రియో ఒలంపిక్స్ పై సానియా దృష్టి ;రోహన్ బోపన్నతో బరిలోకి???
కెరీర్ లోనే అత్యున్నత పామ్ లో ఉన్న తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా ఆగష్టు లో జరగబోయే రియో ఒలంపిక్స్ పై దృష్టి సారించింది. గత ఒలంపిక్స్ లో వివాదాల నడుమ లియాండర్ పేస్ తో మిక్స్డ్ డబుల్స్ బరిలో దిగిన సానియా నిరాశతో వెనుదిరిగింది. అయితే ఈ సారి సానియా రోహన్ బోపన్నతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పామ్ దృష్ట్యా ఈసారి సానియాపై అంచనాలు పెరిగిపోతుండటం తో ఒలంపిక్స్ కి ముందు తనతో జోడీ కట్టే ఆటగాడితో ఏదైనా ఒక టోర్నీ లో పాల్గొంటే ఇద్దరిమద్య సమన్వయం పెరిగి ఒలంపిక్స్ పతకం సాదించడం సులువవుతుందని భావిస్తున్న సానియా తన జోడీ ఎవరో త్వరలోనే తేల్చుకోనుంది .
No comments:
Post a Comment