ADD

Saturday, 12 March 2016

సింగర్ మధుప్రియ ప్రేమ పెళ్లి లొల్లి;భర్తపై పీఎస్ లో పిర్యాదు

సింగర్ మధుప్రియ ప్రేమ పెళ్లి లొల్లి;భర్తపై పీఎస్ లో పిర్యాదు 


పసితనం లోనే పాటతో ప్రజల్లో పదికాలాలపాటు గుర్తుండిపోయేలా పాడింది. పాటతో కంటతడి పెట్టించింది. ఉద్యమానికి తనవంతు ఊపు తెచ్చింది. ఆడపిల్లనమ్మా అంటూ పరిణతికి మించి సామాజిక స్పృహతో మెప్పించిన మధుప్రియ పెద్దలను ఎదిరించి 2015అక్టోబర్ లో ప్రియుడు శ్రీకాంత్ ని పెళ్ళాడింది నాలుగు నెలల్లో తన భర్త వేదిస్తున్నాడంటూ హుమాయున్ నగర్ పీఎస్ లో కేసు పెటింది. తన భర్త లైంగిక వేదింపులకు గురిచేస్తున్నాడని,తనను పుట్టింటి నుండి కట్నం తెమ్మంటూ వేదిస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. పిర్యాదు చేసేందుకు వచ్చిన సమయంలో పోలీస్ స్టేషన్ లోనే కళ్ళు తిరిగి పడిపోయింది. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న మధుప్రియ పుట్టింటికి చేరింది. 

రేపే తెలంగాణా టెట్ నోటిఫికేషన్

రేపే తెలంగాణా టెట్ నోటిఫికేషన్ 

టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర నిర్ణయంతో గత వారం టెట్ నిర్వహణ వాయిదా వేసిన తెలంగాణా ప్రభుత్వం మరలా టెట్ నిర్వహణకు రంగం సిద్దం చేసింది. రేపు టెట్-2016నోటిఫికేషన్ విడుదల చేయనున్న తెలంగాణా విద్యా శాఖ ఈ నెల 16-31వరకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనుంది. ఏప్రిల్ 20న ఆన్ లైన్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కలిపించనున్నారు. టెట్ పరీక్షను మే 1న ఉదయం 9.30-12.30వరకు పేపర్-1,మద్యాహ్నం 2.30-5.30వరకు పేపర్-2 నిర్వహించనున్నారు. 

చంద్రబాబును నిలదీసిన ఉద్యమకారుడు పణిగిరి మల్లయ్య కుమార్తె వివాహానికి కెసిఆర్ ఆర్ధిక సహాయం

చంద్రబాబును నిలదీసిన ఉద్యమకారుడు పణిగిరి మల్లయ్య కుమార్తె వివాహానికి కెసిఆర్ ఆర్ధిక సహాయం

తెలంగాణా ఉద్యమ సమయంలో చంద్రబాబు గారి వరంగల్ టూర్ లో తెలంగాణా రాష్ట్ర సాదన గురించి చంద్రబాబు ని ప్రశ్నించి చుక్కలు చూపించిన ఉద్యమకారుడు పణిగిరి మల్లయ్య ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్ల కు తెలంగాణా ప్రభుత్వం తరుపున కెసిఆర్ 10లక్షల ఆర్ధిక సహాయం అందించారు. నిన్న జరిగిన మల్లయ్య రెండో కూతురి పెళ్ళికి తెలంగాణా పప్రభుత్వం తరుపున ఎక్షైజ్ శాఖ మంత్రి పద్మారావు తో పాటు వరంగల్ టిఅరేస్ నాయకులు హాజరై ఆర్ధిక సాహయం అందజేశారు. 

తెలంగాణా పర్యాటక రంగంలో మరో కలికితు రాయి "సీ ప్లేన్"

తెలంగాణా పర్యాటక రంగంలో మరో కలికితు రాయి "సీ ప్లేన్"

తెలంగాణా పర్యాటకరంగం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచస్థాయి లో గుర్తింపు పొందుతుంది. ఈ మధ్యే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'హెలీ టూరిజం' ప్రవేశపెట్టిన తెలంగాణా టూరిజం మరికొద్ది రోజుల్లోరోడ్డు మీదుగా పయనించి ఒక్కసారిగా నీటిలోకి దూసుకెళ్ళే  'రోడ్ బస్' సౌకర్యాన్ని దేశంలోనే మొదటిసారిగా పర్యాటక శాఖ కలిపించింది. దీంతో పాటు కొంతసేపు హుస్సేన్ సాగర్ నీటిలో విహరిస్తూ అంతలోనే అంతరిక్షం లో విహరించే 'సీ ప్లేన్' సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. కొద్దిరోజుల క్రితం ప్రవేశపెట్టిన 'హెలీ టూరిజం' కంటే తక్కువ ఖర్చుకే ఒక్కొక్కరికి రూ.3000 వేలకే ఈ సౌకర్యాన్ని పర్యాటకులకు కలిపించనుంది. 

హృతిక్ రోషన్ తో రాజమౌళి 1000కోట్ల 'గరుడ' ???

హృతిక్ రోషన్ తో రాజమౌళి 1000కోట్ల 'గరుడ' ???
బాహుబలి తో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం బాహుబలి -2 ని బాహుబలి ని మించే స్థాయిలో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. బాహుబలి తో తన సినిమా మార్కెట్ ను 600కోట్లకు పెంచుకున్న రాజమౌళి బాహుబలి-2 ని 1000కోట్ల మార్కెట్ స్థాయికి పెంచాలని భావిస్తున్న రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని అంతకు మించి ఉండేలా 32కోట్లతో ఓ ట్రైలర్ తీసి హాలివుడ్ స్థాయి గుర్తింపు తో 1000కోట్లతో 'గరుడ' సినిమాని తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తొలుత ఎన్టిఆర్ తో తెరకెక్కించాలనుకున్న మార్కెట్ పెంచాలంటే ఈ సినిమాలో హృతిక్ రోషన్ ని తీసుకోవాలని బావిస్తున్నారని సమాచారం. ఈ సినిమా అనంతరం రాజమౌళి తన కలల మహాభారత ప్రాజెక్టును తెరకెక్కించాలని భావిస్తున్నారని సమాచారం ఇందులోనే జూ. ఎన్టిఆర్ తో పాటు బాలీవుడ్,టాలీవుడ్ ,హాలీవుడ్ మహామహులను ఇందులో బాగస్వాములను చేసి ప్రపంచ ప్రఖ్యాత మల్టిస్టారర్ గా తెరకెక్కించాలని రాజమౌళి ఆలోచన అని తన దగ్గరి వర్గాల సమాచారం. 



