ADD

Wednesday, 17 February 2016

ఘనంగా ప్రారంబమైన సమ్మక్క-సారక్క జాతర;ఇప్పటివరకు దర్శించుకున్న 50లక్షల భక్తులు??

ఘనంగా ప్రారంబమైన సమ్మక్క-సారక్క జాతర;ఇప్పటివరకు దర్శించుకున్న 50లక్షల భక్తులు??

వన జాతర,జన జాతర,పోరాటానికి ప్రతీక అయిన ఆసియాలోనే అతిపెద్దదైన ఆదివాసి జాతర దక్షిణ భారత కుంబమేళా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా ప్రారంబమైంది. 4000ఆర్టిసి బస్సులు,18ప్రత్యేక రైళ్లు,181కోట్లతో ప్రత్యేక సదుపాయాలు,10000మంది పోలీసు బలగాలు,1000ఎకరాల పార్కింగ్ స్థలం మొట్టమొదటిసారి తెలంగాణా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హేలిక్యాప్టార్ సేవలు కల్పించగా ఈరోజు జాతర పగిడిద్ద రాజు,గోవిందరాజు రాకతో ఘనంగా స్టార్ట్ కాగా కొద్ది క్షణాల క్రితం కన్నేపెల్లి గ్రామస్థులు ఘన స్వాగతాలతో సారలమ్మ గద్దె చేరడంతో మేడారం పులకించిపోయింది.గత వారం రోజులుగా సుమారు 30లక్షల మంది భక్తులు రాగ ఈరోజు సుమారుగా 20లక్షల మంది దర్శించుకోగా ,రేపు కీలకమైన సారక్క గద్దె నెక్కనుంది,రేపు భక్తుల రద్దీ పెరగనుండటం తో ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 

No comments:

Post a Comment