ADD

Saturday, 20 February 2016

వైద్య,ఆరోగ్య శాఖ ప్రక్షాళన,బడ్జెట్ కేటాయింపులపై కెసిఆర్ సమీక్ష

వైద్య,ఆరోగ్య శాఖ ప్రక్షాళన,బడ్జెట్ కేటాయింపులపై కెసిఆర్ సమీక్ష 

తెలంగాణాలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ మెరుగుపరిచి,ప్రక్షాళన చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించుటకు వైద్య,ఆరోగ్య శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి కెసిఆర్ తన అధికారిక నివాసంలో మంత్రి లక్ష్మారెడ్డి ,అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కెసిఆర్ మాట్లాడుతూ వైద్య,ఆరోగ్య శాఖ బలోపేతానికి ఎన్ని నిదులుకావలన్న కేటాయిస్తానని,వరంగల్ హెల్త్ యునివర్సిటీ పరిదిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి,మెడికల్ కాలేజీ ని ప్రస్తుతం సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో నిర్మించాలని,ప్రతి జిల్లాలో 4చోట్ల,మొత్తం 40చోట్ల ప్రభుత్వ ఎంఆర్ఐ,సిటీ స్కాన్,ఆల్ట్రా సౌండ్ ,మెమో గ్రామ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని,కరీంనగర్,సూర్యాపేట,ఖమ్మం ఆస్పత్రులను అప్ గ్రేడ్ చేసి కొత్త భవనాలను నిర్మించాలని,108,104సేవలను మెరుగుపరిచేందుకు ప్రణాళిక రూపొందించాలని ,హై వే ల వెంట ట్రామా కేర్ కేంద్రాలను ప్రారంబించాలని,హైదరాబాద్ లో మరో 4వెయ్యి పడకల ఆస్పత్రిలను ఏర్పాటు చేయాలని ,ఉప్పల్-ఎల్ బి నగర్ ,మల్కాజ్గిరి -కంటోన్మెంట్,కూకట్ పెల్లి -కుత్బుల్లాపూర్ పరిదిలో వెయ్యి పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని,కింగ్ కోఠి ఆస్పత్రిని వెయ్యి పడకల ఆస్పత్రి గా మార్చాలని,ప్రభుత్వ ఆస్పత్రులు కార్పోరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దేందుకు అనువైన ప్రణాలికను రూపొందించాలని కెసిఆర్ పేర్కొన్నారు. 

దేశంలోనే తొలిసారి ఫోన్ టు వోట్ టోల్ ఫ్రీ ఇన్ మహబూబ్ నగర్

దేశంలోనే తొలిసారి ఫోన్ టు వోట్ టోల్ ఫ్రీ ఇన్ మహబూబ్ నగర్ 

దేశంలోనే తొలిసారి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఫోన్ టు వోట్ టోల్ ఫ్రీ నంబర్ ని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఎంపి జితేందర్ రెడ్డి. ప్రజలు తమ సమస్యలను ప్రజాప్రథినిదులకు తెలియజేయటానికి వీలుగా 8333006060 నంబర్ ని ప్రారంబించారు ఎంపి జితేందర్ రెడ్డి. ఈ విధానంతో ప్రజల సమస్యను తెలుసుకోవడం,పరిష్కరించడం లో కొత్తగా ముందుకు వెళ్ళాలనే ఉదేశం తో తెచ్చిన ఈ ఫోన్ టూ వోట్ విజయవంతం అయితే తెలంగాణా వ్యాప్తంగా ప్రారంబించడానికి కృషి చేస్తానని తెలిపారు. 

తెలంగాణాలో 'బతుకమ్మ' గా కేరళ 'కుటుంబ శ్రీ' పథకం ???

తెలంగాణాలో 'బతుకమ్మ' గా కేరళ 'కుటుంబ శ్రీ' పథకం ???


తెలంగాణాలో మహిళల సాదికారత ,పేదరిక నిర్మూలనకు తెలంగాణా ప్రభుత్వం మహిళల కోసం బతుకమ్మ అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తుంది. కేరళలో విజయవంతంగా కొనసాగుతున్న కుటుంబ శ్రీ కార్యక్రమ స్పూర్తితో ప్రవేశపెట్టనున్న ఈ పథక రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీనిది బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందం కేరళలో అధ్యయనానికి వెళ్ళింది. ఈ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణా ప్రభుత్వ గ్రామినాభివ్రుద్ది శాఖ అధ్యయనం చేసి ఈ కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేయనుంది. 

వలస కార్మికులకు తెలంగాణా ప్రభుత్వ శుభవార్త;దుబాయ్ లో నాయిని నరసింహారెడ్డి

వలస కార్మికులకు తెలంగాణా ప్రభుత్వ శుభవార్త;దుబాయ్ లో నాయిని నరసింహారెడ్డి 

తెలంగాణా నుంచి గల్ఫ్ బాట పడుతూ ఏజంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ లో అష్ట కష్టాలు పడే వారికి ఇకపై ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణా ప్రభుత్వం తమవంతు ప్రయత్నాలు చేస్తుంది,ఇందులో బాగంగా తెలంగాణా హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి దుబాయ్ పర్యటనకి వెళ్లాడు. ఈ పర్యటనలో బాగంగా సోనాపూర్ క్యంపులోని తెలంగాణా కార్మికులను నిన్న కలిసారు. తెలంగాణా విదేశీ మానవవనరుల సంస్థ(టామ్ కామ్)ద్వారా విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ దేశాలకు అవసరమైన నైపుణ్యమున్న యువకులకు తెలంగాణా ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పించేందుకు గల్ప్ సంస్థలకు ,కార్మికులకు వారదిలా పనిచేయనుంది. ఇకపై గల్ప్ దేశాలకని ఏజంట్ల చేతిలో మోసపోయి గల్ప్ దేశాల్లో మగ్గిపోకుండా తెలంగాణా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 

1000ఏఈవో పోస్టుల బర్తీకి గ్రీన్ సిగ్నల్;వారం రోజుల్లో నోటిఫికేషన్

1000ఏఈవో పోస్టుల బర్తీకి గ్రీన్ సిగ్నల్;వారం రోజుల్లో నోటిఫికేషన్ 

గతంలోనే ఆర్ధిక శాఖ ,ముఖ్యమంత్రి ఆమోదం పొంది కొన్ని సాంకేతిక సమస్యలతో ఆపేసిన వ్యవసాయ విస్తరణ అధికారులు బర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే 1000ఏఈవో పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ పోస్టుల్లో 20%ఉద్యానవన శాఖకు కేటాయించారు. గతంలో సమస్య తలెత్తిన రిజర్వేషన్ విధాన సమస్యను పరిష్కరించి నోటిఫికేషన్ వెలువరించడానికి టిఎస్.పి.ఎస్.సి సిద్దమైంది. వీటితోపాటు వ్యవసాయ పాలిటెక్నిక్ ,ఇంజనీర్ల పోస్టుల బర్తీకి సర్కారు కసరత్తు మొదలెట్టింది. 

సివిల్స్ మెయిన్స్ పలితాలు విడుదల;ఇంటర్వ్యూకి ఎన్నికైన 1000మంది తెలుగు అభ్యర్థులు

సివిల్స్ మెయిన్స్ పలితాలు విడుదల;ఇంటర్వ్యూకి ఎన్నికైన 1000మంది తెలుగు అభ్యర్థులు 

ప్రతిష్టాత్మక ఇండియన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పలితాలను యుపిఎస్సీ విడుదల చేసి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాభితాను యుపిఎస్సి వెబ్ సైటులో ఉంచారు .ఈ మెయిన్స్ పరీక్షలో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు రాణించారు. సివిల్స్ మెయిన్స్ లో ప్రతిభ చూపి 1000మంది తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులు,ఇంటర్వ్యూ వివరాలను వెబ్ సైట్ లో పొందుపరిచారు. 

టిఆర్ఎస్,టిడిపి జోడెడ్ల మధ్య కాడి లా బిజెపి

టిఆర్ఎస్,టిడిపి జోడెడ్ల మధ్య కాడి లా బిజెపి 

అటు ఆంధ్రప్రదేశ్ లో టిడిపి అధినేత చంద్రబాబు ,ఇటు తెలంగాణాలో టిఅరేస్ అధినేత కెసిఆర్,ఈ ఇద్దరు చంద్రుల మధ్య బిజెపి. గత ఎన్నికల్లో బిజెపితో పొత్తుతో ఆంధ్రలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తెలంగాణాలో మాత్రం ఘోర పరాజయం చవి చూసింది,అటు ఆంధ్ర ,ఇటు తెలంగాణాలో బిజెపి మాత్రం వ్యక్తిగతంగా పుంజుకోలేదు,ఆంధ్రలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండగా,తెలంగాణాలో టిడిపి తో ఉప ఎన్నికలు,ఏమ్మేల్చి ఎన్నికలు,గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి పరాజయాల బాటను వీదలేకపోయింది. దీంతో గత వారం కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో బాగంగా తెలంగాణాలో టిఅరేస్ తో పొత్తుకు మోడీ,కెసిఆర్ లు అవగాహన కుదుర్చుకుని వచ్చే మంత్రివర్గ విస్తరణలో కేంద్ర మంత్రివర్గంలోకి టిఅరేస్ చేరితే,రాష్ట్ర మంత్రివర్గంలో బిజెపి కి చోటు కల్పించడానికి అవగాహన కుదిరింది ,అందులో బాగంగానే మొన్న తెలంగాణా బిజెపి నేతలు ఇకపై టిడిపి తో పొత్తు కుడురదంటు కేంద్రానికి తీర్మానం పంపింది. అటు ఆంధ్రలో టిడిపి తో పొత్తుతో,ఇటు తెలంగాణాలో పొత్తుతో రెండు ప్రభుత్వాలలో బాగస్వామి అయి ,కేంద్రంలో ఈ రెండు పార్టీలకు మంత్రివర్గంలో చోటిచ్చి జోడెడ్ల మధ్య కాడిలా బిజెపి ఎంత సమన్వయం కుడుర్చుకుంటుందో....... 