Thursday, 10 March 2016

టిటిడిపి కి షాక్;పార్టీ మారిన టిడిపి ఎమ్మెల్యేల విలీనానికి స్పీకర్ అంగీకారం...!

టిటిడిపి కి షాక్;పార్టీ మారిన టిడిపి ఎమ్మెల్యేల విలీనానికి స్పీకర్ అంగీకారం...!


తెలంగాణాలో టిడిపి కి స్పీకర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. పార్టీ మారిన 12 మంది టిడిపి ఎమ్మెల్యేలు తమని టిఅరేస్ పార్టీలో లో విలీనానికి అనుమతి ఇవ్వాలని ఇచ్చిన లేఖను పరిశీలించిన స్పీకర్ మధుసూధనాచారి పార్టీ మారిన టిటిడిపి ఎమ్మెల్యేలు 2/3మెజారిటీ కలిగి ఉన్నందున రాజ్యాగం లోని 10వ షెడ్యూల్డ్ 4వ నిబందనను అనుసరించి ఎమ్మెల్యేల విలీనానికి అంగీకరిస్తూ నిర్ణయం వెలువరించారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇక టిఅరేస్ సభ్యులుగానే గుర్తించనున్నారు. ఈ సమావేశం లో పార్టీ పిరాయిమ్పులపై అసెంబ్లీని కుదిపెద్దామనుకున్న టిడిపి కి ఊహించని షాక్ తగిలింది. ఇక టిడిపి కి మిగిలింది రేవంత్ రెడ్డి,ఆర్. కృష్ణయ్య,సండ్రా వేంకట వీరయ్య మాత్రమే. 

ఖమ్మం మేయర్ గా ఉద్యమ సమయం లో కెసిఆర్ కి వైద్య సేవలందించిన డా.పాపాలాల్....???

ఖమ్మం మేయర్ గా ఉద్యమ సమయం లో కెసిఆర్ కి వైద్య సేవలందించిన డా.పాపాలాల్....???

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా తెలంగాణా ఉద్యమ సమయంలోకెసిఆర్ దీక్ష సమయంలో వైద్య సేవలందించిన డా. గుగులోత్ పాపాలాల్ కి అవకాశమివ్వనున్నత్లు తెలుస్తుంది. ఖమ్మం మేయర్ ఎస్టీ జనరల్ కి కేటాయించడంతో రెండో డివిజన్ నుంచి గెలుపొందిన డా. గుగులోత్ పాపాలాల్ ని మేయర్ గా కెసిఆర్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. కెసిఆర్ దీక్ష సమయంలో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సమయంలో వైద్య సేవలందించిన అప్పటి ఆస్పత్రి సుపరిడేంట్ గా పని చేసారు పాపాలాల్. ఉద్యమ సమయంలో వైద్య సేవలందించిన పాపాలాల్ సేవలను గుర్తుపెట్టుకుని మేయర్ పదవితో గౌరవించడం మంచి నిర్ణయమని ఖమ్మం టిఅరేస్ కార్యకర్తలు కెసిఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

పరాజయం పరిపూర్ణం;తెలుగుదేశం ఖేల్ ఖతం;చంద్రహాసం శూన్యం

పరాజయం పరిపూర్ణం;తెలుగుదేశం ఖేల్ ఖతం;చంద్రహాసం శూన్యం 


ఎంతమంది లీడర్లు పార్టీ వీడినా కార్యకర్తలు తమ పార్టీ వెంటే అంటూ మేకపోతు గంబీర్యం చూపించిన టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కి దిమ్మదిరుగుతుంది. తెలంగాణాలో టిడిపి ఖేల్ ఖతం అవనుంది. ఇప్పటికే తెలంగాణాలో టిడిపి కి చెందిన 15మంది ఎమ్మెల్యేలలో 10మంది టిఅరేస్ లో చేరగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ వీడెందుకు సిద్దంగా ఉన్నారు. ఇదిలా ఉంటె నిన్న వెలువడిన మున్సిపల్ పలితాలలో గత రెండు దశాబ్దాలుగా టిడిపి కంచు కోటగా ఉన్న అచ్చంపేట్ లో టిడిపి బోణీ చేయకపోగా టిఅరేస్ స్వైప్ చేసింది. ఇక వరంగల్ ,ఖమ్మం లో సైతం టిడిపి కి రిక్త హస్తం మిగిలింది. కారు జోరులో సైకిల్ నిలవలేకపోయింది. సై'కిల్' పరాజయం పరిపూర్ణం,టిడిపి ఖేల్ ఖతం,చంద్రహాసం శూన్యం అన్న చందంగా మారింది. 

దేశంలోనే తొలిసారి మొబైల్స్ ఆర్ అండ్ డీ హబ్ @ హైదరాబాద్

దేశంలోనే తొలిసారి మొబైల్స్ ఆర్ అండ్ డీ హబ్ @ హైదరాబాద్ 

మొబైల్ తయారి రంగంలో తెలంగాణా మరో మైలు రాయిగా మారనుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో సెల్కాన్,మైక్రొమాక్ష్,లావా,కార్బన్ సంస్థలు సంయుక్తం గా మొబైల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఆర్ అండ్ బీ హబ్ నిర్వాహణకు 5ఎకరాల భూమిని కేటాయించాలని మొబైల్ కంపెనీలు ప్రభుత్వానికి వినతిపత్రాలను సమర్పించగా సర్కార్ ఈ 5ఎకరాలను గచ్చిబౌలి సమీపం లో కేటాయించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ కంపెనీలతో మంత్రి కేటిఆర్ సంప్రదింపులు జరిపారు. ఈ కంపినీలలో సెల్ కాన్ మేడ్చల్ సమీపంలో ప్లాంట్ నెలకొల్పి నిర్వహిస్తుండగా,మైక్రొమక్ష్ ,కార్బన్ లు రంగారెడ్డి జిల్లాలో మొబైల్ ఫోన్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాయి. మొబైల్ ఆర్ అండ్ బీ హబ్ ఏర్పాటుతో 2000మందికి ఉపాధి కలిపించనుంది. 

Wednesday, 9 March 2016

గ్రేటర్ వరంగల్ లో గులాభి సేన ఘన విజయం

గ్రేటర్ వరంగల్ లో గులాభి సేన ఘన విజయం 

గ్రేటర్ హైదరాబాద్ గెలుపు ఉత్సాహంతో గ్రేటర్ వరంగల్ లో సైతం గులాభి సేన ఘన విజయం సొంతం చేసుకుంది. ఈరోజు జరిగిన వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపులో 58డివిజన్లకు గాను 44డివిజన్లను గెలుచుకుని మేయర్ పీఠం కైవసం చేసుకుంది. టిఅరేస్ జోరుకు ప్రత్యర్థి పార్టీలన్నీ సింగిల్ డిజిట్ కె పరిమితమయ్యాయి. లెక్కింపు మొదలైనప్పటి నుండి టిఅరేస్ హవా కొనసాగగా కాంగ్రెస్ 4,బిజెపి 1,ఇతరులు 9స్థానాలలో గెలుపొందారు. ఇతరులు గెలుపొందిన 9స్థానాల్లో సైతం ఎక్కువగా టిఅరేస్ రెబల్ అభ్యర్థులే ఉండటం విశేషం. టిడిపి ఖమ్మం,అచ్చంపేట్ తో పాటు వరంగల్ లోను బోణీ చేయకపోవడం గమనార్హం. 

ఖమ్మం కోటలో కారు జోరు;కారు హోరులో ప్రతిపక్షాలు బేజారు

ఖమ్మం కోటలో కారు జోరు;కారు హోరులో ప్రతిపక్షాలు బేజారు 

ఖమ్మం కమ్యూనిస్ట్ కోటలో తొలిసారి కారు జోరు చూపించింది. ఖమ్మం మున్సిపల్ ఎన్నికలో ఈరోజు వెలువడిన పలితాల్లో 50డివిజన్ లకుగాను టిఅరేస్ 34డివిజన్ లలో విజయకేతనం ఎగురవేసింది. కారు జోరులో ప్రతిపక్ష పార్టీల అడ్రెస్ లు గల్లంతయ్యాయి. కారు హవా కొనసాగిన ఖమ్మం మున్సిపల్ పలితాల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే 10స్థానాలతో పరవాలేదనిపించినా,వైసిపి,సిపిఐ,సిపిఎం చెరో రెండు స్థానాలు కైవసం చేసుకోగా ,టిడిపి ,బిజెపి పార్టీలు తమ ఖాతా తెరవకపోవడం విశేషం. ఈ విజయం తో ఖమ్మం గుమ్మం లో తొలిసారి గులాభి గుబాలించింది. 

సండ్రా సైతం సంప్రదింపులు ???కారెక్కనిస్తారా ???వద్దంటారా???

 సండ్రా సైతం సంప్రదింపులు ???కారెక్కనిస్తారా ???వద్దంటారా???


ఖమ్మం జిల్లా టిడిపి ఎమ్మెల్యే ఓటుకు నోటు కేసులో నిందితుడు సండ్రా వేంకట వీరయ్య సైతం కారెక్కడానికి సిద్దపడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే టిడిపి నుండి టిఅరేస్ లో చేరిన ఎమ్మెల్యేలు,టిఅరేస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఓటుకు నోటు కేసులో నిందితుడిగా సండ్రా ఉండటంతో టిఅరేస్ లో చేర్చుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వేలుతాయేమోనని టిఅరేస్ వర్గాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. 11న టిడిపి ఎమ్మెల్యేలు గోపీనాథ్ ,అరికపూడి టిఅరేస్ లో చేరిక ఉన్నందున సండ్రా వేంకట వీరయ్య పై ఓ స్పష్టత వస్తుందని టిఅరేస్ వర్గాలు పేర్కొంటున్నాయి. 


అచ్చంపేట్ లో కారు స్వీప్;కారు జోరులో పార్టీలు గల్లంతు

అచ్చంపేట్ లో కారు స్వీప్;కారు జోరులో పార్టీలు గల్లంతు 


అచ్చంపేట్ నగర పంచాయితీలో ప్రత్యర్థి పార్టీలన్నీ కలసి మహా కూటమిగా ఏర్పడి పోటీ చేసిన కారు జోరును అడ్డుకోలేకపోయారు. కారు జోరుకు అచ్చంపేట్ ఎన్నికల్లో 20వార్డులకు గాను 20వార్డులు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. 2014లో నగర పంచాయితిగా ఏర్పడిన తొలిసారి జరిగిన ఎన్నికల్లో టిఅరేస్ పార్టీ జోరు చూపించింది. టిడిపి కంచు కోటగా ఉన్న అచ్చంపేట్ లో టిఅరేస్ జెండా రెపరెపలాడింది. టిఅరేస్ పార్టీ జోరులో ప్రతిపక్ష పార్టీల అడ్రెస్ గల్లంతయ్యింది. 

Tuesday, 8 March 2016

ముహూర్తం కుదిరింది..!11న కారేక్కనున్న మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు..!

  ముహూర్తం కుదిరింది..!11న కారేక్కనున్న మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు..!


తెలంగాణాలో టిడిపి నామరూపాలు అవడానికి మరో రెండు మెట్లు కూలనున్నాయి. చంద్రబాబు ఎన్ని చర్యలు తీసుకున్నా..!ఎంత బరోసా ఇచ్చినా ..!ఎన్ని సమావేశాలు ఏర్పాటు చేసినా పలితం శూన్యం,కొనసాగుతున్న షాక్ ల పరంపర. తెలంగాణాలో టిడిపి కి మిగిలిన అయిదుగురు ఎమ్మెల్యేల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిఅరేస్ లో చేరుటకు ముహూర్తం కుదిరింది.నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ తో సమావేశమైన జూబ్లి హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ,తన సహచర ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తో చర్చించిన అనంతరం ఈ నెల 11న కారెక్కడానికి అంతా సిద్దం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి గోపీనాథ్ తన సహచరులకు,అనుచరులకు సమాచారం అందించారు. దీంతో తెలంగాణాలో టిడిపికి ఇక మిగిలింది ముగ్గురు మాత్రమే. 

కెసిఆర్ కాలిడిన చోట కాసుల వర్షం...!సస్యశ్యామలం...!కెసిఆర్ ఖాతాలో 5వేల కోట్ల ఖజానా...!

కెసిఆర్ కాలిడిన చోట కాసుల వర్షం...!సస్యశ్యామలం...!కెసిఆర్ ఖాతాలో 5వేల కోట్ల ఖజానా...!

ఇక నుంచి యావత్ తెలంగాణా,మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజలు తెలంగాణా పునర్నిర్మాణ విధాత అపర భగీరథుడు కెసిఆర్ తమ ప్రాంతంలో అడుగుపెట్టాలని కోరుకుంటారు. కెసిఆర్ రావాలని కంకణం కట్టుకుంటారు. తెలంగాణా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రజల పాలిట బంగారం కానుంది,ఈ బడ్జెట్ లో ముఖ్యమంత్రి ఖాతాలో 5000కోట్ల ప్రజానిదిని కేటాయించారు. కెసిఆర్ పర్యటించే ప్రాంతాల్లో ఏవైనా సమస్యలు ఉన్నా??అభివ్రుద్దికి సంబందించిన పనులకు నిధులు కేటాయించడానికి ఈ నిదులను వినియోగించనున్నారు. అలాగే ప్రతి మంత్రికి 25కోట్ల ప్రత్యేక అభివృద్ది నిదులను కేటాయించనున్నారు. దీంతో సిఎం పర్యటించే ప్రాంతాల్లో అప్పటికప్పుడు అభివృద్ధి పనులకు కాసుల వర్షం కురవనుంది. ప్రత్యేక ఖజానా నిదులతో కెసిఆర్ కాలిడిన చోట సస్యశ్యామలం కానుంది. 

అద్బుతం,అద్వితీయం ఈ అఖండ స్వాగతం 'అపర భగీరథుడు'కి...!

అద్బుతం,అద్వితీయం ఈ అఖండ స్వాగతం 'అపర భగీరథుడు'కి...!

తెలంగాణా రథసారది,తెలంగాణా అపర భగీరథుడు కి మహారాష్ట్ర తో చారిత్రాత్మక ఒప్పందం అనంతరం హైదరాబాద్ చేరుకున్న తర్వాత తెలంగాణా ప్రజలు ఘన స్వాగతం పలికారు,డప్పు చప్పుళ్లు,కార్యకర్తల కోలాహలం,అశేష జనవాహిని నడుమ బేగంపేట్ నుండి అధికారిక నివాసం వరకు బారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కెసిఆర్ మాట్లాడుతూ ఈ ఒప్పందంతో గోదావరిపై నిర్మించ తలపెట్టిన తుమ్మిదిహెట్టి,పెన్ పహాడ్,రాజాపేట,మేడిగడ్డ బ్యారేజీలతో ఉత్తర తెలంగాణకు రానున్న రెండు సంవత్సరాలలో రెండు పంటలకు సాగునీరు అందిస్తూ తెలంగాణాను సస్యస్యామలం చేయొచ్చని,ఈ బ్యారేజీల నిర్మాణంతో కోటి ఎకరాలకు సాగు నీటిని అందిచడంతో నల్గొండ,మహా బూబ్ నగర్ జిల్లాలను సస్యస్యామలం అవుతాయని,జంట నగరాలకు తాగునీరు అందుతుందని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నప్పుడు తెలంగాణా సాదిన్చినపుడు ఎంత సంతోషం కలిగిందో అంతకు మిక్కిలి సంతోషం కలిగిందని కెసిఆర్ అన్నారు. ఈ ఒప్పందం పట్ల ఎమ్మెల్యేలు,ఎంపి లు,ప్రజలు హర్షాతిరేకాలు తెలిపారు. 

అపర భగీరథుడుకి అఖండ స్వాగతానికి ఏర్పాట్లు....!

అపర భగీరథుడుకి అఖండ స్వాగతానికి ఏర్పాట్లు....!

గోదావరి నది మీద అయిదు బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్న అపర భగీరథుడు ముఖ్యమంత్రి కెసిఆర్ కి అఖండ స్వాగతం పలికేందుకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుండి ముఖ్యమంత్రి అధికారిక నివాసం వరకు బారీ ర్యాలీకి 50000వేల మంది కార్యకర్తలు,1000మంది కళాకారుల ప్రదర్శనలతో అఖండ స్వాగతం పలికేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే బేగంపేట్ ఎయిర్ పోర్ట్ పరిశర ప్రాంతాలను పరిశీలించిన శ్రీనివాస్ యాదవ్ ర్యాలీ జరుగు మార్గం లో పెద్దఎత్తున కటౌట్లతో నింపేశారు. 

మహిళా...!ఓ మహారాణి...!

మహిళా...!ఓ మహారాణి...!

మహిళా మహారాణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

మల్లెలాంటి మనసున్న ఓ మగువ...!
నీవులేని రంగాన నిలకడేది ?
నీవులేని చోట నీడలేదే...!
నింగికెగిసెను చూడు నీదు కీర్తి 
నీవులేని లోకాన మనుగడుందా??


మగాడికున్న స్వేఛ్చ మగువకేది?
మగువలేని మగాడి మనుగడేది?
మగువ ఘోష మనసుతో వినరా 
మనసున్న మారాజ మగ మహారాజ!

                                                     --వేముల కర్ణాకర్ రెడ్డి 

Monday, 7 March 2016

టిటిడిపి కి డబల్ షాక్???కారేక్కనున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ??? బాబుకి దిమ్మతిరిగించి బొమ్మ చూపిస్తున్నారు

టిటిడిపి కి డబల్ షాక్???కారేక్కనున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ???

బాబుకి దిమ్మతిరిగించి బొమ్మ చూపిస్తున్నారు 

తెలంగాణాలో చంద్రబాబు కి దిమ్మతిరిగేలా బొమ్మ చూపిస్తున్నారు .ఈరోజు పార్టీ దివంగత నేత ఎలిమినేటి మాధవరెడ్డి వర్దంతి కార్యక్రమనికి హాజరైన టి టిడిపి ఎమ్మెల్యేలు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి టిడిపి ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ ,మాగంటి గోపీనాథ్ లు గైర్హాజరైనారు . వీరు టిఅరేస్ నేతలతో సంప్రదింపులు జరిపి టిడిపి కి గుడ్ బై చెప్పి కారేక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు రోజులు కెసిఆర్ మహారాష్ట్ర పర్యటనలో బిజీగా ఉండటంతో మరో మూడు రోజుల్లో ఖండువా కప్పుకుని కారేక్కుతారని తెలుస్తుంది. వీరిరువురి చేరికతో టిడిపి కి మిగిలేది ఇక ముగ్గురు ఎమ్మెల్యేలే అందులో ఒకరు కృష్ణయ్య పార్టీ కి అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు,మిగితా ఇద్దరు ఓటుకు నోటులో కీలక నిందితులు రేవంత్ రెడ్డి,సంద్ర వెంకట వీరయ్య. 

