నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త
1032 పోస్టుల గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 1032 పోస్టులతో గ్రూప్-2 అనుబంధ నోటిఫికేషన్ టిఎస్పిఎస్సీ విడుదల చేసింది. గతంలో 439 పోస్టులకు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల అవగా,ప్రస్తుతం వాటికి అదనంగా 593 పోస్టులు కలిపి మొత్తం 1032 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన టిఎస్పిఎస్సీ ఈ నెల 3 నుండి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఇది వరకు గ్రూప్-2 కి దరఖాస్తు చేసుకున్నవారు మరల దరఖాస్తు చేసుకోనక్కర్లేదు . ఈ గ్రూప్-2 పరీక్షను నవంబర్ 12,13 న నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment