ADD

Friday, 19 February 2016

జనసంద్రమైన మేడారం;మేడారానికి విఐపి ల తాకిడి

జనసంద్రమైన మేడారం;మేడారానికి విఐపి ల తాకిడి 

మేడారం జనసంద్రంలా మారింది. మూడోరోజు సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ ఒక్కరోజే సమ్మక్క,సారలమ్మలను సుమారుగా 50లక్షల మంది దర్శించుకున్నారు.మేడారం జాతరకు పెద్ద ఎత్తున భక్తుల రాకతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేసారు. ఈరోజు మేడారానికి విఐపి ల తాకిడి పెరిగింది,తెలంగాణా మంత్రులు మహిందర్ రెడ్డి ,కేటిఅర్ ,డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి,ఎమ్మెల్యే లు బాబు మోహన్ ,హిందూపూర్ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ,ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి దేవతలను దర్శించుకున్న వారిలో ఉన్నారు. 

No comments:

Post a Comment