ముగిసిన మంత్రివర్గ సమావేశం
బడ్జెట్ సమావేశాలపై బాస్ బాద్ షా గైడెన్స్
బడ్జెట్ సమావేశాలపై తెలంగాణా మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈనెల 14న మంత్రి ఈటెల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మూడు గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులు,ఇరిగేషన్ ప్రాజెక్టుల డిజైన్ మార్పు,మహారాష్ట్ర ప్రభుత్వం తో ఒప్పందం పై సుదీర్ఘంగా చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తరుపున ప్రతిపక్షాలను ఎదుర్కోవలసిన తీరు,అసెంబ్లీ జరగవలసిన తీరు,అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగవలసిన తీరు పై చర్చించిన మంత్రివర్గం జలమండలి ,మిషన్ బగీరథలకు నాబార్డు నుండి 1900కోట్ల సహాయం,కొత్త ఐటి పాలసీ,ఆర్టిసీ తీసుకునే 500కోట్ల రూపాయల రుణం పై తెలంగాణా ప్రభుత్వం హామీ,హైదరాబాద్ లో లక్ష సీసీ కెమెరాల ఏర్పాటు కి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
No comments:
Post a Comment