చంద్రబాబుకి షాక్???

చంద్రబాబుకి షాక్???

ఆంధ్రముఖ్యమంత్రి చంద్రబాబు కి దిమ్మతిరిగే షాక్ తగలనుంది. కెసిఆర్ ఆటను ఆంధ్రలో ఆడుతున్న చంద్రబాబు కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగలనుంది. తెలంగాణాలో టిడిపి ఎమ్మెల్యేలలో 2/3మెజారిటీ ఎమ్మెల్యేలను లాగి తన ఆరితేరిన ఆటను ప్రదర్శించగా అరితేరని ఆటను ఆడుతున్న చంద్రబాబు 7గురు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలను లాగగా 2/3మెజారిటీకి ఆమడ దూరంలో ఉన్నారు దీంతో జగన్ తన వ్యూహానికి పదును పెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆంధ్రలో అమరావతి భూ దందా,రావేల కిషోర్ తనయుడి రచ్చ,బాలకృష్ణ వాఖ్యల నేపధ్యంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్బంలో చంద్రబాబు ప్రభుత్వంపై గవర్నర్ కి పిర్యాదు చేసి రేపు లేదా ఎల్లుండి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విప్ జారీ చేయడం ద్వారా పార్టీ మారిన వైసిపి ఎమ్మెల్యేల పై వేటు పడేలా ప్రణాళిక రచించినట్టు తెలుస్తుంది. 

బాగ్యనగరం ఆనుకుని మరో బృహత్తర నగరం;నిర్మాణానికి హెచ్ఎమ్డిఏ ప్రణాళిక సిద్దం

బాగ్యనగరం ఆనుకుని మరో బృహత్తర నగరం;నిర్మాణానికి హెచ్ఎమ్డిఏ ప్రణాళిక సిద్దం 



160కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు 
రింగు రోడ్డు ఆనుకుని 190గ్రామాలు 
190గ్రామాల పరిదిలో 2లక్షల ఎకరాల భూమి 
17రేడియల్ రోడ్ల విస్తరణ 
ఇదే బాగ్యనగరం ఆనుకుని మరో బృహత్తర నగర నిర్మాణానికి పునాదులు. 
ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ తోనే ప్రపంచం తెలంగాణా వైపు చూస్తుంటే హైదరాబాద్ ని మించి మరో బృహత్తర నగర నిర్మాణానికి తెలంగాణా ప్రభుత్వం సిద్దం అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్  చుట్టూ  160కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న 190గ్రామాల పరిదిలో 2లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. 190గ్రామాల పరిదిలో ఉన్న భూమిని ఔటర్ రింగు రోడ్డు నుండి ఈ 190గ్రామాలకు ఇంతవరకు రోడ్ల విస్తరణ లేదు ,ప్రస్తుతం ఈ 190గ్రామాలకు ఔటర్ నుండి రేడియల్ రోడ్లను విస్తరించి,ఈ 2లక్షల ఎకరాలలోని ప్రభుత్వ భూమిలలో స్పోర్ట్స్ సిటీ ,ఫిలిం సిటీ ,ఫార్మా సిటీ తో పాటు హెచ్ఎండిఎ కొన్ని ప్రభుత్వ భవన నిర్మాణాలను చేపట్టి ఈ 190గ్రామాల రేడియల్ రోడ్లతో ఔటర్ రింగు రోడ్డును సిటీ రోడ్లకు కలిపితే ప్రైవేట్ ప్రాజెక్టులతో పాటు ఈ గ్రామాలు సిటీలుగా మారి మరో బృహత్తర నగర నిర్మాణం ఏర్పడుతుంది. ఇప్పటికే అనుమతులకోసం హెచ్ఎండిఎ అధికారులు ప్రభుత్వానికి వినతులు సమర్పించగా ఈ ప్రణాళికపై మంత్రి కెటిఆర్ ద్రుష్టి పెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. 

అమరేంద్ర బాహుబలిని కట్టప్ప చంపడానికి కారణం ఇదే...! బాహుబలి-2 స్టోరీ

అమరేంద్ర బాహుబలిని కట్టప్ప చంపడానికి కారణం ఇదే...!

బాహుబలి-2 స్టోరీ  

         కాలకేయ తో విజయం అనంతరం మాహిస్మతి సామ్రాజ్య మహారాజుగా పట్టభిషేక్తుడైన అమరేంద్ర బాహుబలి ని కుంతల రాజ్య యువరాణి దేవసేన ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అమరేంద్ర బాహుబలి సైతం దేవసేన ప్రేమలో ఉండగా దేవసేన అందం గురించి తెలుసుకున్న సైన్యాధిపతి బల్లాలదేవ దేవాసేనను పెళ్లాడాలని అనుకుని ఈ విషయాన్ని తన తల్లి శివగామి కి తెలియజేయడం తో దేవసేన,బల్లాలదేవ ప్రేమ గురించి తెలియని శివగామి బల్లాలదేవుడికి మాట ఇచ్చి బాహుబలి దగ్గర ఈ విషయం ప్రస్థావిస్తుంది,అదే సమయంలో తమ ప్రేమ విషయం శివగామికి చెప్పడంతో శివగామి బల్లాలను ఒప్పించాలని భావిస్తుండగా తన పంతం వీడకపోవడంతో అమరేంద్ర భాహుబలి మాహిష్మతి సామ్రాజ్యాన్ని వదిలి కుంతల చేరుకొని యువరాణి దేవసేన ని వివాహమాడి కుంతల యువరాజుగా యువరానికి రాజ్యపాలనలో ఉన్న బాహుబలి పై కసితో బల్లాలదేవ కుంతల సామ్రాజ్యంపై దండయాత్రకు సిద్దపడతాడు. 
        25000పైచిలుకు సైన్యంతో ఉన్న మాహిష్మతి సైన్యం దండెత్తడంతో తక్కువ సైన్యం తో ఉన్న కుంతల సామ్రాజ్య సైన్యాన్ని తన యుద్దనైపున్యం తో విజయతీరాలకు కదిలిస్థున్న సమయంలో,మాహిష్మతి రాజు బల్లాలదేవ ఓడిపోవడం ఖాయం అవడంతో రాజును కాపాడుకోవాలని సింహాసనానికి కట్టుబానిసగా ఉన్న కట్టప్ప బల్లాలదేవ ను రక్షించడం కోసం తప్పించాలని అమరేంద్ర భాహుబలిని తప్పనిసరి పరిస్థితుల్లో గాయపరిచి బల్లాలను తప్పించే సమయంలో తేరుకుని బల్లాలదేవ అదే అదునుగా అమరేంద్ర భాహుబలిని చంపేసి కడుపు తో ఉన్న కుంతల యువరాణి ని కట్టుబానిసగా చేసుకుని శివుడు పుట్టగానే ఆ శిశువుని చంపెయ్యాలని బల్లలదేవ ఆదేశిస్తే శివగామి వారించిన వినకపోవడంతో శివుడిని తప్పించడానికి శివగామిని ప్రయత్నించడంతో తన తల్లి శివగామిని,ఆ శిశువుని చంపేయాలని ఆదేశిస్తాడు ఇదంతా కట్టప్ప శివుడికి చెప్పిన అనంతరం తన తండ్రి అమరేంద్ర భాహుబలి ని చంపిన బల్లలదేవుడిని చంపి మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టప్పకి అప్పగించి శివుడు తన తల్లి కుంతల సామ్రాజ్యానికి పట్టాభిషక్తుడవడంతో బాహుబలి-2 ముగింపు. 


