టిడిపికి మరో షాక్ తగలబోతుందా ?టిఅర్ఎస్ లోకి మరో టిడిపి ఎమ్మెల్యే ?
టిటిడిపి విస్తృత స్థాయి సమావేశం ముగిసిన రెండు గంటల్లోపే నారాయణ పేట్ ఎమ్మెల్యే టిఅర్ఎస్ లో చేరి చంద్రబాబుకి షాక్ ఇయ్యగా ఇప్పుడు మరో షాక్ తగలనుంది అంటున్నారు టిఅర్ఎస్ వర్గాలు. మిగిలిఉన్న ఎమ్మెల్యే ల అందరితో బాబు స్వయంగా విడివిడిగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ టిడిపి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ టిఅర్ఎస్ లోకి చేరడానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం.గాంధీ తో పాటు మరో ఎమ్మెల్యే కూడా కారు ఎక్కనున్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న దృష్ట్యా చేరిక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 10కి చేరిన టిటిడిపి చీలిక వర్గం తమ బలాన్ని 12 కి పెంచుకోనుంది.
No comments:
Post a Comment