Friday, 19 February 2016

వేడెక్కుతున్న తమిళ రాజకీయాలు;జయమ్మ పై పోటీకి సిద్దమంటున్న నగ్మ

వేడెక్కుతున్న తమిళ రాజకీయాలు;జయమ్మ పై పోటీకి సిద్దమంటున్న నగ్మ 


తమిళ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి,ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ పొత్తులు,పోటీలు, మంతనాలతో  ఇప్పుడే వేసవిని తలపిస్తున్నాయి. ఇప్పటికే డీఎంకె తో పొత్తుకు సిద్దమైన కాంగ్రెస్,ఒంటరి పోరుకు సిద్దం గా ఉన్న ఏఐడిఎంకె,ఇప్పటికే కాంగ్రెస్ అస్త్రాలు సిద్దం చేసుకుంటూ ఉండగా జయమ్మ కు సినీ నటి సవాల్ విసిరింది. అధిష్టానం ఆదేశిస్తే జయమ్మ పై పోటీకి సిద్దమని ప్రకటించి హైప్ క్రియేట్ చేసింది. వేసవి లో జరగనున్న తమిళనాడు ఎన్నికలు రానున్న రోజుల్లో ఇంకా హీట్ పెంచానున్నాయి. 

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు 

గత నెల రోజులుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్టాక్ మార్కెట్ ఈరోజు స్వల్ప లాభాలతో ముగిసాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 59పాయింట్ల లాభంతో 23709 పాయింట్లు,నిఫ్టీ 19పాయింట్ల లాభంతో 7210వద్ద ముగిసాయి. యురోపియన్ మార్కెట్లు పుంజుకున్తాయన్న పాజితివ్ దృక్పథంతో ఇండియన్ మర్కెట్స్ కోలుకున్నాయి. 

జనసంద్రమైన మేడారం;మేడారానికి విఐపి ల తాకిడి

జనసంద్రమైన మేడారం;మేడారానికి విఐపి ల తాకిడి 

మేడారం జనసంద్రంలా మారింది. మూడోరోజు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ ఒక్కరోజే సమ్మక్క,సారలమ్మలను సుమారుగా 50లక్షల మంది దర్శించుకున్నారు.మేడారం జాతరకు పెద్ద ఎత్తున భక్తుల రాకతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేసారు. ఈరోజు మేడారానికి విఐపి ల తాకిడి పెరిగింది,తెలంగాణా మంత్రులు మహిందర్ రెడ్డి ,కేటిఅర్ ,డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి,ఎమ్మెల్యే లు బాబు మోహన్ ,హిందూపూర్ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ,ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి దేవతలను దర్శించుకున్న వారిలో ఉన్నారు. 

మదికొండలో ఐటి ఇంక్యుబెషన్ హబ్ శంకుస్థాపన

మదికొండలో ఐటి ఇంక్యుబెషన్ హబ్ శంకుస్థాపన 

తెలంగాణాలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటి పరిశ్రమ విస్తరణకు బీజం వేస్తు వరంగల్ మడికొండ ఐటి సెజ్ లో ఇన్ఫోటెక్ సెయింట్ ఐటి ఇంక్యుబెషన్ టవర్ కి శంకుస్థాపన చేసారు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటిఅర్. త్వరలోనే వరంగల్ ,కరీంనగర్ వంటి నగరాలకు రెండు ఐటీ కంపెనీలు రానున్నాయని,కొద్దిరోజుల్లోనే వరంగల్ ఇంక్యుబెషన్ హబ్ ద్వారా వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ -వరంగల్ కారిడార్ ని ఐటీ కారిడార్ గా తీర్చిదిద్దుతామన్నారు. 

చంద్రబాబు కి షాక్ ఇవ్వనున్న జగన్;వైసిపి లోకి డొక్కా మాణిక్య వరప్రసాద్??

చంద్రబాబు కి షాక్ ఇవ్వనున్న జగన్;వైసిపి లోకి డొక్కా మాణిక్య వరప్రసాద్??

తెలంగాణా లో టిడిపి కుదేలవగా ఆ లోటును ఆంధ్రలో తీర్చుకోవాలని బావించి వైసిపి ఎమ్మెల్యే లను టిడిపిలోకి లాగడానికి ప్రయత్నిస్తుంటే జగన్ కూడా టిడిపి అధినేత చంద్రబాబు కి షాక్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.రెండు రోజుల క్రితం బాబుపై నిప్పులు చెరుగుతూ టిడిపి ఎమ్మెల్యే లు తమతో టచ్ లో ఉన్నారని ఎన్నికలకు సవాల్ విసిరిన జగన్ మొదటగా 2014ఎన్నికల్లో టిడిపి లో చేరిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను వైసిపి లోకి చేర్చుకునేందుకు రంగం సిద్దం చేసారు. ఇంకా టిడిపి లో అసంతృప్తి తో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. తెలంగాణాలో కెసిఆర్,చంద్రబాబు,జగన్ ల ఆకర్ష్ ఆట రెండు రాష్ట్రాల ప్రజలకు వినోదాన్ని కలిగిస్తుంది . 

మరో 332 ఎస్సై పోస్టులకు తెలంగాణా పోలిస్ శాఖ నోటిపికేషన్

మరో 332 ఎస్సై పోస్టులకు తెలంగాణా పోలిస్ శాఖ నోటిపికేషన్ 

తెలంగాణా పోలీస్ శాఖా మరో 332ఎస్సై పోస్టులకు నోటిపికేషన్ జారీ చేసింది. కమ్యునికేషన్ విబాగానికి చెందిన ఎస్సై ల పోస్టుల బర్తీ కి ఈ నెల 25-మార్చ్ 15వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలంగాణా పోలిస్ శాఖ తెలిపింది . దరఖాస్తులను www.tslprb.in లో స్వీకరించనున్నట్లు నోటిపికేషన్ లో పేర్కొన్నారు. మిగితా వివరాలకు వెబ్ సైట్లో చూడొచ్చు. 

కెసిఆర్ బాటలో చంద్రబాబు;వైఎస్ఆర్సిపి కి భూమాన షాక్???

కెసిఆర్ బాటలో చంద్రబాబు;వైఎస్ఆర్సిపి కి భూమాన షాక్???

తెలంగాణాలో కెసిఆర్ దెబ్బకు కుదేలైన చంద్రబాబు తెలంగాణాలో కెసిఆర్ నేర్పిన పాఠాన్ని ఆంధ్రాలో వైసిపి పై ప్రయోగిస్తున్నారు. కెసిఆర్ దెబ్బకు తెలంగాణాలో టిడిపి ఖాళి అయినట్టు అక్కడ వైసిపి ని టార్గెట్ చేసి కర్నూల్ నేత ఎమ్మెల్యే భూమ నాగిరెడ్డి ,అయన కుమార్తె ఎమ్మెల్యే అఖిల ప్రియ ను టిడిపిలోకి చేర్చుకోడానికి రంగం సిద్దం చేసారు. వీరిరువురిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. భూమాన తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా టిడిపి మంత్రులు మాతో 20మంది వైసిపి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని వస్తున్న ఉహాగానాలలొ వైసిపి కి తొలి షాక్ తగిలింది. భూమన,అఖిలప్రియ తో ఇంకా ఎంతమంది టిడిపి లో చేరతారో సాయంత్రానికి స్పష్టత రానుంది. 

త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డి???

త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డి???


బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అంబర్పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి కి త్వరలో మంత్రిపదవి దక్కనుంది. గతవారం ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డియే ప్రభుత్వంలో చేరి కేంద్ర మంత్రివర్గంలో చేరుటకు ప్రదాని మోడీ తో చర్చించిన కెసిఆర్  చర్చలకు అనుగుణంగా రాష్ట్రంలో మంత్రివర్గం లో బిజెపి తరుపున కిషన్ రెడ్డికి మంత్రిపదవి ఇయ్యనున్నట్లు టిఅరేస్ వర్గాలు అంటున్నాయి. టిఅరేస్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే కిషన్ రెడ్డి ని మంత్రివర్గంలోకి తీసుకుంటే బవిష్యత్ లో అతని విమర్శలకు చెక్ పెట్టొచ్చని తెలుస్తుంది . అయితే త్వరలో జరగబోయే ఖమ్మం ,వరంగల్ మున్సిపల్ ఎన్నికల అనంతరం మంత్రి పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు కట్టపెట్టి మంత్రివర్గ విస్తరణ జరపాలని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. 

