సుఖోయ్ సూపర్ జెట్ 100స్పేర్ పార్ట్స్ @హైదరాబాద్ టాటా
అంతర్జాతీయ విహంగ విపణిలో 'బ్రాండ్ హైదరాబాద్' ప్రత్యేక స్థానం దక్కనుంది. తక్కువ నిర్వాహణ వ్యయం ,పరిమిత సిబ్బంది ,గణనీయంగా ఇందనం ఆదా అయ్యే సుకోయ్ సూపర్ జెట్ 100 సంస్థ విమానాల విడిబాగాలకు హైదరాబాద్ లోని టాటా అద్వాన్సుడ్ సిస్టం తో ఒప్పందానికి ముందుకొచ్చింది. సింగపూర్ లో జరుగుతున్న ఎయిర్ షో 2016కు హాజరైన సుఖోయ్ సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఉపాధ్యక్షుడు ఈజెన్ టాటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు . 20సూపర్ జెట్ విమానాలను ఇప్పటికే మెక్సికో లోని ఇంటర్జేట్ సంస్థకి అందజేసిన సుఖోయ్ రానున్న రోజులల్లో పెద్ద ఎత్తున సూపర్ జెట్ విమానాలను అంతర్జాతీయ విహంగ విపణిలో ప్రవేశపెట్టనుంది. ఈ ఒప్పందంతో హైదరాబాద్ ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మరో మెట్టు ఎక్కనుంది. అలాగే సుఖోయ్ సంస్థ సుఖోయ్ విమానాలను భారతీయ విమానయాన రంగంలో ప్రవేశపెట్టేందుకు ఇండియన్ ఎయిర్ లైన్స్ తో చర్చలు జరపనుంది.
No comments:
Post a Comment