వైద్య,ఆరోగ్య శాఖ ప్రక్షాళన,బడ్జెట్ కేటాయింపులపై కెసిఆర్ సమీక్ష
తెలంగాణాలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ మెరుగుపరిచి,ప్రక్షాళన చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించుటకు వైద్య,ఆరోగ్య శాఖలకు బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి కెసిఆర్ తన అధికారిక నివాసంలో మంత్రి లక్ష్మారెడ్డి ,అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కెసిఆర్ మాట్లాడుతూ వైద్య,ఆరోగ్య శాఖ బలోపేతానికి ఎన్ని నిదులుకావలన్న కేటాయిస్తానని,వరంగల్ హెల్త్ యునివర్సిటీ పరిదిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి,మెడికల్ కాలేజీ ని ప్రస్తుతం సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో నిర్మించాలని,ప్రతి జిల్లాలో 4చోట్ల,మొత్తం 40చోట్ల ప్రభుత్వ ఎంఆర్ఐ,సిటీ స్కాన్,ఆల్ట్రా సౌండ్ ,మెమో గ్రామ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని,కరీంనగర్,సూర్యాపేట,ఖమ్మం ఆస్పత్రులను అప్ గ్రేడ్ చేసి కొత్త భవనాలను నిర్మించాలని,108,104సేవలను మెరుగుపరిచేందుకు ప్రణాళిక రూపొందించాలని ,హై వే ల వెంట ట్రామా కేర్ కేంద్రాలను ప్రారంబించాలని,హైదరాబాద్ లో మరో 4వెయ్యి పడకల ఆస్పత్రిలను ఏర్పాటు చేయాలని ,ఉప్పల్-ఎల్ బి నగర్ ,మల్కాజ్గిరి -కంటోన్మెంట్,కూకట్ పెల్లి -కుత్బుల్లాపూర్ పరిదిలో వెయ్యి పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని,కింగ్ కోఠి ఆస్పత్రిని వెయ్యి పడకల ఆస్పత్రి గా మార్చాలని,ప్రభుత్వ ఆస్పత్రులు కార్పోరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దేందుకు అనువైన ప్రణాలికను రూపొందించాలని కెసిఆర్ పేర్కొన్నారు.
No comments:
Post a Comment