విశ్వనగరాభివ్రుద్దికి బ్రిక్స్ బ్యాంక్ 70000కోట్ల రుణం??హెచ్ఎమ్డిఏ ఔటర్ చుట్టు టిఓజీసి సెంటర్స్??
గ్రేటర్ ఎన్నికల మ్యానిపెస్తోలో లో పేర్కొన్న విశ్వనగర అభివృద్ధి ప్రణాళిక అమలుకు అవసరమైన ఆర్ధిక పరమైన ఇబ్బందులను అదిగమించేందుకు నిదులకు బ్రిక్స్ బ్యాంక్ నుండి 70000కోట్ల రుణానికి ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించింది. ప్రణాళికలో బాగంగా మూసి నదిపై ఈస్ట్ టూ వెస్ట్ స్కైవే నిర్మాణంతో పాటు నగరం చుట్టూ ఉన్న 11పట్టణాలను కౌంటర్ మ్యాగ్నేట్ సిటీ లుగా అభివృద్ధి చేస్తూ,హైదరాబాద్ ఔటర్ చుట్టూ ట్రాన్సిట్ ఒరిఎంటేడ్ గ్రోత్ సెంటర్స్ ,ఫార్మ,ఐటి ,ఏరోస్పేస్,స్పోర్ట్స్ సిటీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు,మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం ,మూసి నది సుందరీకరణ ,హుస్సేన్సాగర్ సుద్ది,నగర శివార్లలో 40టిఎమ్సి ల సామర్ద్యంతో జలాశయాల నిర్మాణానికి,నగరంలో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సుమారు 70000కోట్ల నిధులు అవసరం ఉన్న దృష్ట్యా నిదుల సేకరణకు బ్రిక్స్ బ్యాంకు నుండి రుణానికి కేంద్ర తో చర్చలు జరిపిన కెసిఆర్ అభివృద్ధి కి సంబందించిన ప్రణాలికలతో నివేదిక సమర్పించారు .
No comments:
Post a Comment