ADD

Monday, 22 February 2016

నడిపించే నవయువనాయకులు రాజకీయ వారసులేనా???

నడిపించే నవయువనాయకులు రాజకీయ వారసులేనా???

నరేంద్రుడు నడయాడిన ఈ దేశంలో నాయకత్వానికి కోదువేలేదు. అర్జునుడు,అభిమన్యుడు నడచిన ఈ వేద భూమిలో సారదులు,రథసారదులకు లెక్కేలేదు కాని ప్రస్తుత పరిస్థితుల్లో నవయువ నాయకత్వం సామాన్యులకు పద్మవ్యూహంలా మారి రాజకీయ నాయకుల వారసులే నవయువ నాయకులేమో అన్నవిధంగా మారింది. ప్రస్తుతం దేశంలో యువనాయకులు అనగానే గుర్తొచ్చేది రాహుల్ గాంధి,అఖిలేష్ యాధవ్,తేజస్వి యాదవ్,తేజ్ ప్రతాప్ యాదవ్,సుప్రియా సులే,అఘాత సంగ్మా,కేటిఅర్ ,కవిత ,జగన్ ,లోకేష్,జ్యోతిరాదిత్య సింధియా,సచిన్ పైలెట్,మిలింద్ దేవరా. ఇలా ప్రదాన పార్టీల అధినేతల వారసులే యువనాయకులుగా కొనసాగుతున్నారు. ఈ పార్టీల జెండాలు మోసిన కార్యకర్తలు కింది స్థాయిలోనే ఉండిపోతున్నారు. పదవతరగతి కూడా పాసవని తేజస్వి యాదవ్ ని మించిన యువ నాయకులు పార్టీల్లో లేరా??పీహెచ్డి పట్టాలు పొందిన పార్టీ జెండాలు మోసిన పేదింటి యువకులకు సిహాసనం సింహ స్వప్నమేనా??సామాన్యులకు నాయకత్వం అందని ద్రాక్షేనా??రాజకీయ నాయకత్వ పద్మవ్యూహాన్ని చేదించడానికి సామాన్యులు ముందుకు రారా ??

No comments:

Post a Comment