పేదలందరికి ఈ ఏడాది కెసిఆర్ 2లక్షల డబల్ బెడ్ రూమ్ ఇళ్ల దమాక ???
తెలంగాణా ప్రభుత్వం ఈ ఏడాది పేదలందరికి డబల్ దమాక ఇవ్వనుంది.ముఖ్యమంత్రి కెసిఆర్ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బాగంగా ఈ ఏడాది గ్రేటర్ పరిదిలో లక్ష ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చాడు,ఇప్పుడు ఆ హామీని డబల్ చేయాలని కెసిఆర్ ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ ఏడాది గ్రేటర్ లో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు తోడుగా మరో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించి ఇయ్యడానికి ప్రణాళిక సిద్దం చెయ్యాలని అధికారులకు కెసిఆర్ ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ రెండు లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లు గ్రేటర్ పరిదిలో ,మరో లక్ష మిగితా తొమ్మిది జిల్లాల పరిదిలో కట్టించాలని నిర్ణయించారు. ఈ రెండు లక్షల డబల్ బెడ్ రూమ్ ఇళ్ళకు ఈ బడ్జెట్ లో 14000కోట్లు కేటాయించాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ఇతర బ్యాంకుల్లో రుణాలకు ప్రయత్నించాలని చూస్తున్నారు.
No comments:
Post a Comment