సుప్రీంలో విద్యార్థి నేత కన్హయ్య బెయిల్ పిటీషన్ తిరస్కరణ

సుప్రీంలో విద్యార్థి నేత కన్హయ్య బెయిల్ పిటీషన్ తిరస్కరణ 

జెఎన్ యు విద్యార్థి నేత కన్హయ్య కుమార్ బెయిల్ పిటీషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కన్హయ్య కుమార్ బెయిల్ పిటీషన్ స్వీకరించలేమని ,సంబందిత హై కోర్టు ను సంప్రదించాలని కన్హయ్య కుమార్ కి సుప్రీం కోర్టు సూచించింది. అలాగే కన్హయ్య కుమార్ కి బద్రత కల్పించాలని సుప్రీం పోలీసులకు ఆదేశాలిచ్చింది.ఇదిలా ఉండగా కన్హయ్య కుమార్ కి మద్దతుగా దేశవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు మద్దతులు తెలుపుతూ నిరసనలు కొనసాగిస్తున్నారు. 

సెంట్రల్ యునివర్సిటీలపై 207అడుగుల ఎత్తులో మువ్వన్నెల రెపరెపలు

సెంట్రల్ యునివర్సిటీలపై 207అడుగుల ఎత్తులో మువ్వన్నెల రెపరెపలు 

విద్యార్థుల్లో అడుగంటుతున్న జాతీయతను తట్టిలేపెందుకు ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో 207అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగరెలా చేయాలని నిర్ణయించారు. నిన్న సూరజఖండ్ లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరాని నేతృత్వంలో జరిగిన వీసిల సమావేశం లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అన్ని యూనివర్సిటీల్లో త్రివర్ణ పతాకం ఎగురుతున్నప్పటికీ వాటితోపాటు 46సెంట్రల్ యూనివర్సిటీల్లో సమాన ఎత్తులో త్రివర్ణ పతాకం ఎగురవేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తుండగా ,రాజకీయ పార్టీలు కొన్ని వ్యతిరేకిస్తున్నాయి 

వరంగల్ లో టి హబ్ కేంద్రం;తెలంగాణాలో ఐటి విస్తరణ దిశగా అడుగులు

వరంగల్ లో టి హబ్ కేంద్రం;తెలంగాణాలో ఐటి విస్తరణ దిశగా అడుగులు 


హైదరాబాద్ కేంద్రంగా విస్తరించిన ఐటి రంగాన్ని తెలంగాణాలో ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడానికి తెలంగాణా ప్రభుత్వం ,ఐటి శాఖ మంత్రి కేటిఅర్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు,ఇందులో బాగంగా త్వరలోనే వరంగల్ లోని ఎన్ఐటి లో సైయేంట్ ఇంక్యుబేటర్ సెంటర్ కి శంకుస్థాపన చేయనున్నారు. ఐటి సంస్థలు హైదరాబాద్ వీడటానికి ఆశక్తి చూపించానప్పటికి కేటిఅర్ ఐటి దిగ్గజాలను ఒప్పించి ఐటి సంస్థలకు రాయితీలు కల్పిస్తూ కరీంనగర్ ,వరంగల్ కేంద్రాలకు విస్తరించాలని చూస్తున్నారు. హైదరాబాద్ లో  నవంబర్ లో ప్రారంబించిన టి-హాబ్  విజయవంతం అవటంతో టి -హబ్ కేంద్రాన్ని వరంగల్ లో ఏర్పాటు చేయటానికి సిద్దమవుతున్నారు. 

హైదరాబాద్ లో ఎంబ్రి రిడిల్ ఏరోనాటికల్ విశ్వ విద్యాలయ కేంద్రం

హైదరాబాద్ లో ఎంబ్రి రిడిల్ ఏరోనాటికల్ విశ్వ విద్యాలయ కేంద్రం 


అంతర్జాతీయ ఐటి దిగ్గజాలు గూగుల్ ,మైక్రోసాఫ్ట్ ,ఆపిల్ సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తుండగా ఇప్పుడు అంతర్జాతీయ ఏరోనాటిక్స్ దిగ్గజం 'ది హార్వర్డ్ ఆఫ్ ది స్కై' గా పేరుగాంచిన ప్రపంచ ప్రఖ్యాత 'ఎంబ్రి రిడిల్ ఏరోనాటికల్ విశ్వ విద్యాలయం' తన కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చింది. సింగపూర్ లో జరుగుతున్న ఎయిర్ షో సందర్బంగా ఈరోజు ఒప్పందం కుదుర్చుకోనుంది. ఫ్లోరిడా కేంద్రంగా ఉన్న ఏఆర్ ఏయు గత కొన్ని సంవత్సరాలుగా చాల దేశాల్లో ఆన్ లైన్ కోర్సులను నిర్వహించిన ఈ విశ్వవిద్యాలయం ఇటీవలే సింగపూర్ లో తన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయదలచి ప్రపంచస్థాయి నగరాలన్నిటిని పరిశీలించి ఏరో స్పేస్ ,విమానాలా విడి బాగాల తయారీ హబ్ గా మారిన హైదరాబాద్ లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయుటకు మొగ్గు చూపింది. హైదరాబాద్ లో ఏరోస్పేస్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుండటంతో ఇందుకు కావలసిన మానవవనరుల నైపుణ్యాలను అందించుటకు 'తెలంగాణా విజ్ఞాన నైపున్యాభివ్రుద్ది సంస్థ' తో ఒప్పందం కుదుర్చుకోనుంది.  

వరంగల్ కోటలో టిఆర్ఎస్ మూడుముక్కలాట

వరంగల్ కోటలో టిఆర్ఎస్ మూడుముక్కలాట 

టిడిపి నుండి వలసలతో టిఆర్ఎస్ రోజురోజుకు పటిష్ట పునాదులు వేసుకుంటూ బలపడుతున్న పార్టీలో చేరుతున్న కొందరు వ్యక్తులతో జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ టిఆర్ఎస్ లో ఇప్పుడు మూడుముక్కలాట నడుస్తుంది ఒకప్పుడు వివిద పార్టీల్లో కీలక వ్యక్తులుగా ఉంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ ఉన్న వరంగల్ పై పట్టు సాదించినవారు ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరి వరంగల్ రాజకీయాన్ని ఆసక్తి గా మార్చారు. గతంలో ఎర్రబెల్లి-కొండ సురేఖ,ఎర్రబెల్లి-కడియం,కడియం-కొండా సురేఖ,కడియం-రాజయ్య వర్గాలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునేవారు అంత ఇప్పుడు ఒక్కచోట చేరేసారు. వీరి చేరికతో పార్టీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా కెసిఆర్ ముందునుంచే ప్రణాళిక రచించి అదేవిదంగా మున్దుకెల్లారు. ఒకప్పుడు రాజయ్య -కడియం ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేస్తూ ప్రత్యర్థులుగా ఉన్న వారిని ఒకరికి స్టేషన్ ఘన పూర్ నుండి ఎమ్మెల్యే గా అవకాశం ఇచ్చిన కెసిఆర్ కడియం ను వరంగల్ ఎంపి గా గెలిపించినా ,తదుపరి పరిణామాలతో ఎలాంటి ఇబ్బందిరాకుండా కడియం ను మంత్రి వర్గంలోకి తీసుకుని ఎమ్మెల్సి గా అవకాశం ఇచ్చి చాకచక్యంగా వ్యవహరించారు.గతంలో పరకాల నుండి ప్రాతినిద్యం వహించిన సురేఖను పార్టీలో చేరుకొని సురేఖ ను వరంగల్ తూర్పు నుండి గెలిపించి,కొండ మురళికి హామీ ప్రకారం ఎమ్మెల్సి గా అవకాశం కలిపించారు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ లో చేర్చుకుని ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా కెసిఆర్ రచించిన చక్రవ్యూహానికి ఇప్పుడు టిఆర్ఎస్ మూడు ముక్కలాట వరంగల్ విజయాల బావుటాగా మారింది. 

తెలంగాణాలో టిడిపి తో బిజెపి కటీప్;రాష్ట్ర మంత్రివర్గంలోకి బిజెపి???

తెలంగాణాలో టిడిపి తో బిజెపి కటీప్;రాష్ట్ర మంత్రివర్గంలోకి బిజెపి???

తెలంగాణా లో టిడిపి తో బిజెపి పొత్తు తెగదెమ్పులకు రంగం సిద్దం అయింది. నిన్న జరిగిన బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గం తెలంగాణాలో పార్టీ బలపడాలంటే టిడిపి తో పొత్తు ఇకపై ఉండకూడదని,టిడిపి తో పోత్తులవల్ల పార్టీ బలహీనపడుతూ పార్టీ కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెల్లుతున్నారని నిర్ణయించిన కార్యవర్గం టిడిపి తో ఇక పొత్తుకు స్వస్తి చెప్పాలని తీర్మానం చేసి కేంద్ర పార్టీ కార్యవర్గానికి తమ నిర్ణయాన్ని తెలియజేసారు. ఇదంతా గత వారంలో కెసిఆర్ మోడీ ,కేంద్రమంత్రులతో బేటీ కి అనుగుణంగా కేంద్ర బిజెపి ఆదేశాలమేరకే సాగుతున్నట్లు తెలుస్తుంది. టిడిపి తో తెగదెంపుల అనంతరం రాబోయే మంత్రి వర్గ విస్తరణలో టిఅరేస్ మంత్రివర్గంలోకి బిజెపి కి చోటు కల్పించనున్నట్లు తెలుస్తుంది. త్వరలో బిజెపి కొత్త అధ్యక్షుడిగా లక్ష్మణ్ లేదా రామచంద్రారెడ్డి లలో ఒకరికి అవకాశం కల్పించి కిషన్ రెడ్డి కి మంత్రివర్గంలో స్థానం ఇయ్యనున్నట్లు తెలుస్తుంది. 

