ADD

Saturday, 3 September 2016

కెసిఆర్ "ఆపరేషన్ కాంగ్రెస్ వన్స్ మోర్" కారెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్???

కెసిఆర్ "ఆపరేషన్ కాంగ్రెస్ వన్స్ మోర్" 

కారెక్కనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్???

గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఆపరేషన్ ఆకర్ష్ కు  తెలంగాణాలో మళ్లీ తెరలేవనుంది. ఇప్పటికే ప్రతిపక్షాల ఉనికిని కోల్పోయేలా చేసిన కెసిఆర్ ఇక కూకటివేళ్లతో సహా పెకిలిస్తారేమో??? మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని కారెక్కించే పని చాపకింది నీరులా సాగిపోతున్నట్టు సమాచారం. కృష్ణా పుష్కరాల సమయంలోనే సంపత్ కుమార్ కెసిఆర్ తో భేటీ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల సంపత్ పార్టీ వీడటం ఆగిపోయింది.రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత సంపత్ కాంగ్రెస్ వీడి కారెక్కనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సంపత్ తో పాటు మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. చర్చలు కొలిక్కివస్తే సంపత్ తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కారెక్కే అవకాశం ఉండనుంది.  

Friday, 2 September 2016

అన్నదాతను ఆదుకుందామిలా.....! తెలంగాణ నూతన వ్యవసాయవిదానం ఉండాలిలా ....

అన్నదాతను ఆదుకుందామిలా.....!

   తెలంగాణ నూతన వ్యవసాయవిదానం ఉండాలిలా .... 

దేశంలోనే వేగంగా అభివృద్ధి లో దూసుకుపోతున్న రాష్ట్రం తెలంగాణ,లక్ష కోట్ల ప్రాజెక్టులకు సైతం నెల రోజుల్లో అనుమతులు ఇచ్చేలా ప్రపంచంలోనే ప్రసిద్ధమైన నూతన ఏకగవాక్ష పారిశ్రామిక విదానం రూపొందించుకున్నాం,తెలంగాణాని ప్రపంచ విత్తన బండాగారం లా తీర్చిదిద్దాలని,తెలంగాణను కోటి ఎకరాల మాగాణంలా మార్చాలనే ఆశయంతో ముందుకు వెళుతున్నాం కానీ అన్నదాత ఇంకా నిరాశ కోరల్లోనే ఉన్నాడు... 
--తెలంగాణ పారిశ్రామిక విధానంతో క్షణాల్లో అనుమతులు 
--ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ కార్పోరేషన్ లు ఏర్పాటు చేసి,వేల కోట్ల నిదులు కేటాయిస్తున్నాం 
--ముఖ్యమంత్రి సహాయనిధి పేరిట ఎన్నోకోట్లతో  ఎంతోమంది  నిరుపేదల ప్రాణాలు నిలబెడుతున్నాం 
కానీ 
-అన్నదాతల రుణమాపీకి విడతల వారీగా ఇస్తూ సాగదీస్తూనే  ఉన్నాం 
-రైతుల ఇన్ ఫుట్ సబ్సిడీలకు ఎదురుచూపులే దిక్కు 
-అతివృష్టి ,అనావృష్టి వంటి కారణాలవల్ల పంటనష్టం వాటిల్లిన ప్రతిసారీ నష్టపరిహారం కోసం ఎదురుచూపులే 
-దేశంలో ఎంతోమంది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నా వారికి వ్యవసాయం కనుచూపుమేరలో కూడా ఉపాధిగా అనిపించక ఒకతరాన్ని సేద్యానికి దూరం చేశాం 
   ప్రస్తుతం ఉన్న ఈ  పరిస్థితుల్లో మార్పు రావటానికి అన్నదాత ను ఆదుకోవడానికి తెలంగాణ నూతన వ్యవసాయ విధానం అత్యావశ్యకం 

తెలంగాణ నూతన వ్యవసాయ విధానం :

--రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే  అవసరం లేకుండా తక్షణం రుణాలు అందేలా ఏకగవాక్ష విదానం 
-- రైతు యూనిట్ గా పంటల భీమా భీమా 
--తెలంగాణ రైతు కార్పొరేషన్ ,రైతులకు పంట నష్టపరిహారం,ఇన్ ఫుట్ సబ్సిడీ త్వరగా త్వరగా అందేలా రైతు సహాయ నిధి ఏర్పాటు 
--రైతులకు సేంద్రీయ సేద్యం పై అవగాహన కల్పించేలా వ్యవస్థ 
--దళారుల వ్యవస్థ రూపుమాపి రైతుల పంటలను మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేపట్టడం 
--రైతులకు తమ పంటలను నిలువ చేసుకునేందుకు అవసరమైన గోదాములను నిర్మించడం 
--వ్యవసాయం ,అనుబంధ రంగాలను ఒకే వ్యవస్థ కిందకు తెచ్చి రైతులు వాణిజ్య పంటల వైపు మారలేలా అవగాహన 
--వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంలా తీర్చిదిద్దడం 
--విత్తనోత్పత్తి రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం 
--నిరుద్యోగ యువత వ్యవసాయం పై దృష్టి సారించేలా ప్రోత్సాహకాలు 

తెలంగాణ ప్రాజెక్టులకు నాబార్డ్ నిధులు

తెలంగాణ ప్రాజెక్టులకు నాబార్డ్ నిధులు 

   నాబార్డ్ తో ఒప్పందానికి ఉమాభారతి లేఖ 

కేంద్ర ప్రభుత్వం దేశంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల పూర్తికి ప్రధానమంత్రి  కృషి సించాయి యోజన పథకం కింద తెలంగాణలోని దేవాదుల ,కొమురం భీం,గొల్లవాగు,,మత్తడివాగు,భీమా ఎత్తిపోతల సహా 11పథకాలకు నాబార్డు కింద నిధులు ఇవ్వడానికి అంగీకారం తెలిపిన కేంద్రం ఇందుకు సంబంధించి ఒప్పందం చేసుకోవడానికి కేంద్రమంత్రి ఉమాభారతి తెలంగాణ నీటిపారుదల శాఖ మాత్యులు హరీష్ రావు కి లేఖ రాసింది. తెలంగాణలోని 11 ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిన నేపద్యంలో నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతి,భూసేకరణ,నిర్వాసితులకు చెల్లింపులు వంటి సమస్యలపై దృష్టి సారించింది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన కింద తెలంగాణ లోని 11 ప్రాజెక్టుల పూర్తికి 5325 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనావేసింది. 

Thursday, 1 September 2016

చంద్రబాబు తొండాట....!

చంద్రబాబు తొండాట....!

ఓటుకు నోటు దర్యాప్తు ఆపాలని హైకోర్టులో పిటీషన్ 

మచ్చ లేని చంద్రుడిని అంటూ ఎల్లప్పుడూ ఊదరగొట్టే చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా తిమ్మిని బమ్మి చేయడమే నా ధ్యేయం అన్న చందంగా మరోమారు తొండాటకు తెరలేపారు. నిన్న ఎసిబి కోర్టు ఓటుకు నోటు కేసు దర్యాప్తు నివేదికను ఈ నెల 29లోపు సమర్పించాలని ఆదేశించగా  ఆ ఆదేశాలను ఆపేయాలంటూ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన తరుపు లాయరుచే హైకోర్టులో పిటీషన్ వేయగా  ఈ  పిటీషన్ పై రేపు వాదనలు విననుంది హైకోర్టు ధర్మాషణం. 

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త 1032 పోస్టుల గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త 

1032 పోస్టుల గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ విడుదల 

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 1032 పోస్టులతో గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ టిఎస్పిఎస్సీ  విడుదల చేసింది. గతంలో 439 పోస్టులకు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల అవగా,ప్రస్తుతం వాటికి అదనంగా 593 పోస్టులు కలిపి  మొత్తం 1032 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన టిఎస్పిఎస్సీ ఈ నెల 3 నుండి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఇది  వరకు గ్రూప్-2 కి  దరఖాస్తు చేసుకున్నవారు మరల దరఖాస్తు చేసుకోనక్కర్లేదు . ఈ గ్రూప్-2 పరీక్షను నవంబర్ 12,13 న నిర్వహించనున్నారు. 

Wednesday, 31 August 2016

153 నియోజకవర్గాల నయా తెలంగాణ...! నియోజకవర్గాల పెంపునకు కేంద్రం సుముఖం....?

153 నియోజకవర్గాల నయా తెలంగాణ...!

నియోజకవర్గాల పెంపునకు కేంద్రం సుముఖం....?

తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేస్తున్న కెసిఆర్ గారికి కేంద్ర అధికారవర్గాల నుండి మరో కీలక సమాచారం అందినట్టు తెలుస్తుంది. కేంద్ర అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజనకు సంబందించిన కసరత్తు మొదలవనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పది జిల్లాలు 119 నియోజకవర్గాల తెలంగాణ 27జిల్లాల 153 నియోజకవర్గాల తెలంగాణగా మారనుంది.