కారు చక్రాల కింద హస్తం???టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి,పొన్నాల???
కారు జోరులో హస్తం బేజారుకు రంగం సిద్దం అయింది. ఇప్పటికే వరంగల్ జిల్లా నుండి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టిఅరేస్ లోకి చేరగా ,నర్సంపేట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కారెక్కడానికి సిద్దం అయ్యారు. సారయ్య తో పాటే దొంతి పార్టీ మారతాడని ప్రచారం సాగినా కొన్ని కారణాల వల్ల ఆలస్యం కాగా వరంగల్ మున్సిపల్ ఎన్నికల పలితాల అనంతరం కాంగ్రెస్ మాజీ పీసిసి చీఫ్ తో కలసి కారు ఎక్కనున్నట్లు తెలుస్తుంది. పార్టీ వీడుతున్న పొన్నాలకు ఎమ్మెల్సీ తో పాటు తన కుటుంబంలో ఒకరికి 2019ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విబజన జరిగితే ఎమ్మెల్యే టికెట్ కి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. వీరిద్దరి చేరికతో కాంగ్రెస్ నుండి టిఅరేస్ లోకి వలసల జోరు పెరగనున్నట్లు తెలుస్తుంది. 2019ఎన్నికలకు పార్టీ పటిష్టతకు ఇతర పార్టీలను కాకా వికలం చేయడమే లక్ష్యం గా కెసిఆర్ కదులుతున్నట్లు తెలుస్తుంది.
No comments:
Post a Comment