ADD

Friday, 19 February 2016

తెలంగాణాలో టిడిపి తో బిజెపి కటీప్;రాష్ట్ర మంత్రివర్గంలోకి బిజెపి???

తెలంగాణాలో టిడిపి తో బిజెపి కటీప్;రాష్ట్ర మంత్రివర్గంలోకి బిజెపి???

తెలంగాణా లో టిడిపి తో బిజెపి పొత్తు తెగదెమ్పులకు రంగం సిద్దం అయింది. నిన్న జరిగిన బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గం తెలంగాణాలో పార్టీ బలపడాలంటే టిడిపి తో పొత్తు ఇకపై ఉండకూడదని,టిడిపి తో పోత్తులవల్ల పార్టీ బలహీనపడుతూ పార్టీ కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెల్లుతున్నారని నిర్ణయించిన కార్యవర్గం టిడిపి తో ఇక పొత్తుకు స్వస్తి చెప్పాలని తీర్మానం చేసి కేంద్ర పార్టీ కార్యవర్గానికి తమ నిర్ణయాన్ని తెలియజేసారు. ఇదంతా గత వారంలో కెసిఆర్ మోడీ ,కేంద్రమంత్రులతో బేటీ కి అనుగుణంగా కేంద్ర బిజెపి ఆదేశాలమేరకే సాగుతున్నట్లు తెలుస్తుంది. టిడిపి తో తెగదెంపుల అనంతరం రాబోయే మంత్రి వర్గ విస్తరణలో టిఅరేస్ మంత్రివర్గంలోకి బిజెపి కి చోటు కల్పించనున్నట్లు తెలుస్తుంది. త్వరలో బిజెపి కొత్త అధ్యక్షుడిగా లక్ష్మణ్ లేదా రామచంద్రారెడ్డి లలో ఒకరికి అవకాశం కల్పించి కిషన్ రెడ్డి కి మంత్రివర్గంలో స్థానం ఇయ్యనున్నట్లు తెలుస్తుంది. 

No comments:

Post a Comment