Thursday, 18 February 2016

గ్రేటర్ అబివృద్ది కి కెటిఅర్ 100రోజుల ప్రణాళిక

గ్రేటర్ అబివృద్ది కి  కెటిఅర్ 100రోజుల ప్రణాళిక 

జిహెచ్ఎంసి ఎన్నికల ఘన విజయం అనంతరం పురపాలక శాఖ బాద్యతలు చేపట్టిన కేటిఅర్ ఎన్నికల హామీలను అమలుపరుచుటకు గ్రేటర్ అభివృద్దిపై ఈరోజు జరిపిన సమీక్షలో 100రోజుల ప్రణాళికను ప్రకటించారు.ఇందులో బాగంగా రానున్న 100రోజుల్లో గ్రేటర్ పాలనలో పారదర్శకత పెంపొందించుటకు ఈ-ఆఫీసు ద్వారా ఆన్ లైన్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు,గ్రేటర్ పరిదిలో అన్ని అనుమతులు ఆన్ లైన్ లోనే ఇచ్చేలా ఏర్పాటు ,భవన నిర్మాణ,రియల్ ఎస్టేట్ లే ఔట్ అనుమతులు 30రోజుల్లో పొందేలా ఏర్పాట్లు ,వార్డ్ ,ఏరియా కమిటీల ఏర్పాటు,గ్రేటర్ పరిదిలో 40కోట్లతో 32వేల నల్లా కనెక్షన్లు ,10శ్మశాన వాటికలు ,200కోట్లతో 599బీటీ రోడ్లు ,100రోజుల్లో మహిళా సంఘాలకు 100కోట్ల రుణాలు ,గ్రేటర్ పరిదిలో 3.5కోట్ల మొక్కల పంపిణీ ,పార్కులు ,ఇంకుడు గుంతల నిర్మాణం చేయనున్నారు. 

రియో ఒలంపిక్స్ పై సానియా దృష్టి ;రోహన్ బోపన్నతో బరిలోకి???

రియో ఒలంపిక్స్ పై సానియా దృష్టి ;రోహన్ బోపన్నతో బరిలోకి???

కెరీర్ లోనే అత్యున్నత పామ్ లో ఉన్న తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా ఆగష్టు లో జరగబోయే రియో ఒలంపిక్స్ పై దృష్టి సారించింది. గత ఒలంపిక్స్ లో వివాదాల నడుమ లియాండర్ పేస్ తో మిక్స్డ్ డబుల్స్ బరిలో దిగిన సానియా నిరాశతో వెనుదిరిగింది. అయితే ఈ సారి సానియా రోహన్ బోపన్నతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పామ్ దృష్ట్యా ఈసారి సానియాపై అంచనాలు పెరిగిపోతుండటం తో ఒలంపిక్స్ కి ముందు తనతో జోడీ కట్టే ఆటగాడితో ఏదైనా ఒక టోర్నీ లో పాల్గొంటే ఇద్దరిమద్య సమన్వయం పెరిగి ఒలంపిక్స్ పతకం సాదించడం సులువవుతుందని భావిస్తున్న సానియా తన జోడీ ఎవరో త్వరలోనే తేల్చుకోనుంది . 

గద్దెనెక్కిన సమ్మక్క;జనసంద్రమైన మేడారం

గద్దెనెక్కిన సమ్మక్క;జనసంద్రమైన మేడారం 

తెలంగాణా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో చిలకలగుట్టనుంచి మేడారం చేరుకున్న సమ్మక్కకు స్వాగతం పలకగా కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు తీసుకురాగా ఎస్పీ దుగ్గల్ అధ్వర్యంలో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరుపుతూ సమ్మక్కను గద్దెనెక్కించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తరుపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి ,చందూలాల్ ,ఎంపి సీతారం నాయక్ హాజరుకాగా ,మహిళల పూనకాలు,సంప్రదాయ నృత్యాలు,అశేష భక్త జనసందోహంతో మేడారం పులకించిపోయింది. సారలమ్మ ,సమ్మక్క గద్దె చేరడంతో దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పటివరకు మేడారం దర్శించుకున్న భక్తుల సంఖ్య కోటి దాటినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు భక్తుల రద్దీ మరింత పెరుగుతున్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 

'రైతే రాజు' లక్ష్యంగా కెసిఆర్ సుదీర్ఘ సమీక్ష

'రైతే రాజు' లక్ష్యంగా కెసిఆర్ సుదీర్ఘ సమీక్ష 

తెలంగాణా రైతన్నను ఆదుకుని రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ న్యాక్ లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇన్ని రోజులు మూస పద్దతిలో వ్యవసాయ రంగానికి అరకొర నిధులు కేటాయిస్తూ రైతన్నను నిర్లక్ష్యం చేసిన గత పాలకులకు బిన్నంగా మూస పద్దతిలో కాకుండా ఆత్మీయ పద్దతిలో ప్రణాళిక సిద్దం చేయాలని కెసిఆర్ సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ రైతన్నకు మార్కెట్ ,అవసరాలకు,డిమాండు కు అనుగుణంగా పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని,వ్యవసాయ శాఖ,ఉద్యానవన శాఖ ,వ్యవసాయ యునివర్సిటీ మద్య సమన్వయం తో ముందుకెళ్ళాలని,రాష్ట్రంలో గ్రీన్ హౌస్ కల్టివేషన్ ,మైక్రో ఇరిగేషన్ పెరగాలని,రాష్ట్రానికి ఎన్ని విత్తనాలు కావాలి ,ఎంత విత్తనోత్పత్తి జరుగుతుంది ,రాష్ట్రంలో ఇంకా ఎంత విత్తన ఉత్పత్తి చేయగలమో పరిశోధనలు జరిపి ,మన రాష్ట్రంలో అనేక విత్తనోత్పత్తి సంస్థలు ఉన్న దృష్ట్యా ,తెలంగాణా సీడ్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ వారితో సమన్వయంతో కదులుతూ విత్తనోత్పత్తి ప్రణాలికలు రూపొందించి కొత్త వంగడాలను రూపొందిస్తూ తెలంగాణాను ప్రపంచ విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలి,రాష్ట్రంలో వర్షపాతం కి అనుగుణంగా పంట ప్రణాళికలను ఎప్పటికప్పుడు సిద్దం చేస్తూ రైతులకు ప్రణాళికలకు అనుగుణంగా పంటలు వేసే విదంగా అవగాహన పెంచాలని ,తెలంగాణా కి అవసరమైన కూరగాయల సాగును పెంచాలని,తెలంగాణా భూములు పసుపు ,మిర్చి ,అల్లం సాగుకు అనువైనవి కనుక రైతులకి ఈ పంటలపై అవగాహన పెంచుతూ ,రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ,సేంద్రీయ ఎరువులు వాడేలా చర్యలు తీసుకోవాలని ,తెలంగాణాలో పత్తి పంట అధికంగా సాగుచేస్తూ నష్టపోతున్న రైతులను లాభసాటిగా ఉండే మొక్కజొన్న ,సోయా సాగుకు మున్డుకొచ్చేల అవగాహన కల్పించాలని,రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచాలని,వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచేలా ప్రణాళికలు సిద్దం చేయాలని కెసిఆర్ సూచించారు. 

నా యువ భారత సారదులు,రథసారదుల్లారా....!

నా యువ భారత సారదులు,రథసారదుల్లారా....!

నా యువ భారత సారదులు,రథ సారదుల్లారా....!బావి భారత ప్రగతిరథ చక్రాలైన యువతీ,యువకుల్లారా....!మనమంతా భారతీయులం,భరతమాత ముద్దుబిడ్డలం అని బావించి భారతావనిని ముందుకు నడిపించాల్సిన మనం కులం ,మతం ,ప్రాంతాల పేరుతో విడిపోయి ,ఎవరికి వారే యమునా తీరే అన్న విదంగా వ్యవహరిస్తున్నాం. ఈ దేశం నాకేమిచ్చింది?ఇది నా హక్కు ?అని అంటున్న మనం ప్రజాస్వామ్యం మనకిచ్చిన ఓటుహక్కు,రాజ్యాంగం మనకు సూచించిన విదులు,బాధ్యతలను మాత్రం పక్కనపెట్టాం,సమాజంలో అవినీతి పెరుగుతుంది అంటూ విమర్శించే మనమే ఏదైనా పని ఉండి ప్రభుత్వ కార్యాలయాలకి వెలితే అధికారులకు లంచం ఇచ్చి క్షణాల్లో పనిపూర్తి చేసుకుని అవినీతికి ఆజ్యం పోస్తున్నాం. సమాజంలో మార్పు రావాలని కోరుకునే మనం ఆ మార్పుని మననుండి ఆశించం ,పైగా మనమే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం,మలమూత్ర విసర్జన ,మద్యపానం వంటి కార్యకలాపాలు కొనసాగిస్తాం ,నిబందనలను నిర్లక్ష్యంతో అతిక్రమిస్తాం. హక్కులు ,రిజర్వేషన్లు,రీయంబర్స్మెంట్లు అడిగే మనం ప్రజాస్వామ్యాన్ని నడిపించే నాయకులను ఎన్నుకోడానికి ఓటు వేయడానికి ముందుకురాము. ప్రభుత్వ ఉద్యోగాలకి పోటీ పడే మనం ప్రభుత్వ పాటశాల లు,కళాశాలల్లో చదవడానికి ఇష్టపడం. భావి భారత భవిత నిర్నేతలం అయిన మనం వ్యవహరించాల్సిన తీరు ఇదేనా ???నా యువ భారత యువతీ యువకుల్లారా మన భారతాన్ని మనమే ముందుండి నడిపిద్దాం. 