తెలంగాణా ఆపిల్ గా ఆదిలాబాద్ ఆపిల్ బేర్

తెలంగాణా ఆపిల్ గా ఆదిలాబాద్ ఆపిల్ బేర్ 

థాయిలాండ్ లో మొదలై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్ టూ గుజరాత్,మహారాష్ట్ర మీదుగా ఆదిలాబాద్ చేరుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు తెచ్చే తెలంగాణా ఆపిల్ గా పెరుగాంచబొథున్న 'ఆపిల్ బేర్' పంట సాగుకు తెలంగాణా ఉద్యానవన శాఖ పెద్దఎత్తున సిద్దం అవుతుంది. తెలంగాణా ఆపిల్ 'ఆపిల్ బేర్'సాగుకు తెలంగాణాలోని ఆదిలాబాద్,మహబూబ్ నగర్,ఇతర జిల్లాల భూములు అనుకూలంగా ఉండటంతో ఆదిలాబాద్ జిల్లా గుడిపేట్ ,జైపూర్ మండలాల ఉద్యానవన నర్సరీల్లొ 16ఎకరాల్లో ప్రయోగాత్మక ఆపిల్ బేర్ సాగుకు ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం గుడిపేట్ మండలంలో 13ఎకరాల్లో ఆపిల్ బేర్ మొక్కలు నాటడం పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లా రైతులకు పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని ప్రభుత్వం పెద్ద ఎత్తున సాగుకు ప్రోత్సాహకాలు అందివ్వడానికి సిద్దం చేస్తుంది. 

మంత్రివర్గ సమావేశంలోని కీలక నిర్ణయాలు

మంత్రివర్గ సమావేశంలోని కీలక నిర్ణయాలు 


సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఇప్పటికే ప్రతిష్టాత్మక టిఎస్ఐపాస్ తీసుకొచ్చిన తెలంగాణా ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న కొత్త ఐటీ,మైనింగ్,కల్చరల్ పాలసీ పై క్యాబినేట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆర్టీసి ని ఆదుకునేందుకు తీసుకునే 500కోట్ల రుణంపై పూచికత్తు ఉండాలని నిర్ణయించారు,హైదరాబాద్లో లక్ష సీసీ కెమేరాల ఏర్పాటు,కొత్తగా ఏర్పాటు చేయనున్న బ్రాహ్మణ కార్పోరేషన్ కు 100కోట్ల కేటాయింపు,రాష్ట్రంలో సెప్టెంబర్ నాటికి 44ఈ-మార్కెట్లు ఏర్పాట్లు,మహబూబ్ నగర్ లో పిషరీస్ అకాడమీ ఏర్పాటు ,ఐఏఎస్ అధికారుల సంఘానికి మూడెకరాల స్థలం కేటాయింపు,జీహెచ్ఎమ్సీ లో విలీనమైన 12శివారు మున్సిపాలిటీలకు తాగునీరు ,మౌలిక వసతుల కల్పనకు హడ్కో నుంచి రుణం తీసుకునుటకు,మార్కెట్ కమిటీల ఏర్పాటుకు వీలుగా చట్ట సవరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణా లో గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందానికి అంగీకరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పద్నవిస్ కి రాష్ట్ర మంత్రివర్గం అభినందనలు తెలిపింది . 

ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రులకు ఉద్బోధ..!

ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రులకు ఉద్బోధ..!

నిన్న జరిగిన క్యాబినెట్ బెటీలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన సహచర మంత్రులకు ఉద్బోధ చేసారు. మంత్రులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలతో సత్సంబందాలు పెంపొందించుకుంటూ,ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని,తెలంగాణాలో టిడిపి భూస్థాపితం అయిన నేపధ్యంలో మంత్రులు జాగ్రత్తగా ఉండాలని,తప్పులు జరగకుండా ముందుకెళ్ళాలని వేసవి సమీపించిన తరుణంలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ,కలెక్టర్లతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలని మంత్రులకు సూచించారు. 

భారత్ జోరులో బంగ్లా బేజారు...!ఆసియా కప్ విజేతగా భారత్

భారత్ జోరులో బంగ్లా బేజారు...!ఆసియా కప్ విజేతగా భారత్ 


మిర్పూర్ షేర్ ఏ బంగ్లా స్టేడియం లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఆరంబంలో బంగ్లా బ్యాట్స్ మెన్ ని కట్టడి చేసిన చివరలో షబ్బీర్ రెహ్మాన్ 29బంతుల్లో 32 సమయోచిత బ్యాటింగ్ కి మహ్మదుల్లా 18బంతుల్లో 33 మెరుపు బ్యాటింగ్ తోడవడంతో 15ఓవర్లలో బంగ్లాదేశ్ 120/5 పరుగులకు చేరుకుంది. భారత బౌలర్లలో భూమ్ర 1/13,అశ్విన్ 1/14,నెహ్రా 1/33,జడేజా 1/25రాణించారు. 
 121పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కి ఆదిలోనే అమీన్ హోస్సైన్ 1/30 రోహిత్ ని ఔట్ చేయగా ధావన్ 44బంతుల్లో 60(9x4,1x6)అద్భుత బ్యాటింగ్ కి కోహ్లి 28బంతుల్లో 41 సమయోచిత బ్యాటింగ్ తో విజయానికి బాటలు వేసారు. చివర్లో ధావన్ ఔటైన ధోని 6బంతుల్లో 2సిక్షెర్స్ ,1బౌండరీ సహాయంతో మరో 7బంతులు మిగిలి ఉండగానే విజయం సాదించి ఆసియా కప్ విజేతగా నిలిచారు. ధావన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక అవ్వగా ,రెహ్మాన్ (బంగ్లా ) మ్యాన్ ఆఫ్ ది టోర్నీ కి ఎంపికయ్యాడు. 

