ADD

Wednesday, 17 February 2016

ఆర్టీసి ఉద్యోగాల పేరుతో మోసగించిన ముఠా అరెస్ట్;ముఠాలో ఎన్ఎంయు నేత సయూద్

ఆర్టీసి ఉద్యోగాల పేరుతో మోసగించిన ముఠా అరెస్ట్;ముఠాలో ఎన్ఎంయు నేత సయూద్ 

ఆర్టీసి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న ముఠాను నల్గొండ జిల్లా కోదాడ పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీసీలో డ్రైవర్ ,కండక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దాదాపు 45మంది నిరుద్యోగుల నుండి 2.5కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు గుర్తించారు . ఈ ముఠాను కోదాడ పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు నల్గొండ ఎస్పీ దుగ్గల్ తెలిపారు . ఈ ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి నుండి 16లక్షలు ,2కార్లు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ముఠాలో ఆర్టీసి యూనియన్ ఎన్ఎంయు నేత మహమ్మద్ సయుద్ కూడా ఉండటం విశేషం,సయూద్ ఆర్టీసి యూనియన్లో చాల కాలంగా చక్రం తిప్పుతున్నాడు. ఈ ముఠా గుట్టురట్టు కావడంతో ఎన్ఎంయు నుండి సయూద్ ని తొలగిస్తున్నట్లు యూనియన్ ప్రకటించింది. 

No comments:

Post a Comment