ముచ్చెర్ల ఫర్మాసిటీ లో సిప్లా యూనిట్;500కోట్ల పెట్టుబడులకు త్వరలో ఎంవోయు

ముచ్చెర్ల ఫర్మాసిటీ లో సిప్లా యూనిట్;500కోట్ల పెట్టుబడులకు త్వరలో ఎంవోయు 

అంతర్జాతీయ ఔషద విపణిలో ప్రత్యేక స్థానం ఉన్న ఫార్మా దిగ్గజం సిప్లా ముచ్చేర్లలో ఏర్పాటవుతున్న ఫార్మా సిటీలో సిప్లా యూనిట్ ఏర్పాటుకు 500కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. గత మూడు రోజులుగా ముంబైలో జరుగుతున్న 'మేక్ ఇన్ ఇండియా 'కార్యక్రమం వేదికగా సిప్లా ప్రతినిధులు తెలంగాణా పరిశ్రమల శాఖ ప్రతినిదులతో చర్చలు జరిపారు. కొద్ది రోజులలో సిప్లా ప్రతినిధులు హైదరాబాద్ వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపి అవగాహన ఒప్పదం (ఎంవోయు)కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ముంబై కేంద్రంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిప్లా లో అమితాబ్ కు అనుబందం ఉన్నందున త్వరలో జరగనున్న చర్చల్లో అమితాబ్ పాల్గొననున్నట్లు తెలంగాణా పారిశ్రామిక శాఖ అధికారులు తెలిపారు . 

సుఖోయ్ సూపర్ జెట్ 100స్పేర్ పార్ట్స్ @హైదరాబాద్ టాటా

సుఖోయ్ సూపర్ జెట్ 100స్పేర్ పార్ట్స్ @హైదరాబాద్ టాటా 


అంతర్జాతీయ విహంగ విపణిలో 'బ్రాండ్ హైదరాబాద్' ప్రత్యేక స్థానం దక్కనుంది. తక్కువ నిర్వాహణ వ్యయం ,పరిమిత సిబ్బంది ,గణనీయంగా ఇందనం ఆదా అయ్యే సుకోయ్ సూపర్ జెట్ 100 సంస్థ విమానాల విడిబాగాలకు హైదరాబాద్ లోని టాటా అద్వాన్సుడ్ సిస్టం తో ఒప్పందానికి ముందుకొచ్చింది. సింగపూర్ లో జరుగుతున్న ఎయిర్ షో 2016కు హాజరైన సుఖోయ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఉపాధ్యక్షుడు ఈజెన్ టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు . 20సూపర్ జెట్ విమానాలను ఇప్పటికే మెక్సికో లోని ఇంటర్జేట్ సంస్థకి అందజేసిన సుఖోయ్ రానున్న రోజులల్లో పెద్ద ఎత్తున సూపర్ జెట్ విమానాలను అంతర్జాతీయ విహంగ విపణిలో ప్రవేశపెట్టనుంది. ఈ ఒప్పందంతో హైదరాబాద్ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎక్కనుంది. అలాగే సుఖోయ్ సంస్థ సుఖోయ్ విమానాలను భారతీయ విమానయాన రంగంలో ప్రవేశపెట్టేందుకు ఇండియన్ ఎయిర్ లైన్స్ తో చర్చలు జరపనుంది. 

కృష్ణా పుష్కరాలకు రూ.825కోట్లు

కృష్ణా పుష్కరాలకు రూ.825కోట్లు 

తెలంగాణా రాష్ట్రం ఏర్పాడ్డాక వచ్చిన గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణా ప్రభుత్వం అదే స్పూర్తితో కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి సిద్దం అవుతుంది. ఈ ఏడాది ఆగష్టు 12నుండి 23వరకు జరిగే కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు 825కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించాలని కెసిఆర్ ఆదేశించారు. కృష్ణా పుష్కరాలు జరిగే మహబూబ్ నగర్ ,నల్గొండ జిల్లాల పరిదిలో రోడ్లు ,స్నాన ఘట్టాలు ,మంచినీటి వసతులు ,ఇతర సౌకర్యాల కొరకు ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రా పాలనలో ఆదరణకు నోచుకోని ఆష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కృష్ణా పుష్కరాలు జరిగే ఆలంపూర్ జోగులాంబ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని కెసిఆర్ సూచించారు. గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించిన కరీంనగర్ ,ఆదిలాబాద్,నిజామాబాద్ అధికారుల సూచనలు పుష్కరాల ఏర్పాట్లకై తీసుకోవాలని కెసిఆర్ ఆదేశించారు. 

Wednesday, 17 February 2016

ఆర్టీసి ఉద్యోగాల పేరుతో మోసగించిన ముఠా అరెస్ట్;ముఠాలో ఎన్ఎంయు నేత సయూద్

ఆర్టీసి ఉద్యోగాల పేరుతో మోసగించిన ముఠా అరెస్ట్;ముఠాలో ఎన్ఎంయు నేత సయూద్ 

ఆర్టీసి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న ముఠాను నల్గొండ జిల్లా కోదాడ పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీసీలో డ్రైవర్ ,కండక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దాదాపు 45మంది నిరుద్యోగుల నుండి 2.5కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు గుర్తించారు . ఈ ముఠాను కోదాడ పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు నల్గొండ ఎస్పీ దుగ్గల్ తెలిపారు . ఈ ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుండి 16లక్షలు ,2కార్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ముఠాలో ఆర్టీసి యూనియన్ ఎన్ఎంయు నేత మహమ్మద్ సయుద్ కూడా ఉండటం విశేషం,సయూద్ ఆర్టీసి యూనియన్లో చాల కాలంగా చక్రం తిప్పుతున్నాడు. ఈ ముఠా గుట్టురట్టు కావడంతో ఎన్ఎంయు నుండి సయూద్ ని తొలగిస్తున్నట్లు యూనియన్ ప్రకటించింది. 

రోజా రాజకీయ కెరీర్ కి టిడిపి పుల్ స్టాప్???

రోజా రాజకీయ కెరీర్ కి టిడిపి పుల్ స్టాప్???


టిడిపి లో రాజకీయ ఆరంగ్రేటం చేసిన రోజా టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలిగా తనదైన శైలిలో ఫైర్ బ్రాండ్ గా ప్రజల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రోజా 2009ఎన్నికల్లో  ఉదయగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన టిడిపి నేతలనుండి సహకారం లేక ఓటమి చవిచూసింది . ఎన్నికల అనంతరం కూడా టిడిపి తనని సమయానుగూనంగా వాడుకుని వదిలేసే దోరణి చూపడంతో టిడిపి వీడి వైఎస్ఆర్ సిపి లో చేరి 2014ఎన్నికల్లో పరిగి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ఎన్నికైన రోజా తనదైన శైలిలో అధికార టిడిపి తీరును ఎండగడుతూ ముందుకెళ్తున్న రోజా దూకుడుకు ఓ మహిళా ఎమ్మెల్యే తో చెక్ పెట్టే వ్యూహంతో రెచ్చగొట్టి కవ్వించి వ్యూహంలోకి దింపి గత అసెంబ్లీ సమావేశాల్లో  ఓ మహిళా ఎమ్మెల్యే ,ముఖ్యమంత్రి పై అనుచిత వాఖ్యలు చేసిందంటూ స్పీకర్ తో ఏడాదిపాటు సస్పెండ్ చేయటమే కాక స్పీకర్ చే ఓ కమీషన్ ఏర్పాటు చేసింది. 
రోజాపై స్పీకర్ వేసిన కమిటీ వైఎస్ఆర్ సిపి వాదనలు ,రోజా మాటలు వినకుండా అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నివేదిక సిద్దం చేసి స్పీకర్ చే రోజా పై నిషేధం పొడగించి నియోజకవర్గం ప్రజల దృష్టిలో చులకన చేసి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార బలంతో రొజాని ఓడించి తన రాజకీయ కెరీర్ కి టిడిపి పుల్ స్టాప్ పెట్టాలని టిడిపి వ్యూహరచన చేసినట్టు సమాచారం. 


స్వల్పంగా మారిన పెట్రోల్ ,డీజిల్ ధరలు

స్వల్పంగా మారిన పెట్రోల్ ,డీజిల్ ధరలు 

. ప్రపంచ మార్కెట్ల ఒడిదుడుకులతో పెట్రోల్,డీజిల్ ధరల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ లీటరుపై 32పైసలు తగ్గగా ,డీజిల్ ధర లీటరు పై 28పైసలు పెరిగింది.స్వల్పంగా మారిన పెట్రోల్,డీజిల్ ధరలు ఈ అర్దరాత్రి నుండి అమలులోకి రానున్నాయి. 

ఘనంగా ప్రారంబమైన సమ్మక్క-సారక్క జాతర;ఇప్పటివరకు దర్శించుకున్న 50లక్షల భక్తులు??

ఘనంగా ప్రారంబమైన సమ్మక్క-సారక్క జాతర;ఇప్పటివరకు దర్శించుకున్న 50లక్షల భక్తులు??

వన జాతర,జన జాతర,పోరాటానికి ప్రతీక అయిన ఆసియాలోనే అతిపెద్దదైన ఆదివాసి జాతర దక్షిణ భారత కుంబమేళా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా ప్రారంబమైంది. 4000ఆర్టిసి బస్సులు,18ప్రత్యేక రైళ్లు,181కోట్లతో ప్రత్యేక సదుపాయాలు,10000మంది పోలీసు బలగాలు,1000ఎకరాల పార్కింగ్ స్థలం మొట్టమొదటిసారి తెలంగాణా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హేలిక్యాప్టార్ సేవలు కల్పించగా ఈరోజు జాతర పగిడిద్ద రాజు,గోవిందరాజు రాకతో ఘనంగా స్టార్ట్ కాగా కొద్ది క్షణాల క్రితం కన్నేపెల్లి గ్రామస్థులు ఘన స్వాగతాలతో సారలమ్మ గద్దె చేరడంతో మేడారం పులకించిపోయింది.గత వారం రోజులుగా సుమారు 30లక్షల మంది భక్తులు రాగ ఈరోజు సుమారుగా 20లక్షల మంది దర్శించుకోగా ,రేపు కీలకమైన సారక్క గద్దె నెక్కనుంది,రేపు భక్తుల రద్దీ పెరగనుండటం తో ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 

నియోజకవర్గాల పునర్విబజనకు కసరత్తు???

నియోజకవర్గాల పునర్విబజనకు కసరత్తు???

ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టంలో బాగంగా తెలంగాణాలోని నియోజకవర్గాల పెంపునకు మార్గం సుగమం చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఒకేసారి పూర్తిచేసేవిధంగా పునర్వ్యవస్తీకరణ చట్టంలోని సెక్షన్ 26 లో 'రాజ్యగంలోని 170వ అధికరణం ప్రకారం' అనే పదాల స్థానంలో 'రాజ్యాంగం లోని 170అధికరణం లో ఏమున్నప్పటికీ' అనే పదాలను చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఈ సమావేశాల్లోనే ఆమోదం తెలిపి చట్ట సవరణకు మార్గం సుగమం చేయనుంది. ఈ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి గెజిట్ విడుదల కాగానే కేంద్ర ఎన్నికల సంఘం డీలిమిటేషన్ కమీషన్ ఏర్పాటు చేసి ప్రజలనుంచి అభిప్రాయాలను ,అభ్యంతరాలను స్వీకరించి తదనుగుణంగా ఆరు నెలల్లో ప్రక్రియను పూర్తిచేస్తుంది. తెలంగాణాలోని 119 నియోజకవర్గాలను 153 పెంచుతూ నియోజకవర్గాల విబజన అనంతరం నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి తేనున్నట్లు తెలంగాణా ప్రభుత్వ వర్గాల సమాచారం. 

చాణఖ్య చంద్రగుప్త చంద్రశేఖరుడు..... !

 చాణఖ్య చంద్రగుప్త చంద్రశేఖరుడు..... !

తెలంగాణా తలరాతను మార్చిన విధాత,ఉద్యమ రథసారది ,స్వరాష్ట్ర సారది మాటల మాంత్రికుడు ,జన హృదయ నేత,తెలంగాణా గాంధి,అరవై ఏళ్ల ఆకాంక్షను గల్లి నుండి ఢిల్లీ కి వినిపించి జలద్రుశ్యం తో మొదలెట్టి జంతర్ మంతర్ వరకు వినిపించి,ఉద్యమానికి రాజకీయం జోడించి ,సభలు,సమావేశాలు,ఓట్లు,సీట్లతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసి ఎన్ని ఆటుపోటులు ఎదురైనా అలుపెరుగని దీక్షతో ఆరు దశాబ్దాల ఆకాంక్షను పుస్కరకాలంలో విజయతీరాలకు చేర్చిన అతని వ్యూహం అద్వితీయం,అతని చానఖ్యం అమోఘం. 
తెలంగాణా ఉద్యమ రథ సారది జన హృదయ నేతగా స్వరాష్ట్ర సారధిగా సంక్షేమ వారదిగా నవతెలంగాణా నిర్మాతగా బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ ప్రత్యర్థులకు దీటుగా ముందుకెళ్తున్న తెలంగాణా చానఖ్య చంద్రగుప్తుడు 'కల్వకుంట్ల చంద్రశేఖరుడు' 61 వసంతాలు పూర్తి చేసుకుని 62వ వసంతంలోకి అడుగేడుతున్న మా ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..... 

హైదరాబాద్ లో రిలయన్స్ ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం ???

హైదరాబాద్ లో రిలయన్స్ ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం ???

ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా ఇంజనీరింగ్,మెడిసన్,లా,బిజినెస్స్ ,కంప్యూటర్ సైన్స్,హ్యుమానిటీస్ ఇలా ప్రతి రంగానికి చెందినా కళాశాల స్థాయి నుండి పరిశోధన వరకు ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థను తెలంగాణా ప్రభుత్వ సహకారంతో రిలయన్స్ విద్యా సంస్థను ప్రారంబించడానికి సిద్దపడిందని తెలంగాణా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గత వారం కేటిఅర్ ముంబై పర్యటనలో బాగంగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానితో చర్చలు జరుపగా,దీనికి సంబంధించి స్థలం,ఏ ప్రదేశం లో ఏర్పాటు చేయడం కొరకు ప్రభుత్వంతో మరో మారు చర్చలు జరుపనున్నట్లు తెలుస్తుంది . 

Tuesday, 16 February 2016

టిఆర్ఎస్ లోకి టికాంగ్రెస్ ఎమ్మెల్యేలు ???ఇక ఆపరేషన్ టికాంగ్ స్టార్ట్ ???

టిఆర్ఎస్ లోకి టికాంగ్రెస్ ఎమ్మెల్యేలు ???ఇక ఆపరేషన్ టికాంగ్ స్టార్ట్ ???

టిటిడిపి ని కోలుకొని దెబ్బ తీసిన చంద్రశేకర్ రావు ఇప్పుడు తన చూపును కాంగ్రెస్ వైపు మళ్ళించాడు ఒకప్పుడు రాజశేకర్ రెడ్డి పన్నిన వ్యూహానికి మించిన వ్యూహంతో ఇప్పుడు టికాంగ్రెస్ ని విలవిలలాడించడానికి ఇప్పటికే రంగం సిద్దం అయినట్లు తెలుస్తుంది. టికాంగ్రెస్ పెద్దమనిషితో ఆపరేషన్ మొదలెట్టిన కెసిఆర్ గ్రౌండ్ వర్క్ పూర్తయినట్లు టిఅర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో బాగంగా తొలుత టికాంగ్రెస్ యువ ఎమ్మెల్యే సంపత్,డీకే అరుణ, కోమటి రెడ్డి బ్రదర్స్ పై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తుంది. మరో వారం రోజుల్లో కాంగ్రెస్ నుండి టిఅరేస్ కి పెద్ద ఎత్తున వలసలు మొదలవనున్నట్లు తెలుస్తుంది. 


నారాయణఖేడ్ ఉపఎన్నికలో టిఅర్ఎస్ ఘన విజయం;మామకు ప్రేమతో అంకితం ఈ విజయం

నారాయణఖేడ్ ఉపఎన్నికలో టిఅర్ఎస్ ఘన విజయం;మామకు ప్రేమతో అంకితం ఈ విజయం 

నారాయణఖేడ్ నియోజకవర్గ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా లిఖించిన చరిత్రను తిరగరాస్తూ 14సార్లు ఎన్నికలు జరిగగా 10సార్లు గెలిచినా కాంగ్రెస్ ను కంగుతినిపిస్తూ ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో టిఅర్ఎస్ అభ్యర్థి గెలుపు బాద్యతలు తీసుకున్న కెసిఆర్ మేనల్లుడు మంత్రి తన్నీరు హరీష్ రావు నియోజక వర్గ ప్రజలతో మమేకమవుతూ టిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఘన విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈరోజు జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ లో టిఅర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 93,076 ఓట్లు ,కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ్ రెడ్డి 39451 ఓట్లు ,టిడిపి అభ్యర్థి విజయాపాల్ రెడ్డి 14787 ఓట్లు పొందారు. టిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 53625 ఓట్ల మెజారిటీ తో ఘన విజయంలో కీలకపాత్ర పోషించి మామ కెసిఆర్ కి పుట్టినరోజు కానుక గా హరిష్ రావు సాదించిన ఈ విజయం 'మామకు ప్రేమతో అంకితం... '

బారీ మెజారిటీ దిశగా టిఅర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి

బారీ మెజారిటీ దిశగా టిఅర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి 

నారాయణ ఖేడ్ ఉపఎన్నికల్లో టిఅర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఘన విజయం దిశగా దూసుకెల్తున్నాడు.ఉదయం 8గంటలకు ప్రారంబమైన ఉప ఎన్నికల ఓటింగ్ లో రౌండ్ రౌండ్ కి మెజారిటీ పెంచుకుంటూ స్పష్టమైన ఆదిక్యంతో గెలుపు దిశగా పయనిస్తున్నాడు. 14రౌండ్లు ముగిసేసరికి టిఅర్ఎస్ అభ్యర్థి 38664 ఓట్ల మెజారిటీ సాదించారు. 14 రౌండ్లు ముగిసేసరికి టిఅర్ఎస్ పార్టీ కి 65177,కాంగ్రెస్ కి 26513,టిడిపికి 10425 ఓట్లు పోలయ్యాయి. ఇంకా 7రౌండ్లు లెక్కించాల్సి ఉంది . 

