్-మహబూబ్ నగర్ లైన్ కి 180కోట్లు 
-సికింద్రాబాద్-జహీరాబాద్ లైన్ కి 80కోట్లు 
-అక్కన్నపేట్ -మెదక్ లైన్ కి 5కోట్లు 
-ముద్కేడ్ -ఆదిలాబాద్ మూడో లైన్ 87కోట్లు 
-గద్వాల్ -రాయచూర్ లైన్ కి 5కోట్లు 
-మనోహరాబాద్-కొత్తపల్లి లైన్ కి 30కోట్లు
-పెద్దపెల్లి-జగిత్యాల సబ్ వే కి 5కోట్లు 
-మాచర్ల -నల్గొండ లైన్ 20లక్షలు 
-రాఘవాపూర్ -మందమర్రి లైన్ కి 15కోట్లు 
-మంచిర్యాల్ -పెద్దంపేట్ లైన్ కి 30కోట్లు 
-బద్రాచలం -కొవ్వూరు లైన్ కి 5కోట్లు 

No comments:

Post a Comment