Sunday, 6 March 2016

ఖండిస్తారు ఆపై కండువా కప్పుకుని కారేక్కుతారు...!తీరు మారదు;

తీరు మారదు;

ఖండిస్తారు ఆపై కండువా కప్పుకుని కారేక్కుతారు...!

తెలంగాణాలో ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో వలసలు అనగానే ఒకటే సీన్ రిపీట్ అవుతుంటుంది. టిఅరేస్ ఆకర్ష్ తో ప్రత్యర్థి పార్టీలకు దిమ్మదిరుగుతున్న సీన్ అది,ఓ నాయకుడిపై రూమర్స్ వస్తుంటాయి ఆపై నేను అదీ,ఇదీ అని ఖండిస్తారు,ఖండించిన క్షణాలు ,గంటలు ,రోజులు మారకముందే కండువాలు మార్చి పార్టీ మారుతారు. ఈ సీన్ తో దిమ్మదిరిగిన మొదటి వ్యక్తి చంద్రబాబు ఎర్రబెల్లి పార్టీ మారుతున్న క్షణాన చంద్రబాబు టిటిడిపి నేతలతో ఏర్పాటు చేసిన సమావేశం లో గంబీరంగా పార్టీ గురించి,పార్టీ కార్యకర్తల గురించి ఎమోషనల్ గా మాట్లాడిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సమావేశం ముగిసిన గంట గడవకముందే టిఅరేస్ లో చేరితున్నానని ప్రకటించి చంద్రబాబుకి షాక్ ఇచ్చారు. ఇప్పుడు పొన్నాల విషయం లోను అదే సీన్ రిపీట్ అవుతుందని అనుకుంటున్నారు. 

బడ్జెట్ సమావేశాలపై బాస్ బాద్ షా గైడెన్స్ ;ముగిసిన మంత్రివర్గ సమావేశం

ముగిసిన మంత్రివర్గ సమావేశం

బడ్జెట్ సమావేశాలపై బాస్ బాద్ షా గైడెన్స్  

బడ్జెట్ సమావేశాలపై తెలంగాణా మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈనెల 14న మంత్రి ఈటెల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మూడు గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు,ఇరిగేషన్ ప్రాజెక్టుల డిజైన్ మార్పు,మహారాష్ట్ర ప్రభుత్వం తో ఒప్పందం పై సుదీర్ఘంగా చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తరుపున ప్రతిపక్షాలను ఎదుర్కోవలసిన తీరు,అసెంబ్లీ జరగవలసిన తీరు,అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగవలసిన తీరు పై చర్చించిన మంత్రివర్గం జలమండలి ,మిషన్ బగీరథలకు నాబార్డు నుండి 1900కోట్ల సహాయం,కొత్త ఐటి పాలసీ,ఆర్టిసీ తీసుకునే 500కోట్ల రూపాయల రుణం పై తెలంగాణా ప్రభుత్వం హామీ,హైదరాబాద్ లో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు కి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 


ముగిసిన మున్సిపల్ పోలింగ్;పెరిగిన పోలింగ్

ముగిసిన మున్సిపల్ పోలింగ్;పెరిగిన పోలింగ్ 

వరంగల్,ఖమ్మం,అచ్చంపేట్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రకటించింది. సాయంత్రం అయిదుగంటల వరకు వరంగల్ కార్పోరేషన్ పరిదిలో 58%,ఖమ్మం కార్పోరేషన్ పరిదిలో 68%,అచ్చంపేట్ లో అత్యదికంగా 70.88%పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ తో అధికార టిఅరేస్ పార్టీ గెలుపుపై ధీమాగా ఉంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

బయలుదేరనున్నాడు భగీరథుడు చారిత్రాత్మక ఒప్పందానికై....!

బయలుదేరనున్నాడు  భగీరథుడు చారిత్రాత్మక ఒప్పందానికై....!

తెలంగాణా జలప్రదాత,అభినవ భగీరథ,బంగారు తెలంగాణా నిర్మాత ముఖ్యమంత్రి కెసిఆర్ చారిత్రాత్మక జల ఒప్పందానికై రేపు ముంబై బయలుదేరనున్నాడు. దశాబ్దాలుగా నలుగుతున్న జల వివాదాలకు చెక్ పెట్టడానికి గోదావరి పై తెలంగాణా చేపట్టనున్న ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం తో అవగాహన కుదుర్చుకుని కుదుర్చుకుంటున్న ఒప్పందానికై రేపు ఉదయం 10.45కి హైదరాబాద్ నుండి బయలుదేరి మద్యాహ్నం 1గంటకి ముంబై రాజ్ భవన్ చేరుకుంటారు,రాత్రి రాజ్ భవన్ లో బస చేసి ఎల్లుండి ఉదయం 10.10కి సయాద్రి గెస్ట్ హౌస్ చేరుకుంటారు. 10.15కి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పద్నవిస్ తో సమావేశం అయి చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేసిన అనంతరం రాజ్ భవన్ చేరుకొని లంచ్ చేసిన అనంతరం మధ్యాహ్నం 2గంటలకి కెసిఆర్ హైదరాబాద్ బయలుదేరుతారు. 

