ADD

Monday, 22 February 2016

రెండు దుబాయ్ కంపెనీలతో తెలంగాణా ప్రభుత్వం ఎంవోయు;యువతకు 750ఉద్యోగాలు

రెండు దుబాయ్ కంపెనీలతో తెలంగాణా ప్రభుత్వం ఎంవోయు;యువతకు 750ఉద్యోగాలు

ఏజంట్ల చేతిలో మోసపోతున్న తెలంగాణా యువకులను ఆదుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం తరుపున దుబాయ్ వెళ్ళిన హోం మంత్రి నాయిని నరసింహ రెడ్డి దుబాయ్ అల్ముల్లా గ్రూప్ ,అజీరా ఎమిరేట్స్ పవర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో తెలంగాణా ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ చైర్మెన్,అల్ముల్లా గ్రూప్ కి చెందిన మహమ్మద్ సర్వర్,జజీర ఎమిరేట్స్ కి చెందినా ఎన్టి రెడ్డి పాల్గొన్నారు. ఈ ఒప్పందంతో తెలంగాణా యువతకు ప్రభుత్వం తరుపున అల్ముల్లా గ్రూప్ 500మందికి,జజీర గ్రూప్ 200మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇంకా కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నామని,కెసిఆర్ సూచనల మేరకు తెలంగాణాలోని నైపుణ్యమున్న యువత ఏజెంట్ల చేతిలో మోసపోకుండా ప్రభుత్వమే విదేశాల్లో ఉద్యోగాలు కల్పించనున్నామని నాయిని నరసింహ రెడ్డి పేర్కొన్నారు. 

No comments:

Post a Comment