విశ్వనగరాభివ్రుద్దికి బ్రిక్స్ బ్యాంక్ 70000కోట్ల రుణం??హెచ్ఎమ్డిఏ ఔటర్ చుట్టు టిఓజీసి సెంటర్స్??

విశ్వనగరాభివ్రుద్దికి బ్రిక్స్ బ్యాంక్ 70000కోట్ల రుణం??హెచ్ఎమ్డిఏ ఔటర్ చుట్టు టిఓజీసి సెంటర్స్??

గ్రేటర్ ఎన్నికల మ్యానిపెస్తోలో లో పేర్కొన్న విశ్వనగర అభివృద్ధి ప్రణాళిక అమలుకు అవసరమైన ఆర్ధిక పరమైన ఇబ్బందులను అదిగమించేందుకు నిదులకు బ్రిక్స్ బ్యాంక్ నుండి 70000కోట్ల రుణానికి ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించింది. ప్రణాళికలో  బాగంగా మూసి నదిపై ఈస్ట్ టూ వెస్ట్ స్కైవే నిర్మాణంతో పాటు నగరం చుట్టూ ఉన్న 11పట్టణాలను కౌంటర్ మ్యాగ్నేట్ సిటీ లుగా అభివృద్ధి చేస్తూ,హైదరాబాద్ ఔటర్ చుట్టూ ట్రాన్సిట్ ఒరిఎంటేడ్ గ్రోత్ సెంటర్స్ ,ఫార్మ,ఐటి ,ఏరోస్పేస్,స్పోర్ట్స్ సిటీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు,మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం ,మూసి నది సుందరీకరణ ,హుస్సేన్సాగర్ సుద్ది,నగర శివార్లలో 40టిఎమ్సి ల సామర్ద్యంతో జలాశయాల నిర్మాణానికి,నగరంలో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సుమారు 70000కోట్ల నిధులు అవసరం ఉన్న దృష్ట్యా నిదుల సేకరణకు బ్రిక్స్ బ్యాంకు నుండి రుణానికి కేంద్ర తో చర్చలు జరిపిన కెసిఆర్ అభివృద్ధి కి సంబందించిన ప్రణాలికలతో నివేదిక సమర్పించారు . 


Monday, 15 February 2016

పేదలందరికి ఈ ఏడాది కెసిఆర్ 2లక్షల డబల్ బెడ్ రూమ్ ఇళ్ల దమాక ???

పేదలందరికి ఈ ఏడాది కెసిఆర్  2లక్షల డబల్ బెడ్ రూమ్ ఇళ్ల దమాక ???

తెలంగాణా ప్రభుత్వం ఈ ఏడాది పేదలందరికి డబల్ దమాక ఇవ్వనుంది.ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బాగంగా ఈ ఏడాది గ్రేటర్ పరిదిలో లక్ష ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు,ఇప్పుడు ఆ హామీని డబల్ చేయాలని కెసిఆర్ ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ ఏడాది గ్రేటర్ లో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు తోడుగా మరో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి ఇయ్యడానికి ప్రణాళిక సిద్దం చెయ్యాలని అధికారులకు కెసిఆర్ ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ రెండు లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లు గ్రేటర్ పరిదిలో ,మరో లక్ష మిగితా తొమ్మిది జిల్లాల పరిదిలో కట్టించాలని నిర్ణయించారు. ఈ రెండు లక్షల డబల్ బెడ్ రూమ్ ఇళ్ళకు ఈ బడ్జెట్ లో 14000కోట్లు కేటాయించాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ఇతర బ్యాంకుల్లో రుణాలకు ప్రయత్నించాలని చూస్తున్నారు. 

కేంద్ర క్యాబినెట్ లోకి టిఅర్ఎస్???ఒక మంత్రి,రెండు సహాయ మంత్రులు???

కేంద్ర క్యాబినెట్ లోకి టిఅర్ఎస్???ఒక మంత్రి,రెండు సహాయ మంత్రులు???


రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కెసిఆర్ కేంద్ర ప్రభుత్వంతో దోస్తీకి సై అంటున్నారు. గత 3రోజుల పర్యటనలో కెసిఆర్ మోడీ సహా కేంద్ర కీలక మంత్రులతో సమావేశం అయ్యారు. ప్రదాని మోడీ తో కీలక బేటీ లో ఎన్డియే ప్రభుత్వం లో టిఅర్ఎస్ చేరడానికి కెసిఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఇందుకు ప్రతిపలంగా కేంద్ర క్యాబినెట్ లో ఒక మంత్రి,2సహాయ మంత్రులు అడగగా రాబోయే విస్తరణలో ఒక మంత్రి,ఒక సహాయ మంత్రి ఇయ్యడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ బడ్జెట్ లో తెలంగాణా కి సంబందించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయహోద ,మిషన్ బగీరథ వంటి వాటికి కీలక ఆర్ధిక సహాయం అందించాలని కెసిఆర్ అడిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టిఅర్ఎస్ ఎంపి లుగా ఉన్నవారిలో కేకే,జితేందర్ రెడ్డి,వినోద్ కుమార్ లు మంత్రి గా అవకాశం కోసం చూస్తుండగా,ఒక సహాయ మంత్రిగా కవిత కి అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్రం క్యాబినెట్ లో టిఅర్ఎస్ చేరగానే రాష్ట్రంలో ఇద్దరు బిజేపీ ఎమ్మెల్యే లకు మంత్రులుగా అవకాశం ఇవనున్నట్లు తెలుస్తుంది. 

ఖమ్మం కోటలో గులాభి గుబాళింపు;సై'కిల్' పంక్చర్

ఖమ్మం కోటలో గులాభి గుబాళింపు;సై'కిల్' పంక్చర్ 

త్వరలో ఖమ్మం లో జరగనున్న పురపాలక ఎన్నికల నేపద్యంలో గులాభి గుబాలింపుకు ప్రణాళిక సిద్దం చేసారు. ఇప్పటికే ఖమ్మం లోని అగ్రనేతలను టిఅర్ఎస్ లోకి లాగిన కెసిఆర్ ఇప్పుడు ఖమ్మం లో పట్టున్న టిడిపి ని ఖాళి చేయాలని వ్యూహరచనలో బాగంగా ఈరోజు,రేపు కెసిఆర్ ఖమ్మం పర్యటనలో పదివేలకు పైగా జిల్లా,మండల స్థాయి నేతలు,కార్యకర్తలను పార్టీలో చేర్చుటకు ఖమ్మం మంత్రి తుమ్మల చక్రం తిప్పుతున్నారు. ఇందులో బాగంగా ఖమ్మం జిల్లా మైనారిటీ నాయకులు,మాజీ ఎమ్మెల్యే యూనస్ సుల్తాన్ తో పాటు పెద్ద సంఖ్యలో మైనారిటీ కార్యకర్తలు,అనుచరగణం కారేక్కడానికి సిద్దమయ్యారు. అలాగే టిడిపి రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిది పొట్ల నాగేశ్వర్ రావు,టిడిపి జిల్లా పార్టీ కమిటీ నేతలు ,ఎంపిటిసి లు,జెడ్పిటి సి లు ,సర్పంచులు పెద్ద ఎత్తున పార్టీలో చేరి టిడిపి కంచు కోటాగా ఉన్న ఖమ్మం లో టిడిపి ని ఖాళీ చేసి ఖమ్మం కోటా పై గులాబి జెండా ఎగురవేయనున్నారు . 

సాన్-టీనా జోడికి మరో టైటిల్;వరుసగా 40వ విజయం సాదించిన సానియా జోడి

సాన్-టీనా జోడికి మరో టైటిల్;వరుసగా 40వ విజయం సాదించిన సానియా జోడి 

సూపర్ పామ్ లో ఉన్న తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ సానియా ,హింగీస్ జతగా మరో టైటిల్ సాదించింది. ఆదివారం జరిగిన సెయింట్ పీటర్స్ బర్గ్ ట్రోపీ ఫైనల్లో ఇండో-స్విస్ ఎక్స్ ప్రెస్ జోడి వేరా దుస్వేనా-బార్బరా జోడిని 6-3,6-1తో చిత్తు చేసి ప్రపంచ నంబర్ వన్ ద్వయం వరసగా 40వ విజయం సాదించింది. సానియా-హింగిస్ ద్వయం సూపర్ పామ్ తో ప్రపంచ రికార్డు దిశగా ముందడుగు వేస్తున్నారు. 

