వరంగల్ అంతా గులాబీమయం;మహామహులంత కారులోనే
తెలంగాణా పోరుగడ్డ వరంగల్ లో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా గులాబీమయం అయింది. ప్రదాన పార్టీ ల ప్రదాన నాయకులంతా ఇప్పుడు కారులో షికారు చేస్తున్నారు. వరంగల్ గ్రూపు రాజకీయాలన్నీ గులాబి అధినేత కెసిఆర్ కనుసన్నల్లోకి వచ్చారు. ఒకప్పుడు వరంగల్ రాజకీయ ముఖచిత్రం అంటే టిడిపి కడియం వర్గం,ఎర్రబెల్లి వర్గం,కాంగ్రెస్ లో కొండా వర్గం,గండ్ర వర్గం,బస్వరాజు,రాజయ్య,పొన్నాల వర్గం ఇలా ఒకరిని మించి ఒకరు మహామహులు ఇదంతా మారింది,తెలంగాణా ఏర్పడ్డాక వరంగల్ రాజకీయ మహామహులంత టిఅరేస్ లోకి చేరారు. కడియం,కొండా,రాజయ్య లు ఎన్నికల ముందే టిఅరేస్ లోకి చేరగా,ఎర్రబెల్లి,సారయ్య లు ఈ మధ్యే కారెక్కారు. ఇప్పుడు పొన్నాల కూడా కారెక్కడానికి సిద్దం అవడంతో వరంగల్ రాజకీయ ముఖ చిత్రం అంటే టిఅరేస్ అనేంతగా మారిపోయింది. ప్రదాన పార్టీల నేతలంత గులాబి గూటిలోనే ఇక ప్రదాన పార్టీల్లో మిగిలింది గండ్ర ఒక్కరే,ఇక మిగిలిన వారిలో సిరిసిల్ల రాజయ్య పొలిటికల్ కెరీర్ అయోమయంలోనే ఉంది. ఇంతమంది ఇన్ని గ్రూపులను ఒకే చూరు కింద నడిపిస్తున్న కెసిఆర్ నాయకత్వం లో వరంగల్ కోట గులాబీల పూదోట లా మారింది.
No comments:
Post a Comment