రేపే తెలంగాణా టెట్ నోటిఫికేషన్
టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర నిర్ణయంతో గత వారం టెట్ నిర్వహణ వాయిదా వేసిన తెలంగాణా ప్రభుత్వం మరలా టెట్ నిర్వహణకు రంగం సిద్దం చేసింది. రేపు టెట్-2016నోటిఫికేషన్ విడుదల చేయనున్న తెలంగాణా విద్యా శాఖ ఈ నెల 16-31వరకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనుంది. ఏప్రిల్ 20న ఆన్ లైన్ లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కలిపించనున్నారు. టెట్ పరీక్షను మే 1న ఉదయం 9.30-12.30వరకు పేపర్-1,మద్యాహ్నం 2.30-5.30వరకు పేపర్-2 నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment