ADD

Thursday, 18 February 2016

'రైతే రాజు' లక్ష్యంగా కెసిఆర్ సుదీర్ఘ సమీక్ష

'రైతే రాజు' లక్ష్యంగా కెసిఆర్ సుదీర్ఘ సమీక్ష 

తెలంగాణా రైతన్నను ఆదుకుని రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ న్యాక్ లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇన్ని రోజులు మూస పద్దతిలో వ్యవసాయ రంగానికి అరకొర నిధులు కేటాయిస్తూ రైతన్నను నిర్లక్ష్యం చేసిన గత పాలకులకు బిన్నంగా మూస పద్దతిలో కాకుండా ఆత్మీయ పద్దతిలో ప్రణాళిక సిద్దం చేయాలని కెసిఆర్ సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ రైతన్నకు మార్కెట్ ,అవసరాలకు,డిమాండు కు అనుగుణంగా పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని,వ్యవసాయ శాఖ,ఉద్యానవన శాఖ ,వ్యవసాయ యునివర్సిటీ మద్య సమన్వయం తో ముందుకెళ్ళాలని,రాష్ట్రంలో గ్రీన్ హౌస్ కల్టివేషన్ ,మైక్రో ఇరిగేషన్ పెరగాలని,రాష్ట్రానికి ఎన్ని విత్తనాలు కావాలి ,ఎంత విత్తనోత్పత్తి జరుగుతుంది ,రాష్ట్రంలో ఇంకా ఎంత విత్తన ఉత్పత్తి చేయగలమో పరిశోధనలు జరిపి ,మన రాష్ట్రంలో అనేక విత్తనోత్పత్తి సంస్థలు ఉన్న దృష్ట్యా ,తెలంగాణా సీడ్ డెవెలప్మెంట్ కార్పోరేషన్ వారితో సమన్వయంతో కదులుతూ విత్తనోత్పత్తి ప్రణాలికలు రూపొందించి కొత్త వంగడాలను రూపొందిస్తూ తెలంగాణాను ప్రపంచ విత్తనోత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలి,రాష్ట్రంలో వర్షపాతం కి అనుగుణంగా పంట ప్రణాళికలను ఎప్పటికప్పుడు సిద్దం చేస్తూ రైతులకు ప్రణాళికలకు అనుగుణంగా పంటలు వేసే విదంగా అవగాహన పెంచాలని ,తెలంగాణా కి అవసరమైన కూరగాయల సాగును పెంచాలని,తెలంగాణా భూములు పసుపు ,మిర్చి ,అల్లం సాగుకు అనువైనవి కనుక రైతులకి ఈ పంటలపై అవగాహన పెంచుతూ ,రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ,సేంద్రీయ ఎరువులు వాడేలా చర్యలు తీసుకోవాలని ,తెలంగాణాలో పత్తి పంట అధికంగా సాగుచేస్తూ నష్టపోతున్న రైతులను లాభసాటిగా ఉండే మొక్కజొన్న ,సోయా సాగుకు మున్డుకొచ్చేల అవగాహన కల్పించాలని,రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచాలని,వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచేలా ప్రణాళికలు సిద్దం చేయాలని కెసిఆర్ సూచించారు. 

No comments:

Post a Comment