ADD

Wednesday, 17 February 2016

నియోజకవర్గాల పునర్విబజనకు కసరత్తు???

నియోజకవర్గాల పునర్విబజనకు కసరత్తు???

ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్తీకరణ చట్టంలో బాగంగా తెలంగాణాలోని నియోజకవర్గాల పెంపునకు మార్గం సుగమం చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. రెండు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఒకేసారి పూర్తిచేసేవిధంగా పునర్వ్యవస్తీకరణ చట్టంలోని సెక్షన్ 26 లో 'రాజ్యగంలోని 170వ అధికరణం ప్రకారం' అనే పదాల స్థానంలో 'రాజ్యాంగం లోని 170అధికరణం లో ఏమున్నప్పటికీ' అనే పదాలను చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఈ సమావేశాల్లోనే ఆమోదం తెలిపి చట్ట సవరణకు మార్గం సుగమం చేయనుంది. ఈ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి గెజిట్ విడుదల కాగానే కేంద్ర ఎన్నికల సంఘం డీలిమిటేషన్ కమీషన్ ఏర్పాటు చేసి ప్రజలనుంచి అభిప్రాయాలను ,అభ్యంతరాలను స్వీకరించి తదనుగుణంగా ఆరు నెలల్లో ప్రక్రియను పూర్తిచేస్తుంది. తెలంగాణాలోని 119 నియోజకవర్గాలను 153 పెంచుతూ నియోజకవర్గాల విబజన అనంతరం నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి తేనున్నట్లు తెలంగాణా ప్రభుత్వ వర్గాల సమాచారం. 

No comments:

Post a Comment