తెలంగాణాలో ఎయిర్ బస్ హేలిక్యాప్టార్ తయారి యూనిట్

తెలంగాణాలో ఎయిర్ బస్ హేలిక్యాప్టార్ తయారి యూనిట్  

తెలంగాణాలో ఎయిర్ బస్ హేలిక్యాప్టర్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. నిన్న ముంబై లో మేక్ ఇన్ ఇండియా వీక్ ప్రదర్శనలో ఎయిర్ బస్ హేలిక్యాప్టార్ తయారి విబాగం అధ్యక్షుడు జేవియర్ హే ,తెలంగాణా పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తో గంట పాటు బేటీ అయ్యారు. ఎయిర్ బస్ యూనిట్ ను ఆదిబట్ల ఏరోస్పేస్ సెజ్ లో ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసారు దీనిపై 2,3రోజుల్లో ఎయిర్ బస్ ప్రతినిధులు కెసిఆర్ తో చర్చించే అవకాశం ఉంది

Sunday, 14 February 2016

ప్రణీతకు త్రుటిలో తప్పిన పెనుప్రమాదం

ప్రణీతకు త్రుటిలో తప్పిన పెనుప్రమాదం 

సినీ నటి ప్రణీత త్రుటిలో పెను ప్రమాదం నుండి బయటపడింది. ఈరోజు ఉదయం ఖమ్మంలోని ఓ షోరూం ప్రారంబోత్సవానికి ముఖ్య అతిదిగా హాజరై కార్యక్రమ అనంతరం హైదరాబాద్ తిరిగివస్తుండగా నల్గొండ జిల్లా మోతె మండల కేంద్ర సమీపంలో ఎదురుగా వస్తున్న టూ వీలర్ ని తప్పించబోయిన ప్రణీత కారు డ్రైవెర్ అదుపుతప్పడంతో ఇన్నోవా వాహనం బోల్తా పడింది. కారు బోల్తాపడటంతో ప్రమాదానికి సమీపంలోని ప్రజలు ప్రమాద స్థలికి వచ్చి అందులో ఉన్న ప్రణీత,ప్రణీత తల్లి,డ్రైవర్ ని బయటకిలాగి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ప్రణీత,తన తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద అనంతరం సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు.ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రణీత ట్విట్టర్ ద్వార తన క్షేమ సమాచారం ట్వీట్ ద్వార తెలియజేసారు. 

తెలంగాణా కుంబమేళ (మేడారం జాతర)కు సర్వం సిద్దం

తెలంగాణా కుంబమేళ (మేడారం జాతర)కు సర్వం సిద్దం 

దక్షిణ భారత కుంబమేళ మేడారం జాతరకు సర్వం సిద్దం అయింది. తెలంగాణా ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న మేడారం సమ్మక్క -సారక్క జాతరకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది తెలంగాణా ప్రభుత్వం,కోటిన్నర మంది బక్తులు వస్తారని అంచనాతో 16ప్రత్యేక రైళ్ళు 4000ప్రత్యేక బస్సులు సిద్దం చేసి వాహనాల పార్కింగ్ కి 50ఎకరాల స్థలాన్ని ఏర్పాటు చేసారు . ఈసారి ప్రత్యేకంగా తెలంగాణా పర్యాటక శాఖా అధ్వర్యంలో హేలిక్యాప్టార్ సౌకర్యం ఏర్పాటు చేసారు. 17,18,19 తేదిల్లో జరగనున్న జాతరకు గత వారం రోజుల్లో సుమారుగా రోజుకు 5లక్షల బక్తులు దర్శనం చేసుకుంటున్నారు. కోటిన్నర కు పైగా బక్తులు,5000కోట్ల వ్యాపారం జరగనున్న ఈ జాతర తెలంగాణకే తలమానికం. 

అండర్-19 ప్రపంచకప్ వేటలో భారత కుర్రాళ్లు

అండర్-19 ప్రపంచకప్ వేటలో భారత కుర్రాళ్లు 

వెటరన్ రాహుల్ ద్రావిడ్ నేతృత్వం లో ఇండియన్ కుర్రాళ్లు బంగ్లాదేశ్ లో డాఖలో జరగనున్న ప్రపంచ కప్ ఫైనల్ వేటలో ఉంది .ఈ ప్రపంచ కప్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఇండియన్ కుర్ర జట్టు ఈరోజు ఫైనల్లో వెస్ట్ఇండీస్ జట్టు తో తలపడనుంది. 1983 ప్రపంచ కప్ తర్వాత ఓ మేజర్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ,వెస్ట్ఇండీస్ జట్లు తలపడటం ఇదే తొలిసారి కావడంతో అందరు ఈ ఫైట్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. భారత కుర్రాళ్లు  కప్ నెగ్గి కోచ్ వెటరన్ ద్రావిడ్ కి అంకితం ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. 

బ్రాండ్ తెలంగాణా సేంద్రీయ కూరగాయలు

బ్రాండ్ తెలంగాణా సేంద్రీయ కూరగాయలు 

తెలంగాణా ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి రంగం సిద్దం చేస్తుంది. పూర్తిగా సేంద్రీయ పద్దతిలో కూరగాయలు పండించడానికి కార్యాచరణ సిద్దం చేసి కూరగాయలతో పాటు,కల్తీ లేని కారం,అల్లం ,పప్పులు అన్ని తెలంగాణా బ్రాండ్ తో రాష్ట్రవ్యాప్తంగా ఔట్లెట్లు ఏర్పాటు చేసి అందించాలని భావిస్తుంది. ఇందుకు కెసిఆర్ చైర్మెన్ గా,పోచారం వైస్ చైర్మెన్ గా 18మంది సభ్యులతో కూడిన ఉద్యానవన కమీషన్ ఏర్పాటు చేయనుంది. 250కోట్ల నిదులతో ఏర్పాటు చేయనున్న ఉద్యానవన కమీషన్ విదివిదానాలు ,కార్యాచరణ రూపొందించే బాద్యత ఆయిల్ ఫెడ్ ఎమ్.డి మురళికి అప్పగించారు. ఈ కమీషన్ ద్వారా పేదలకు,పట్టణ ప్రజలకు రసాయనాలు లేని కూరగాయలు అందించడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు మహిళల ఆధ్వర్యంలో రిటైల్ ఔట్ లెట్ లు ఏర్పాటు చేయటం వల్ల మహిళలకు ఆర్ధిక స్వావలంబన చేకూరనుంది. ప్రస్తుతం తెలంగాణా ప్రజల అవసరాలకు తగినన్ని కూరగాయలు పండించడం వల్ల పక్క రాష్ట్రాల నుండి కూరగాయల దిగుమతులు తగ్గించడం,కూరగాయల ధరలను అదుపులో ఉంచనున్నారు. 

ఖేడ్ ఉపఎన్నికలో కారు జోరు... కాంగ్రెస్ బేజారు ...

ఖేడ్ ఉపఎన్నికలో కారు జోరు... కాంగ్రెస్ బేజారు ... 

గ్రేటర్ ఎన్నికల ఘన విజయంతో జోరు మీదున్న కారు మరింత జోరుతో దూసుకెల్లనుంది,నిన్న జరిగిన నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నికల ఓటింగ్ 82%నమోదవడం టిఅర్ఎస్ బారీ మెజారిటీ తో గెలవనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పోల్ అయిన ఓట్లలో సుమారుగా 70%ఓట్లు కారు సొంతం చేసుకోనుంది. ఖేడ్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ కారు జోరులో కాంగ్రెస్ బెజారే అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి డిపాజిట్ దక్కడం అతికష్టం అంటున్నారు.  ఇప్పుడంత భూపాల్ రెడ్డి మెజారిటీ పైనే ద్రుష్టి పడింది. 

టిడిపికి మరో షాక్ తగలబోతుందా ?టిఅర్ఎస్ లోకి మరో టిడిపి ఎమ్మెల్యే ?

టిడిపికి మరో షాక్ తగలబోతుందా ?టిఅర్ఎస్ లోకి మరో టిడిపి ఎమ్మెల్యే ?


టిటిడిపి విస్తృత స్థాయి సమావేశం ముగిసిన రెండు గంటల్లోపే నారాయణ పేట్ ఎమ్మెల్యే టిఅర్ఎస్ లో చేరి చంద్రబాబుకి షాక్ ఇయ్యగా ఇప్పుడు మరో షాక్ తగలనుంది అంటున్నారు టిఅర్ఎస్ వర్గాలు. మిగిలిఉన్న ఎమ్మెల్యే ల అందరితో బాబు స్వయంగా విడివిడిగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ టిడిపి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ టిఅర్ఎస్ లోకి చేరడానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం.గాంధీ తో పాటు మరో ఎమ్మెల్యే కూడా కారు ఎక్కనున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న దృష్ట్యా చేరిక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 10కి చేరిన టిటిడిపి చీలిక వర్గం తమ బలాన్ని 12 కి పెంచుకోనుంది.