వరంగల్ అంతా గులాబీమయం;మహామహులంత కారులోనే

వరంగల్ అంతా గులాబీమయం;మహామహులంత కారులోనే 

తెలంగాణా పోరుగడ్డ వరంగల్ లో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా గులాబీమయం అయింది. ప్రదాన పార్టీ ల ప్రదాన నాయకులంతా ఇప్పుడు కారులో షికారు చేస్తున్నారు. వరంగల్ గ్రూపు రాజకీయాలన్నీ గులాబి అధినేత కెసిఆర్ కనుసన్నల్లోకి వచ్చారు. ఒకప్పుడు వరంగల్ రాజకీయ ముఖచిత్రం అంటే టిడిపి కడియం వర్గం,ఎర్రబెల్లి వర్గం,కాంగ్రెస్ లో కొండా వర్గం,గండ్ర  వర్గం,బస్వరాజు,రాజయ్య,పొన్నాల   వర్గం ఇలా ఒకరిని మించి ఒకరు మహామహులు ఇదంతా మారింది,తెలంగాణా ఏర్పడ్డాక వరంగల్ రాజకీయ మహామహులంత టిఅరేస్ లోకి చేరారు. కడియం,కొండా,రాజయ్య లు ఎన్నికల ముందే టిఅరేస్ లోకి చేరగా,ఎర్రబెల్లి,సారయ్య లు ఈ మధ్యే కారెక్కారు. ఇప్పుడు పొన్నాల కూడా కారెక్కడానికి సిద్దం అవడంతో వరంగల్ రాజకీయ ముఖ చిత్రం అంటే టిఅరేస్ అనేంతగా మారిపోయింది. ప్రదాన పార్టీల నేతలంత గులాబి గూటిలోనే ఇక ప్రదాన పార్టీల్లో మిగిలింది గండ్ర ఒక్కరే,ఇక మిగిలిన వారిలో సిరిసిల్ల రాజయ్య పొలిటికల్ కెరీర్ అయోమయంలోనే ఉంది. ఇంతమంది ఇన్ని గ్రూపులను ఒకే చూరు కింద నడిపిస్తున్న కెసిఆర్ నాయకత్వం లో వరంగల్ కోట గులాబీల పూదోట లా మారింది. 

మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం 


తెలంగాణా ప్రభుత్వం మార్చ్ 8అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రత్యేక సెలవు ప్రకటించింది.సాలరీ తో కూడిన ప్రత్యేక సెలవు ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణా లో మహిళలకు స్పూర్తిగా నిలిచిన మహిళలకు 8రంగాలలో అవార్డులను ప్రకటించింది 

కారు చక్రాల కింద హస్తం???టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి,పొన్నాల???

కారు చక్రాల కింద హస్తం???టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి,పొన్నాల???

కారు జోరులో హస్తం బేజారుకు రంగం సిద్దం అయింది. ఇప్పటికే వరంగల్ జిల్లా నుండి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టిఅరేస్ లోకి చేరగా ,నర్సంపేట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కారెక్కడానికి సిద్దం అయ్యారు. సారయ్య తో పాటే దొంతి పార్టీ మారతాడని ప్రచారం సాగినా కొన్ని కారణాల వల్ల ఆలస్యం కాగా వరంగల్ మున్సిపల్ ఎన్నికల పలితాల అనంతరం కాంగ్రెస్ మాజీ పీసిసి చీఫ్ తో కలసి కారు ఎక్కనున్నట్లు తెలుస్తుంది. పార్టీ వీడుతున్న పొన్నాలకు ఎమ్మెల్సీ తో పాటు తన కుటుంబంలో ఒకరికి 2019ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విబజన జరిగితే ఎమ్మెల్యే టికెట్ కి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. వీరిద్దరి చేరికతో కాంగ్రెస్ నుండి టిఅరేస్ లోకి వలసల జోరు పెరగనున్నట్లు తెలుస్తుంది. 2019ఎన్నికలకు పార్టీ పటిష్టతకు ఇతర పార్టీలను కాకా వికలం చేయడమే లక్ష్యం గా కెసిఆర్ కదులుతున్నట్లు తెలుస్తుంది. 

సమస్యల సుడిగుండంలో చంద్రబాబు

సమస్యల సుడిగుండంలో చంద్రబాబు 

తెలంగాణాలో టిడిపి ఖాళి అవడంతో ఇక్కడి చానఖ్యం ఆంధ్ర లో వైఎస్ఆర్సిపి పై ప్రయోగించి ఆంధ్రలో లోటు తీర్చుకోవాలనుకుని ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న చంద్రబాబు ను సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి.కేంద్ర బడ్జెట్ లో జైట్లీ ఆంధ్రాకి ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరపకపోవడం,ముగిసిందనుకున్న కాపు రిజర్వేషన్ల గొడవ ముద్రగడ అల్టిమేటం తో మల్లీ మొదలవడం , ఆంధ్ర రాజధాని అమరావతి భూదందాలో టిడిపి మంత్రులు,మంత్రుల బినామీలు,స్వయంగా తన తనయుడి ప్రమేయం ఉన్నట్లు వార్తా కథనాలు రావడం,హైదరాబాద్ లో మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు నిర్భయ యాక్ట్ లో చిక్కుకోవడం,జగన్ అవిశ్వాస తీర్మానం తో టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యే లను ఇరకాటంలో పెట్టి ఉపఎన్నికల దిశగా తీసుకెళ్లాలని యోచన ఇలా ఏది కలిసిరాక సమస్యల సుడిగుండం లో సతమతమవుతున్నారు. ఈ సమస్యల సుడిగుండంలో చంద్రబాబు ఎలా బయటపడతారో. 

కాంగ్రెస్ కి పెద్ద షాక్???కారెక్కనున్న పొన్నాల???

కాంగ్రెస్ కి పెద్ద షాక్???కారెక్కనున్న పొన్నాల???


తెలంగాణాలో టిడిపిని భూస్థాపితం చేసిన కెసిఆర్ చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపు పడింది. ఒక్కొక్క జిల్లాను టార్గెట్ చేస్తూ జిల్లాల్లో కారుకు తిరుగులేకుండా చేయాలన్న లక్ష్యంతో దూసుకెళ్తున్న కెసిఆర్ ఇప్పుడు కాంగ్రెస్ కి షాక్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ మాజీ పీసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ను టిఅరేస్ లోకి చేర్చుకోవడానికి సిద్దం అయితున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న మాజీ మంత్రి పొన్నాల ఇప్పటికే మద్యవర్తుల ద్వారా కెసిఆర్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. రానున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పొన్నాల రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్నట్లు తెలుస్తుంది,కానీ కెసిఆర్ అతనికి ఎమ్మెల్సీ గా అవకాశం అయ్యనున్నట్లు తెలుస్తుంది. వరంగల్ ఎన్నికల పలితాలు వెలువడిన తరువాత పొన్నాల పార్టీ మారడం ఖాయం గా తెలుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి చేరిన కేకే ,డిఎస్ పొన్నాల చేరికలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.